ప్రధాన కంటెంట్‌కు దాటవేయి
ప్రస్తుత భారత జట్టులో డ్యాషింగ్‌ బ్యాట్స్‌మన్‌గా విరాట్‌ కోహ్లికి ఘనమైన చరిత్ర ఉంది. సెంచరీల మీద సెంచరీలు చేయడమే కాదు అనేక మ్యాచుల్లో భారత్‌ను గెలిపించిన ఘనత అతనిది. మూడు ఫార్మెట్లలోనూ సారథిగా బాధ్యతలు చేపట్టి జట్టుకు వరుస విజయాలను కోహ్లి అందిస్తూ వచ్చాడు. జట్టు ప్రతిష్టను పెంచాడు. కానీ కోహ్లిపై ఒక మచ్చ ఉంది. అదే కీలకమైన ఫైనల్‌ మ్యాచుల్లో ఆడకపోవడం. విరాట్‌ కోహ్లి ఇప్పటివరకు ఎనిమిది ఫైనల్‌ మ్యాచులు ఆడాడు. కానీ ఒక్క ఫైనల్‌ మ్యాచ్‌లోనూ కోహ్లి సెంచరీగానీ, అర్ధసెంచరీగానీ చేయలేదు. ఈ ఎనిమిది ఫైనల్‌ మ్యాచుల్లోనూ కోహ్లి బ్యాటింగ్‌ సగటు 22 మాత్రమే.

అత్యంత కీలకమైన చాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌ మ్యాచ్‌లోనూ కోహ్లి చేతులెత్తేశాడు. ఆమిర్‌ బౌలింగ్‌లో మొదట స్లిప్‌లో క్యాచ్‌ మిస్‌ అయి.. లైఫ్‌ దొరికినా.. దానిని కోహ్లి సద్వినియోగం చేసుకోలేదు. ఆ వెంటనే ఆమిర్‌ బౌలింగ్‌లోనే కోహ్లి పెవిలియన్‌ బాట పట్టాడు. ఫైనల్‌లో ఏమాత్రం ఆడిన ఘనత లేని కోహ్లి దాయాది పోరులో ఇంతకన్నా ఎక్కువ స్కోరు చేస్తాడని తాము ఆశించలేమని పలువురు నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు