మోక్షం అంటే భగవంతుని చేరడం కాదు. ఆయనొక మనిషిలా ఎక్కడో స్వర్గంలో ఉంటాడు. ఆయనను చేరుకుంటే మనకు మోక్షం కలుగుతుందని అనాది నుండి మనిషి భావన. శక్తిహీనమైన శరీరం, మనస్సు ఆ స్థాయి నుండి అంచెలంచెలుగా శక్తిని పెంచుకుని, రెండూ పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని 100% కలిగి ఉండడమే మోక్షం.
భగవంతుడు నిరాకారుడు. ఆయన ఒక శక్తి. ఆ శక్తికి ప్రేమ, సహనం, ఓర్పు, దయ, జాలి, శాంతి మొదలగు లక్షణాలు ఉన్నాయి. ఆలాగే ప్రతి ప్రాణిలో కూడా ఈ లక్షణాలుంటాయి. ఈ లక్షణాలను వ్యక్తి కోల్పోవడం వలన సామాన్యుడయ్యాడు. అదే వ్యక్తి తిరిగి ఆ లక్షణాలను పూర్తి స్థాయిలో పెంచుకొని జీవించడమే మోక్షం.
ఈ లక్షణాలు పరిపూర్ణంగా పెరిగిన వ్యక్తి, దేహంతో ఉన్నపుడు చేసే ప్రతి పని విజయాన్ని పొందుతుంది. ఆ విజయమే మోక్షం. ప్రతి విషయంలోనూ స్పష్టమైన అవగాహన ఉంటుంది. ఆ అవగాహనే మోక్షం. కోరికలను అనుభవించకున్నా, వాటి వలన కలిగే తృప్తిని అనంతంగా కలిగి ఉంటాడు. అదే మోక్షం. చుట్టూ అనేక సమస్యలు చుట్టిముట్టి ఉన్నా ఏమాత్రం చలించకుండా ఉత్సాహాన్ని , ఉల్లాసాన్శి కలిగి ఉంటాడు. అదే నిజమైన మోక్షం.
భగవంతుడు ఎలా నిరాకారంగా ఉండి, పై లక్షణాలు మాత్రమే కలిగి ఉన్నాడో అలాగే వ్యక్తి దేహంలోని ఆత్మ కూడా నిరాకారమే. ఆ ఆత్మకు కూడా పై లక్షణాలు ఉన్నాయి. అవి పరిమితంగా ఉన్నాయి. అందుకే భగవంతునికి ఉన్న సామర్థ్యాలు అంత అధికంగా తనలో లేకపోయినా, ఉన్న పరిమిత సామర్థ్యంతో అన్ని పనులూ చేయగలడు. విజయాన్ని పొందగలడు. అయితే అదే వ్యక్తి సాధన ద్వారా గాని, ఇతర ఏ పద్దతుల ద్వారా గాని ఆ లక్షణాల సామర్థ్యాన్ని పెంచుకొని ఉన్నట్లైతే, మరణించాక ఆ ఆత్మ భగవంతుని సమమైన స్థితి కలిగి ఉన్నందున శరీరం నుండి వేరై ఆ శక్తిలో ఒక భాగమైహకలిసి పోతుంది. దీనినే మోక్షం అంటారు.... సర్వేజనాసుఖినోభవతుః

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి