2017-18 విద్యాసంవత్సరం ప్రారంభం రోజైన సోమవారం నాడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 169 రెసిడెన్షియల్ స్కూళ్లు ప్రారంభమయ్యాయి. వీటిలో 119 బిసి, 50 మైనారిటీ రెసిడెన్షియల్స్ ఉన్నాయి. ఈ నెల 15న మరో 50, మరో 21 మైనారిటీ రెసిడెన్షియల్స్ 19న ప్రారంభం కానున్నాయి. ఇవి కాకుండా 15 ఎస్టీ మహిళల డిగ్రీ కాలేజీలు కూడా ఇదే విద్యా సంవత్సరం ప్రారంభం కానున్నాయి. దీంతో 2017-18 విద్యా సంవత్సరంలో ప్రభుత్వం ప్రారంభిస్తున్న రెసిడెన్షియల్స్ సంఖ్య 255కు చేరుకుంటుంది. తెలంగాణ రాకముందు ఎస్సీలకు 134 రెసిడెన్సియల్స్ ఉండేవి. తెలంగాణ వచ్చిన మరుసటి సంవత్సరమే ఎస్సీలకు 104 రెసిడెన్షియల్ స్కూళ్లు, ఎస్సీ మహిళల కోసం 30 డిగ్రీ రెసిడెన్షియల్స్ ప్రారంభించారు. తెలంగాణ రాకముందు ఎస్టీలకు 94 రెసిడెన్షియల్స్ ఉండేవి. తెలంగాణ వచ్చిన తర్వాత కొత్తగా ఎస్టీల కోసం 51 రెసిడెన్షియల్స్ ను గతేడాది ప్రారంభించారు. ఈ ఏడాది ఎస్టీ మహిళల కోసం కొత్తగా 15 డిగ్రీ రెసిడెన్షియల్స్ త్వరలో ప్రారంభిస్తున్నారు. తెలంగాణ రాకముందు బిసిలకు కేవలం 19 రెసిడెన్షియల్స్ ఉండేవి. తెలంగాణ వచ్చిన మరుసటి ఏడాది 5 బిసి రెసిడెన్షియల్స్ ప్రారంభమయ్యాయి. ఈ విద్యా సంవత్సరం 119 రెసిడెన్షియల్స్ ప్రారంభమవుతున్నాయి. తెలంగాణ రాకముందు మైనారిటీలకు రెసిడెన్షియల్స్ లేవు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత సంవత్సరమే కొత్తగా 71 మైనారిటీ రెసిడెన్షియల్స్ ప్రారంభించడంతో పాటు, 12 ప్రభుత్వ రెసిడెన్షియల్స్ ను మైనారిటీ రెసిడెన్షియల్స్ గా మార్చారు. ఈ ఏడాది మరో 121 రెసిడెన్షియల్స్ మైనారిటీల కోసం ప్రారంభిస్తున్నారు. దీంతో మైనారిటీ రెసిడెన్షియల్స్ సంఖ్య 204కు చేరింది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి