ప్రధాన కంటెంట్‌కు దాటవేయి
     2 నుంచి 9వ తేదీ వరకు
విజయవాడలో శ్రీవేంకటేశ్వర వైభవోత్సవాలు

టిటిడి శ్రీవేంకటేశ్వర వైభవోత్సవాల ప్రాజెక్టు ఆధ్వర్యంలో జులై 2 నుంచి 9వ తేదీ వరకు  విజయవాడలోని పిడబ్ల్యుడి మైదానాల్లో శ్రీవేంకటేశ్వర వైభవోత్సవాలు జరుగనున్నాయి. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవేంకటేశ్వరస్వామివారు కొలువైన తిరుమల ఆలయంలో రోజువారీ నిర్వహించే సేవలను ఇతర ప్రాంతాల్లోని భక్తులు దర్శించేందుకు వీలుగా టిటిడి పలు ప్రాంతాల్లో  శ్రీవేంకటేశ్వర వైభవోత్సవాలను నిర్వహిస్తున్న విషయం విదితమే.

ఇందుకోసం విజయవాడలోని పిడబ్ల్యుడి మైదానాల్లో శ్రీవారి నమూనా ఆలయం ఏర్పాటుచేసి ఉదయం 6.30 గంటలకు సుప్రభాతంతో ప్రారంభించి రాత్రి 9.00 గంటలకు ఏకాంత సేవ వరకు కైంకర్యాలు నిర్వహిస్తారు. రోజువారీ కార్యక్రమాల వివరాలిలా ఉన్నాయి. ఉదయం 6.30 గంటలకు సుప్రభాతం, ఉదయం 7 నుంచి 8 గంటల వరకు తోమాలసేవ, కొలువు, ఉదయం 8 నుంచి 8.45 గంటల వరకు అర్చన, ఉదయం 8.45 నుంచి 9 గంటల వరకు నివేదన, శాత్తుమొర, ఉదయం 9 నుంచి 10 గంటల వరకు ప్రత్యేక సేవ, ఉదయం 10 నుంచి 10.30 గంటల వరకు రెండో నివేదన చేపడతారు. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు భక్తులకు సర్వదర్శనం కల్పిస్తారు. సాయంత్రం 5.45 నుంచి 6.30 గంటల వరకు సహస్రదీపాలంకార సేవ, సాయంత్రం 6.30 నుంచి రాత్రి 7.15 గంటల వరకు వీధి ఉత్సవం, రాత్రి 7.15 నుంచి 8.30 గంటల వరకు రాత్రి కైంకర్యాలు, రాత్రి 8.30 నుంచి 9 గంటల వరకు ఏకాంతసేవ నిర్వహిస్తారు.

జులై 2, 3వ తేదీల్లో సాయంత్రం 5 నుంచి రాత్రి 8 గంటల వరకు ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలతో ధార్మికోపన్యాసాలు నిర్వహిస్తారు. ప్రత్యేక సేవల్లో భాగంగా జులై 4న అష్టదళ పాదపద్మారాధన, జులై 5న సహస్రకలశాభిషేకం, జులై 6న తిరుప్పావడ, జులై 7న అభిషేకం, జులై 8న వసంతోత్సవం, శ్రీనివాస కల్యాణం, జులై 9న పుష్పయాగం నిర్వహిస్తారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు