ప్రధాన కంటెంట్‌కు దాటవేయి
నంద్యాల ఉప ఎన్నికలో విజయం ఎవరిని వరించబోతుంది??
విశ్లేషణ..

2014 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో తెదెపా గెలిచిన తరువాత పలు సందర్భాలలో ఉపఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు జరగవలసిన పరిస్థితి వచ్చినప్పటికీ ఏదో ఒక సాకుతో ఎన్నికలు వాయిదా వేస్తూ తెప్పదాటుకుంటూ వచ్చిన చంద్రబాబుకి వై.సీ.పీ లో గెలిచి తెదెపా వైపు ఫిరాయించిన భూమా నాగిరెడ్డి మరణంతో అనివార్య పరిస్థితిలో ఉప ఎన్నిక జరుగుతుంది.

ప్రభుత్వం ఏర్పడిన మూడున్నర సంవత్సరాలకు జరుగుతున్న తొట్టతొలి ప్రత్యక్ష ఎన్నిక కావటంతో రాష్ట్రప్రజలందరి దృష్టీ ఈ ఎన్నికల మీద పడింది. ఇంకో 48గంటల్లో జరగనున్న ఈ ఎన్నికలో ఎవరి బలాబలాలేంటో ఒక చిన్న విశ్లేషణ చేద్దాం..

నేను నంద్యాల వెళ్లలేదు. చరిత్ర, రికార్డ్స్, జరుగుతున్న పరిణామాల ఆధారంగా ఊహాజనితంగా నా ఆలోచనా శైలిలో ఇస్తున్న ఒక చిన్న విశ్లేషణ మాత్రమే..

ఎన్నిక అనగానే మొదట అభ్యర్ధిని, ఆ తరువాత అతను ఉన్న పార్టీని చూడటం ఆనవాయితీ..

నంద్యాల రాజకీయాన్ని తెలుగుదేశం స్థాపించబడిన తర్వాతి 33 సంవత్సరాల చరిత్ర ఆధారంగా విశ్లేషిద్దాం..

భూమా బ్రహ్మానంద రెడ్డి, భూమా నాగిరెడ్డి అన్న కొడుకుగా నంద్యాల ఉప ఎన్నికల ప్రకటన సమయంలో మాత్రమే వెలుగులోకి వచ్చిన పేరు ఇది. యువకుడు, అంత కలుపుగోలుగా, లౌక్యంగా వ్యవహరించే పరిణితి, అనుభవం రెండూ లేవని అతన్ని చూసిన ఎవరైనా ఇట్టే చెప్పేస్తారు. కేవలం భూమా కుటుంబ చరిత్ర, నాగిరెడ్డి మరణ సానుభూతి, తెదెపా కేడర్ మాత్రమే ఆయనకి ఉన్న బలం.

మరోవైపు శిల్పా మోహన రెడ్డి. రెండు సార్లు ఎమ్మెల్యే, వై.ఎస్. హయాంలో మంత్రి, దాదాపు మూడు దశాబ్దాల రాజకీయ అనుభవం, వై.సీ.పీ కేడర్, ఆయన సొంత కేడర్, గతంలో స్థాపించిన శిల్పా సహకార సమితి, ఛారిటబుల్ ట్రస్ట్, తమ్ముడు శిల్పా చక్రపాణి రెడ్డి లు ఆయన బలాలు.

ఇంక పార్టీల విషయానికొస్తే..

నంద్యాలలో మెజారిటీ ఓట్లు ముస్లిం సామాజికవర్గానికి చెందినవి. ఇక్కడ తెదెపా కి నాస్యం మహమ్మద్ ఫరూక్ అతిపెద్ద నాయకుడు. పలుమార్లు రాష్ట్ర మంత్రి, ఎంపీ గా ఎన్నికయ్యారు.

1985 లో ఫరూక్ తెదెపా నుండి 8000ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అబ్యర్ధిపై గెలుపొందారు.

1989 లో కాంగ్రెస్ అభ్యర్ధి రామ్ నాధ్ రెడ్డి తెదెపా అబ్యర్ధి ఫరూక్ పై 7000 ఓట్ల మెజారిటీ తో గెలిచారు.

1994లో ఫరూక్ తిరిగి 40వేల ఓట్ల భరీ మెజారిటీ తో కాంగ్రెస్ ముస్లిమ్ అభ్యర్ధి మక్బూల్ పై గెలుపొందారు.

1999లో ఫరూల్ కాంగ్రెస్ అభ్యర్ధి ఎ.స్పీ.వై. రెడ్డి పై కేవలం నాలుగు వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు.

2004 ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్ధి శిల్పా మోహన రెడ్డి వరుసగా మూడు సార్లు గెలిచిన ఫరూక్ పై 49వేల భారీ మెజారిటీ తో గెలిచారు. ఈ ఎన్నికలో ఫరూక్ కి 41వేల ఓట్లు వచ్చాయి.

2009 లో శిల్పా మోహన రెడ్డి తిరిగి 32 వేల ఓట్ల మెజారిటీతో ప్రజారజ్యం అభ్యర్ధి ఏవీ సుబ్బారెడ్డి(నాగిరెడ్డి అనుచరుడు) పై విజయం సాధించారు. ఈ ఎన్నికలో తెదెపా అబ్యర్ధి భాస్కర రెడ్డి 35 వెల ఓట్లు సాధించారు. అనగా త్రిముఖ పోరులో 2004 లో వచ్చిన ఓట్లలో కేవలం 7000ఓట్లు మాత్రమే తెదెపా కోల్పోయింది. అనగా ప్రజారాజ్యం లేకుంటే శిల్పా మోహన రెడ్డికి 2004 కన్నా కనీసం 10నుండి 15వేల మెజారిటీ ఎక్కువ వచ్చేది అనగా దాదాపు 60వేల ఓట్ల మెజారిటీ వచ్చేదన్నది సుష్పష్టం..

2014లో భూమా కుటుంబం వైసీపీ నుండి పోటీచేయగా శిల్పా తెదెపా నుండి పోటీ చేశారు. భూమా నాగిరెడ్డి శిల్పా మోహన్ రెడ్డిపై కేవలం 3600ఓట్ల మెజారిటీ తో గెలుపొందారు. ఈ ఎన్నికలో భుమా నాగిరెడ్డి 83వేల ఓట్లు సాధించగా శిల్పా మోహనరెడ్డి 79వేల ఓట్లు సాధించారు.
 విశ్లేషణ:
ఇక్కడ గత 20సంవత్సరలుగా పార్టీ బలాబలాలు అభ్యర్ధుల బలాబలాలపై విశ్లేషించుకుంటే..

2014లో తప్ప 1999నుండి తెదెపా ఇక్కడ 40వేల ఓట్లు దాటి సాధించిన దాఖలాలు కనిపించలేదు. 1999లో ఫరూక్ 44వేల ఓట్లు సాధించి 4వేల మెజారిటీతో విజయం సాధించారు. ఆ తరువాత నంద్యాల లో తెదెపా విజయ సాధన అందని ద్రాక్షనే అయింది.

2004 నుండి నంద్యాలలో శిల్పా హవా మొదలైందని చెప్పుకోవచ్చు. 2004 లో 90వేల ఓట్లు, 2009లో 68వేల ఓట్లు, 2014లో 79వేల ఓట్లు శిల్పా సాధించారు.

2009లో భూమా వర్గానికి చెందిన ఏవీ సుబ్బారెడ్డి 35వేల ఓట్లుసాధించగా 2014లో భూమా నాగిరెడ్డి 83వేల ఓట్లు సాధించారు.

2009 తర్వాత వై.ఎస్.ఆర్.సీ.పీ కాంగ్రెస్ ని నిర్వీర్యం చేసి దాని ఓటుబ్యాంకు మొత్తాన్ని తన వైపు తిప్పుకున్న విషయం తెలిసిందే..

అలా చూసుకుంటే 2004, 2009, 2014 ఎన్నికల ఫలితాల ప్రకారం నేటికి వైసీపీ సొంత ఓటు బ్యాంకు 50-60వేల ఓట్లు అనుకోవచ్చు. తెదెపా ఓటు బ్యాంకు 35-40 వేలు గా నిర్ధారించుకోవచ్చు.

ఇక కుటుంబాల విషయానికి వస్తే శిల్పా కుటుంబ ఓటు బ్యాంకు 40-45 వేలు ఉండగా భూమా కుటుంబ ఓటు బ్యాంకు కూడా దాదాపు 30-35 వేల వరకూ ఉందని అంచనా వేసుకోవచ్చు.

2014లో తెదెపా లో ఉన్న శిల్పా ఇప్పుడు వై.సీ.పీ లో ఉన్నారు, వై.సీ.పీ లో ఉన్న భూమా కుటుంబం ఇప్పుడు తెదెపా లో ఉన్నారు.

భూమా కుటుంబానికి తెదెపా ప్రో పార్టీ కాగా, శిల్పా కుటుంబానికి వైసీపీ ప్రో పార్టీ..
ప్రో పార్టీ లో ఉంటే శిల్పా కనీస మెజారిటీ 35వేలుగా ప్రిగణించాల్సిన అవ్సరం ఉంది. ప్రత్యర్ధి బలాన్ని బట్టి మెజారిటీ అక్కడి నుమ్డి తగ్గేదే లెక్కించుకోవాలి..

పది నుండి 20వేల మంది ఓటర్ల మీద  ఈ మధ్య మొదలేసిన రోడ్డు విస్తరణలు, ఇళ్ల నిర్మాణాల వంటి అభివృద్ధి కార్యక్రమాల ప్రభావం పడనుంది. వారికి తెదెపా మీద అభిమానం అనేకంటే తెదెపాని ఓడిస్తే కక్ష గట్టి తమని ఎక్కడ రోడ్డున పడేస్తారోనన్న భయమే ఎక్కువ నడిపించేలా ఉంది.

ఇలా అభివృద్ధి కార్యక్రమలకి మొగ్గి తెదెపాకి ఓటు వేసే వరితో పాటు, మూడున్నరేళ్లుగా ప్రభుత్వ వ్యతిరెక్తతో తెదెపా కోల్పోనున్న ఓట్లు కూడా సమానంగానే ఉన్నాయి.

ఇక సెంటిమెంట్ విషయానికి వస్తే, 2014లో శోభానాగిరెడ్డి మరణించినప్పుడు ఉన్నంత సానుభూతి నేడు భూమా మరణం పై లేదనే చెప్పుకోవాలి.

చివరి దశలొ తెదెపా చిత్రహింసలకు, ప్రలోభాలకు లొంగిపోయి తెదెపాలో చేరిన భూమా తన ప్రభను కోల్పోయారని అర్ధమవుతుంది. కాబట్టి సెంటిమెంట్ నామమాత్రమే..

చివరగా..

తెదెపా బలం, భూమా బలం, మైన ప్రభుత్వ వ్యతిరేకత కలుపుకుని తెదెపా కు 65-75 వేల ఓట్లు పడే అవకాశం కనిపిస్తుంది.

వైసీపీ బలం, శిల్పా బలం, ప్రభుత్వ వ్యతిరేకత, మైనస్ భూమా సెంటిమెంట్ కలిపి వైసీపీకి 85-95వేల ఓట్లు పడే అవకాశం కనిపిస్తుంది.
This is a post of bright thinkers group
సెం టిమెంటు బలంగా పండి, అభివృద్ధి కార్యక్రమాలు ఆగుతాయన్న భయంతో 15-20వేల ఓట్లు అటు ఇటు అయినా పోటాపోటీగా అనిపిస్తున్నా, ప్రభుత్వ వ్యతిరేకత, శిల్పా వైసీపీలొ చేరిన బలం లీడ్ తీసుకుంటే శిల్పా మెజారిటీ 30వేలు దాటిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.

గెలుస్తామని బీరాలు పలుకుతున్నా ఈ ఎన్నికని తెదెపా మూడున్నరేళ్ల పాలనకి రెఫరెండం అని తెదెపా ఇప్పటికీ ప్రకటించుకోలేకపోవటం తెదెపాకి గెలుపుపై నమ్మకమ్ లేదని స్పష్టం చేస్తుంది..

ఎలా చూసుకున్నా వైసీపీ విజయం అనేది ఖాయంగా కనిపిస్తుంది..

నోట్: ఇది గత చరిత్ర, అభ్యర్ధుల బలాబలల ఆధారంగా చేసిన ఊహాజనిత విశ్లేషణ మాత్రమే.....

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలంగాణా సర్కార్ లో కొత్త గా 6 మంత్రులు ప్రమాణ స్వీకారం

ఇస్రో సక్సెస్ లో మహిళ మూర్తులు

మౌమీతా దత్త-.విద్యార్థి దశలో ఇస్రొ వైపు ఆకర్షితురాలై.. మార్స్ మిషన్‌ ప్రాజెక్టు మెనెజర్‌గా పని చేస్తుంది ఎన్‌ వలమతి -మెదటి భారత రాడార్‌ ఇమెజింగ్‌ శాలిలైట్‌ రీసాట్‌1 తయారీ లో వాలమతి కీలక పాత్రం పోషించారు రీతు కలిథాల్‌ ఇద్దురు బిడ్డలకు తల్తి ఇంజనీర్‌ తో జరిగే అంతర్మాథనం వారాంతరంలో పాల్గోంటారు. థేసీ థామస్‌-మీసైల్ విమెన్‌ గా పేరు సంపాదించిన మహిళ,అగ్ని నాలుగు,అగ్ని ఐదు మిషన్‌ ను లీడ్‌ చేశారు. అనురాధ టికె-జియోశాట్‌ పొగ్రాం డైరక్టర్‌ గా ఇస్రొ సీనియర్‌ మహిళ అధికారిగా ఉన్నారు. మినాల్‌ సంపత్‌-మార్స్ అర్బిటల్‌ మిషన్‌ కు 18 గంటలు శ్రమంచారు. నందిని హరినాథ్-ఆమె మెట్టమెదటి ఉద్యోగం ఇస్రొలోనే... అలా కొనసాగుతూనే ఉంది.వెనుకకు తిరిగి చూడవలసిన అవసరం రాలేదు. కీర్తి పజుంథార్‌-కంప్యూటర్‌ సైన్టిస్ట్ ,మాస్టర్‌ కంట్రోల్‌ రూంలో శాటిలైట్‌లు సరైన కక్ష్యలో ఉంచే బాధ్యత..

అమెరికా ఎన్నిక‌లు.. భారతీయ భాష‌ల్లో డిజిట‌ల్‌ ప్ర‌క‌ట‌న‌లు

    అమెరికాలో అధ్య‌క్ష ఎన్నిక‌ల ప్ర‌చారం జోరందుకున్న‌ది. అధికార రిప‌బ్లిక‌న్‌లు, ప్ర‌తిప‌క్ష డెమోక్రాట్‌లు పోటీప‌డి ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నారు. ముఖ్యంగా ప్ర‌తిప‌క్ష డిమోక్రాట్‌లు అమెరికాలో ఉన్న‌ భారతీయుల మ‌న‌సులు దోచుకోవడానికి కొత్త‌కొత్త పోక‌డ‌ను అవ‌లంభిస్తున్నారు. మొత్తం 14 భారతీయ భాషల్లో త‌మ‌ అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్‌ గురించి డిజిటల్ ప్ర‌చార ప్ర‌క‌ట‌న‌లు రూపొందించారు. ఆ ప్ర‌క‌ట‌న‌ల ద్వారా ఇండో-అమెరిక‌న్‌ల ఓట్లు అడుగుతున్నారు.  ఆ డిజిట‌ల్ ప్ర‌క‌ట‌న‌ల్లో హామీలు, అభ్య‌ర్థ‌న‌ల‌తోపాటు కొటేష‌న్‌లు, పాట‌లు కూడా ఉన్నాయి. బిడెన్‍ ప్రచార బృందంలో కీలక సభ్యుడైన అజయ్‍ జైన్‍ భుటోరియా భార‌తీయ భాష‌ల్లో రూపొందించిన‌ డిజిట‌ల్ ప్ర‌క‌ట‌న‌ల గురించి వెల్ల‌డించారు. ఇప్పటికే విడుదల చేసిన 'ఛలో ఛలో.. బిడెన్‍ కో ఓట్‍ దో' అనే పాట తారస్థాయిలో ప్రాచుర్యం పొందిందని చెప్పారు. ఇప్పుడు తాజాగా 'జాగో అమెరికా జాగో.. భూల్‍ న జానా బిడెన్‍-హారిస్‍ కో ఓట్‍ దేనా' పేరుతో మ‌రో పాట‌ను విడుదల చేసిన‌ట్లు తెలిపారు.