గోదావరి, ప్రాణహిత, పెన్ గంగ నదులపై నిర్మించే ప్రాజెక్టుల విషయంలో పరస్పర అంగీకారం కుదుర్చుకుంటూ చేసిన ఒప్పందాలపై తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సంతకాలు చేశారు. ముంబయిలోని సహ్యాద్రి అతిథి గృహంలో మంగళవారం జరిగిన ఇంటర్ స్టేట్ వాటర్ బోర్డు సమావేశంలో ఈ చారిత్రక ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందంలో గోదావరి, ప్రాణహిత, పెన్ గంగలపై మూడు బ్యారేజిల నిర్మాణానికి ముఖ్యమంత్రులు పరస్పరం అంగీకారం తెలిపారు.
ఒప్పందం - 1
----------------
గోదావరి నదిపై 100 మీటర్ల ఎత్తులో, 16 టిఎంసిల నీటి నిల్వ సామర్థ్యంతో మేడిగడ్డ వద్ద బ్యారేజి నిర్మాణానికి అంగీకారం కుదిరింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించే ఈ బ్యారేజి ద్వారానే గోదావరి నీటిని తెలంగాణ రాష్ట్రం తీసుకుంటుంది. కరీంనగర్, వరంగల్, మెదక్, నిజామాబాద్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో 18.19 లక్షల ఎకరాలు కొత్తగా సాగులోకి వస్తాయి. శ్రీరాంసాగర్, నిజాంసాగర్, సింగూర్ జలాశయాల కింద మరో 18 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ చెందుతుంది.

ఒప్పందం - 2
----------------
ప్రాణహిత తమ్మిడిహట్టి వద్ద 148 మీటర్ల ఎత్తులో, 1.8 టిఎంసి ల నీటి నిల్వ సామర్థ్యంతో బ్యారేజి నిర్మాణం జరుగుతుంది. దీని వల్ల ఆదిలాబాద్ జిల్లాలోని ఆసిఫాబాద్, బెల్లంపల్లి, చెన్నూర్, సిర్పూర్ – కాగజ్ నగర్ నియోజకవర్గాల్లో రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందనున్నది.

ఒప్పందం - 3
----------------
పెన్ గంగపై 213 మీటర్ల ఎత్తులో 0.85 టిఎంసి ల నీటి నిల్వ సామర్థ్యంతో చనఖా – కొరాటా బ్యారేజి నిర్మాణం జరుగుతుంది. మహారాష్ట్రలోని పొలాలతో పాటు ఆదిలాబాద్ జిల్లాలోని తాంసి, జైనథ్, బేలా మండలాలకు సాగునీరు అందుతుంది.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి