ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

సెర్ప్, నరేగా ఉద్యోగుల వేతనాలు పెంపు

అతి తక్కువ వేతనాలతో పనిచేస్తున్న సెర్ప్, నరేగా ఉద్యోగుల వేతనాలు పెంచాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. పంచాయితీ రాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, సెర్ప్ సిఇఓ పౌసమిబసు తదితరులతో క్యాంపు కార్యాలయంలో సిఎం మంగళవారం సమీక్ష జరిపారు. సెర్ప్, నరేగాలో పనిచేస్తున్న ఉద్యోగుల వేతనాలపై చర్చించారు. వారి జీతాలు పెంచాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి ఈ సందర్బంగా అన్నారు. సెర్ప్ లో 4,174 మంది ఉద్యోగులుండగా, వారిలో 767 మంది మండల సమాఖ్య క్లస్టర్ కో-ఆర్డినేటర్లుగా పనిచేస్తున్నారు. ఈ క్లస్టర్ కో-ఆర్డినేటర్ల వేతనం ప్రస్తుతం రూ.6,150 ఉంది. దీన్ని రూ.12,000కు పెంచుతూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. మిగతా సెర్ప్ ఉద్యోగుల వేతనాలు 30 శాతం మేర పెంచాలని సిఎం ఆదేశించారు. మహాత్మాగాంధి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పది వేల మందికి పైగా పనిచేస్తున్నారు. వీరిలో 6,982 ఫీల్డ్ అసిస్టెంట్లు రూ.6,290 జీతంతో పనిచేస్తున్నారు. వీరి వేతనాన్ని రూ.10,000కు పెంచాలని సిఎం నిర్ణయించారు. నరేగాలోని మిగతా ఉద్యోగుల వేతనాలను 20శాతం మేర పెంచాలని ఆదేశించారు. పెంచిన జీతాలకు సంబంధించిన ఉత్తర్వులు వెంటనే విడుదల చేయాలని పంచాయితీ రాజ్ శాఖ మంత్రిని ఆదేశించారు 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు