ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

వర్ష ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు- 2 లక్షల రూపాయలు ఎక్సేగ్రేషియా

హైదరాబాద్ నగరంలో కురిసిన వర్షాల వల్ల మరణించిన వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు 2 లక్షల రూపాయలు ఎక్సేగ్రేషియా ప్రకటించారు. నిన్న రాత్రి నుంచి కురుస్తున్న వర్షాల వల్ల ప్రాణనష్టం సంభవించడం పట్ల ముఖ్యమంత్రి తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. నగరంలో ఇప్పటికే అసాధారణ వర్షాలు కురవడంతో పాటు, ఇంకా వర్ష సూచన ఉన్నందున అధికార యంత్రాంగమంతా అప్రమత్తంగా ఉండి సహాయక చర్యలు చేపట్టాలని సిఎం ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యల గురించి ముఖ్యమంత్రి బుధవారం మున్సిపల్ శాఖ మంత్రి కెటి రామారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, జిహెచ్ఎంసి కమీషనర్ జనార్ధన్ రెడ్డి, సిటి పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డిలతో మాట్లాడారు. వర్షాల వల్ల నగరంలో చాలా ప్రాంతాలు జలమయమయ్యాని ట్రాఫిక్ కూడా ఎక్కడికక్కడ స్తంభించిపోయిందని ముఖ్యమంత్రి అన్నారు. బస్తీల్లోకి నీరు రావడం వల్ల పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, వారిని మరోచోటికి తరలించాలని ఆదేశించారు. వర్ష ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి సహాయ చర్యలను పర్యవేక్షించాలని మంత్రి కెటిఆర్ ను, అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్ ను క్రమబద్దీకరించడంతో పాటు, ఇతర సహాయక చర్యల్లో పాల్గొనాల్సిందిగా నగర పోలీస్ కమీషనర్ ను సిఎం ఆదేశించారు. జిహెచ్ఎంసి లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ (040-21111111) కు అన్ని శాఖల అధికారులు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని, దానిని బట్టి అధికార యంత్రాంగం వేగంగా స్పందించి అవసరమైన చర్యలు చేపట్టాలని చెప్పారు. నగరంలో విద్యుత్, రహదారులు, డ్రైనేజి, మ్యాన్ హోల్స్ విషయాల్లో అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని కోరారు. నగర నలుమూలల నుంచి హుస్సేన్ సాగర్ కు భారీగా నీరు వచ్చి చేరుతున్నదని, అవసరాన్ని బట్టి నీటిని విడుదల చేయాలని ఆదేశించారు. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు