రాష్ట్రంలో కొత్తజిల్లాల చిత్రపటాలు సిద్ధమయ్యాయి. పునర్వ్యవస్థీకరణ ముసాయిదా ప్రకటించిన ప్రభుత్వం అందుకు అనుగుణంగా ప్రతిపాదిత జిల్లాల చిత్రపటాలను సిద్ధం చేసింది. తెలంగాణ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ ఈఆర్‌ఏసీ సహాయంతో భూపరిపాలన ప్రధాన కమిషనర్ రేమండ్ పీటర్ వీటిని రూపొందించారు. మొత్తం 27 ప్రతిపాదిత జిల్లాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఇందులో పొందుపరిచారు. జిల్లా సరిహద్దులు, అందులోని శాసనసభ నియోజకవర్గాలు, మండలాలు, వాటి సరిహద్దులతో పాటు రైల్వే మార్గాలు, జాతీయ, రాష్ట్ర రహదార్లు, నదులు, జల వనరులతో పాటు జలాశయాల వివరాలను పటాల్లో ఉంచారు. ప్రతిపాదిత 27 జిల్లాలతో కూడిన రాష్ట్ర పటంతో పాటు 27 జిల్లాల పటాలను కొత్త జిల్లాల ఏర్పాటుపై అందుబాటులోకి వచ్చాయి.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి