ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

డబుల్ బెడ్ రూమ్ఇండ్ల నిర్మాణ0 వేగవంతం

రాష్ట్రంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ఆదేశించారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో నిర్మించే ఇండ్ల కోసం వేర్వేరు పద్ధతులు అవలంభించాలని చెప్పారు. హైదరాబాద్ నగరంలో పేదల బస్తీలను అన్ని మౌలిక సదుపాయాలతో మంచి లే-అవుట్ కాలనీలుగా తీర్చిదిద్దాలని అన్నారు. బలహీన వర్గాల గృహ నిర్మాణాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో కొత్త విధానం అవలంభిస్తున్నందున, సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పద్ధతులను కొనసాగించాల్సిన అవసరం లేదని సిఎం స్పష్టం చేశారు.
డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణంపై సిఎం క్యాంపు కార్యాలయంలో ఆదివారం సమీక్ష నిర్వహించారు.
జిల్లాల్లో రెండు లక్షలు, హైదరాబాద్ నగరంలో లక్ష ఇండ్ల నిర్మాణం కోసం అనువైన ప్రణాళికలు సిద్ధం చేసి, అమలు చేయాలన్నారు. ప్రస్తుతం ఉన్న బస్తీలను మంచి కాలనీలుగా మార్చాలని చెప్పారు. ఇప్పటికే నిర్మాణంలో ఉన్న గృహ సముదాయాల పనులను వేగవంతం చేయాలని కోరారు. నగరంలో పేదల బస్తీలను అన్ని వసతులతో కూడిన కాలనీలుగా మార్చే క్రమంలో మంచినీరు, అంతర్గత రహదారులు, డ్రైనేజీలు, విద్యుత్ లాంటి మౌలిక సదుపాయాలు కూడా ప్రభుత్వ పరంగానే కల్పించాలని చెప్పారు. ఇంకా పేదల కోసం ఇండ్లు నిర్మించేందుకు గృహ నిర్మాణ శాఖ వద్ద స్థలాలతో పాటు దిల్, టి.ఎస్.ఐ.ఐ.సి. ఆధీనంలో ఉన్న భూములు కూడా వినియోగించాలని చెప్పారు. అవసరమైతే ప్రభుత్వ భూములను కూడా కేటాయించడానికి సిద్ధమన్నారు.
గ్రామీణ ప్రాంతాల మాదిరిగా హైదరాబాద్ లో ఇండ్ల నిర్మాణం కోసం ఎక్కువ స్థలం దొరకదు కాబట్టి, బహుళ అంతస్థుల భవనాలు నిర్మించాలని సిఎం సూచించారు. మూడు నుంచి తొమ్మిది అంతస్తుల వరకు బహుళ అంతస్తుల భవనాలు నిర్మించాలని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా పెద్ద కట్టడాలకు మైవాన్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నందున హైదరాబాద్ ఇండ్ల నిర్మాణం కోసం ముందుకొచ్చే సంస్థలకు ఆ టెక్నాలజీ వాడుకోవడానికి అనుమతించాలని చెప్పారు. ఇండ్ల నిర్మాణానికి ముందుకొచ్చిన సంస్థలతో చర్చలు జరిపి, ఒప్పందాలు ఖరారు చేయాలని ఆదేశించారు. సులభంగా, తొందరగా ఇండ్లు కట్టడానికి ఏ పద్దతి అందుబాటులో ఉంటే దాన్ని అవలంభించాలని ఆదేశించారు.
బలహీన వర్గాలు, పేదల కోసం కట్టే ఇండ్లకు అవసరమయ్యే ఇసుకను ఉచితంగా అందచేయాలని నిర్ణయించామని, సిమెంట్ కంపెనీలతో మాట్లాడి ఫ్యాక్టరీ ధరకే సిమెంటు కూడా ఇప్పించే ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. హైదరాబాద్ నగరంలో నిర్మాణంలో ఉన్న వాంబే, జె.ఎన్.ఆర్.ఎం. గృహాలను త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పారు. దీనికి కావాల్సిన నిధులు మంజూరు చేయడానికి సిఎం సంసిద్ధత వ్యక్తం చేశారు. రాజీవ్ స్వగృహ ద్వారా నిర్మించిన ఇండ్లను ప్రభుత్వ ఉద్యోగులకు, పోలీసులకు కేటాయించాలని ఇప్పటికే నిర్ణయించినందున, దీనికి సంబంధించిన విధి విధానాలు రూపొందించాలని చెప్పారు.
జిల్లాలలో ఇప్పటికే డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం ప్రారంభమయిందని, వాటి వేగం కూడా పెంచాలని చెప్పారు. స్థానికంగా ఉండే కాంట్రాక్టర్లకు పనులు అప్పగించాలన్నారు. ఎక్కడి వారు అక్కడ ఇండ్లు కట్టుకోవడం మంచిదని చెప్పారు. ఈ విషయంలో ఎమ్మెల్యేలు చొరవ చూపాలని కోరారు. లబ్ధిదారుల ఎంపిక, పనుల అప్పగింత తదితర వ్యవహారాలను కలెక్టర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని చెప్పారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలంగాణా సర్కార్ లో కొత్త గా 6 మంత్రులు ప్రమాణ స్వీకారం

ఇస్రో సక్సెస్ లో మహిళ మూర్తులు

మౌమీతా దత్త-.విద్యార్థి దశలో ఇస్రొ వైపు ఆకర్షితురాలై.. మార్స్ మిషన్‌ ప్రాజెక్టు మెనెజర్‌గా పని చేస్తుంది ఎన్‌ వలమతి -మెదటి భారత రాడార్‌ ఇమెజింగ్‌ శాలిలైట్‌ రీసాట్‌1 తయారీ లో వాలమతి కీలక పాత్రం పోషించారు రీతు కలిథాల్‌ ఇద్దురు బిడ్డలకు తల్తి ఇంజనీర్‌ తో జరిగే అంతర్మాథనం వారాంతరంలో పాల్గోంటారు. థేసీ థామస్‌-మీసైల్ విమెన్‌ గా పేరు సంపాదించిన మహిళ,అగ్ని నాలుగు,అగ్ని ఐదు మిషన్‌ ను లీడ్‌ చేశారు. అనురాధ టికె-జియోశాట్‌ పొగ్రాం డైరక్టర్‌ గా ఇస్రొ సీనియర్‌ మహిళ అధికారిగా ఉన్నారు. మినాల్‌ సంపత్‌-మార్స్ అర్బిటల్‌ మిషన్‌ కు 18 గంటలు శ్రమంచారు. నందిని హరినాథ్-ఆమె మెట్టమెదటి ఉద్యోగం ఇస్రొలోనే... అలా కొనసాగుతూనే ఉంది.వెనుకకు తిరిగి చూడవలసిన అవసరం రాలేదు. కీర్తి పజుంథార్‌-కంప్యూటర్‌ సైన్టిస్ట్ ,మాస్టర్‌ కంట్రోల్‌ రూంలో శాటిలైట్‌లు సరైన కక్ష్యలో ఉంచే బాధ్యత..

అమెరికా ఎన్నిక‌లు.. భారతీయ భాష‌ల్లో డిజిట‌ల్‌ ప్ర‌క‌ట‌న‌లు

    అమెరికాలో అధ్య‌క్ష ఎన్నిక‌ల ప్ర‌చారం జోరందుకున్న‌ది. అధికార రిప‌బ్లిక‌న్‌లు, ప్ర‌తిప‌క్ష డెమోక్రాట్‌లు పోటీప‌డి ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నారు. ముఖ్యంగా ప్ర‌తిప‌క్ష డిమోక్రాట్‌లు అమెరికాలో ఉన్న‌ భారతీయుల మ‌న‌సులు దోచుకోవడానికి కొత్త‌కొత్త పోక‌డ‌ను అవ‌లంభిస్తున్నారు. మొత్తం 14 భారతీయ భాషల్లో త‌మ‌ అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్‌ గురించి డిజిటల్ ప్ర‌చార ప్ర‌క‌ట‌న‌లు రూపొందించారు. ఆ ప్ర‌క‌ట‌న‌ల ద్వారా ఇండో-అమెరిక‌న్‌ల ఓట్లు అడుగుతున్నారు.  ఆ డిజిట‌ల్ ప్ర‌క‌ట‌న‌ల్లో హామీలు, అభ్య‌ర్థ‌న‌ల‌తోపాటు కొటేష‌న్‌లు, పాట‌లు కూడా ఉన్నాయి. బిడెన్‍ ప్రచార బృందంలో కీలక సభ్యుడైన అజయ్‍ జైన్‍ భుటోరియా భార‌తీయ భాష‌ల్లో రూపొందించిన‌ డిజిట‌ల్ ప్ర‌క‌ట‌న‌ల గురించి వెల్ల‌డించారు. ఇప్పటికే విడుదల చేసిన 'ఛలో ఛలో.. బిడెన్‍ కో ఓట్‍ దో' అనే పాట తారస్థాయిలో ప్రాచుర్యం పొందిందని చెప్పారు. ఇప్పుడు తాజాగా 'జాగో అమెరికా జాగో.. భూల్‍ న జానా బిడెన్‍-హారిస్‍ కో ఓట్‍ దేనా' పేరుతో మ‌రో పాట‌ను విడుదల చేసిన‌ట్లు తెలిపారు.