ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

తెలంగాణలో ఎస్టీలకు జనాభా ప్రకారం రిజర్వేషన్లు

తెలంగాణలో బలహీనవర్గాలు ఎక్కువ సంఖ్యలో ఉన్నందున అందుకునుగుణంగా రిజర్వేషన్లు పెంచుకోవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు అన్నారు. తమిళనాడు తరహాలో ప్రత్యేక చట్టం తెచ్చి ముస్లింలకు జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు కల్పిస్తామని స్పష్టం చేశారు. ఎస్టీలకు జనాభా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలనేది రాజ్యాంగ నిబంధన కాబట్టి, అందుకునుగుణంగా తెలంగాణలో ఎస్టీల రిజర్వేషన్ పెంచే విషయంలో తగు చర్యలు తీసుకుంటామని సిఎం వెల్లడించారు. ఎస్టీలు, మైనారిటీల సామాజిక, ఆర్థిక స్థితిగతులపై అధ్యయనం జరిపిన చెల్లప్ప, సుధీర్ కమిషన్లు శుక్రవారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రికి నివేదికలు అందచేశాయి.
 తెలంగాణలో ముస్లింలకు అత్యంత పెదరికంలో ఉన్నారు కాబట్టి, వారికి విద్య, ఉపాధి అవకాశాలు కల్పించడానికి రిజర్వేషన్లు తప్పనిసరి అని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించే విషయంలో త్వరలోనే కేబినెట్ సమావేశం ఏర్పాటు చేస్తామని, తర్వాత ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు కూడా నిర్వహించి ప్రత్యేక చట్టం తెస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు. షెడ్యూల్ తెగల వారికి జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని రాజ్యాంగమే చెబుతున్నదని, దాని ప్రకారం తెలంగాణలో ఎస్టీలకు రిజర్వేషన్లు పెంచాల్సిన ఉందన్నారు. సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ఎస్టీలకు ఆరు శాతం రిజర్వేషన్లు దక్కాయని, దీనివల్ల తెలంగాణ ఎస్టీలు నష్టపోయారని సిఎం అన్నారు. తెలంగాణలో ఎస్టీలకు జనాభా ప్రకారం రిజర్వేషన్లు కల్పించడానికి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. చెల్లప్ప, సుధీర్ కమిషన్లు సమర్పించిన నివేదికను సమగ్రంగా పరిశీలించి ముస్లింలు, ఎస్టీల జీవన ప్రమాణాలు పెంచే చర్యలు తీసుకుంటుందని సిఎం చెప్పారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు