ప్రపంచ స్థాయిలలో పేరున్న సంస్థలకు భూములతో పాటు ప్రొత్సాహకాలు
ఇవ్వడానికి ప్రభుత్వం సిద్దంగా ఉంది.ఇప్పటికే కొన్ని దేశవిదేశీ విద్యా సంస్థలతో
ప్రభుత్వం ఒప్పందాలు కూడా చేసుకుంది. అమరావతికి ప్రాచుర్యం లబించేవిదంగా ..
ఐయుఐహెచ్ ( ఇండో-యూకే ఇన్స్టీట్యూట్ ఆప్ హెల్త్) పెద్ద ప్రాజెక్టు తలపెట్టారు.
అంతర్జాతీయ స్థాయిలో వెయ్యి పడకల మెగా ఆస్పత్రిని,ఇతర అనుబంద
పరిశోధన శిక్షణ సంస్థలను 2018 లోగా
నిర్మిస్తారు. విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి ఏడు జాతీయ విద్యా సంస్థలు,
విశ్వవిద్యాలయాలు రావలసి ఉంది. ఇప్పటికే అయిదు జాతీయ సంస్థల తాత్కాలిక భవనాలో ప్రారంభమయ్యాయి.
విశాఖపట్నంలో (ఇండియన్ ఇన్సీట్యూట్ ఆప్ మేనేజ్‌మెంట్, చిత్తూరు జిల్లా లో
ఐఐటీ,పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడేంలో ఎన్‌ఐటీ,గుంటూరు జిల్లాలో ఎన్‌ఐడి (
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆప్ డిజైనింగ్),వ్యవసాయ విశ్వవిద్యాలయం వంటివి తమ
కార్యకలాపాలను ప్రారంభించాయి.దేశంలో అరుదైన ఐఐఎస్‌ఇఆర్( ఇండియన్ ఇన్‌స్టిట్యూట్
ఆప్ సైన్స్ ఎడ్యూకేషనల్ అంఢ్ రిసెర్చ్ ) ని తిరుపతిలో ఏర్పాటు చేశారు. చిత్తూరు
జిల్లా సత్యవేడు మండలం శ్రీసిటీలో ఐఐఐటీ నెలకొల్పారు. అనంతపురం జిల్లాలో ( నేషనల్
ఆకాడమి ఆప్ కస్టమ్స్,ఎక్సైజ్ అండ్ నార్కోటిక్స్),కర్నూలు జిల్లాలో ట్రిపుల్
ఐటీ, గుంటూరు జిల్లా మంగళగిరి వద్ద ఎయిమ్స్,విజయనగరం లో గిరిజన
విశ్వవిద్యాలయం,అనంతపురంలో కేంద్ర విశ్వవిద్యాలయం, విశాఖపట్నంలో పెట్రోలియం
విశ్వవిద్యాలయం,కాకినాడలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆప్ ప్యాకేజింగ్ సంస్థలు మంజూరయ్యాయి.
రాష్ట్ర ప్రభుత్వ విద్యా సంస్థలు
ఈ విద్యా సంవత్సరం నుంచి కర్నూలులో ఉర్థూ విశ్వవిద్యాలయం ప్రారంభించింది.
రాయలసీమలోని విశ్వవిద్యాలయాల అభివృద్దికి ప్రభుత్వం రూ. 100 కోట్లు కేటాయించింది. అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ది చెందాన్న
ఉద్దేశంతో జిల్లకో విశ్వవిద్యాలయం నెలకొల్పాలని… అందులో భాగంగా అనంతపురం జిల్లా పెనుకొండలో
ఇంధన విశ్వవిద్యాలయం,తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో లాజిస్టక్ విశ్వవిద్యాలయం
నెలకల్పుతారని ప్రభుత్వం చేబుతుంది.
అన్ని జిల్లా అభివృద్ది మంత్రంతో పలు జిల్లాలో విశ్వవిద్యాలయలను,
అంతర్జాతీయ సంస్థలను నెలకొల్పడం శుభసుచకం…
నిరుద్యోగులకు ఉపాధి కలిగే ఆవకాశముంది. ఈ సంస్థలలో స్థానికతకు పెద్దపీట
వేస్తే యువతకు మంచి ఆవకాశాలు లభిస్తాయి.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి