తెలంగాణ పర్యాటక అభివృద్ధికి రాష్ట్ర
ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యమిస్తుందని రాష్ట్ర పర్యాటక అభివృద్ధి శాఖ
మంత్రి అజ్మీరా చందూలాల్ అన్నారు. నాగార్జునసాగర్‌లోని పొట్టిచెల్మ వద్ద
నూతన లాంచీ, డౌన్ పార్కు వద్ద తాత్కాలిక టికెట్ కౌంటర్‌ను జిల్లా మంత్రి
గుంటకండ్ల జగదీష్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. తెలంగాణ ప్రాంత పర్యాటకుల
ఇబ్బందులను తొలగించేందుకే సీఎం కేసీఆర్ కృతనిశ్చయంతో నిధులు విడుదల చేసి
మనవైపు నూతన లాంచీస్టేషన్ ఏర్పాటుచేయించారన్నారు. అధికారులతో కలిసి లాంచీలో
కొంతసేపు నదిలో విహరించారు. ఈ సందర్భంగా మంత్రి చందూలాల్ మాట్లాడుతూ
పుష్కరాల నేపథ్యంలో సాగర్‌కు వచ్చే భక్తులకు లాంచీస్టేషన్ ప్రారంభంతో
ప్రయోజనం చేకూరుతుందన్నారు.సాగర్ పర్యాటక ప్రాంతాభివృద్ధికి నిధుల
కేటాయింపు, వసతుల కల్పనకు సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో దృష్టి
సారించారన్నారు. సాగర్‌కు పర్యాటక సొబగులు కల్పించి మరింత అభివృద్ధి చేసే
దిశగా ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందన్నారు. తెలంగాణ ఏర్పాటుతో
సాగర్‌లోని లాంచీలు, స్టేషన్ ఆంధ్రా ప్రాంతంలోకెళ్లడంతో తెలంగాణ పర్యాటకులు
ఆంధ్రా ప్రాంతం నుంచే కొండకు వెళ్లాల్సి వస్తోందన్నారు. తెలంగాణ ప్రాంతం
నుంచే లాంచీలు నడపాలని సీఎం కేసీఆర్ కృతనిశ్చయంతో లాంచీల నిర్మాణం,
లాంచీస్టేషన్ ఏర్పాటుకు నిధులు మంజూరు చేశారన్నారు. లాంచీలతో తెలంగాణ
పర్యాటక శాఖకు మరింత ఆదాయం సమకూరుతుందన్నారు. మంత్రి గుంటకండ్ల మాట్లాడుతూ
తెలంగాణ పర్యాటక అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణతో
ముందుకు సాగుతోందన్నారు. అత్యాధునిక హంగులతో తయారుచేసిన కొత్త లాంచీలు
పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటాయన్నారు. ఈ సందర్భంగా మంత్రులు నల్లగొండ
ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, జడ్పీ చైర్మన్ బాలూనాయక్, తెలంగాణ టూరిజం
చైర్మన్ పేర్వారం రాములు, ఎండీ. క్రిస్టియానా, డీఐజీ అకున్ సబర్వాల్,
కలెక్టర్ సత్యనారాయణరెడ్డి, బుద్ధవనం ప్రత్యేకాధికారి మల్లెపల్లి లక్ష్మయ్య
తదితరులతో కలిసి కొద్దిసేపులో లాంచీనలో నదిలో విహరించారు.
కార్యక్రమంలో తెలంగాణ టూరిజం చైర్మన్ పేర్వారం రాములు, ఎం.డీ.క్రిస్టియానా, డీఐజీ అకున్ సబర్వాల్, కలెక్టర్ సత్యనారాయణరెడ్డి, ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, బుద్ధవనం ప్రత్యేకాధికారి మల్లెపల్లి లక్ష్మయ్య, మిర్యాలగూడ ఆర్టీఓ బి.కిషన్‌రావు, టూరిజం జిల్లా మేనేజర్ వెంకటేశ్వరరావు, టీఆర్‌ఎస్ సాగర్ నియోజకవర్గ ఇన్‌చార్జి నోముల నర్సింహయ్య, జడ్పీ వైస్ చైర్మన్ కర్నాటి లింగారెడ్డి, టీఆర్‌ఎస్ నాయకులు మలిగిరెడ్డి లింగారెడ్డి, మండల అధ్యక్షుడు కర్ణబ్రహ్మానందరెడ్డి పాల్గొన్నారు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి