.
పుదీనాన
ఘాటైన తాజా వాసనతో
,ఔషధ గుణాలు
కలిగి అనారోగ్యాలను
దూరం చేయటానికి ఉపయోగపడుతుంది.ముఖ్యంగా జీర్ణవ్యవస్థ
,మలబద్దకం.అజీర్ణం,గ్యాస్ వంటి సమస్యలను తగ్గించటానికి , పుదీనా ఆకుల మిశ్రమంతో పళ్లు మెరవటానికి, చర్మంపై ఎక్కడైనా దురదగా, మంటగా ఉంటే కొన్ని పుదీనా ఆకులను నలిపి ఆయా ప్రదేశాలపై ఉంచితే ఆ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. పుదీనా ఆకుల రసం, నిమ్మరసం, తేనెలను ఒక టీస్పూన్ మోతాదులో తీసుకుని అన్నింటినీ బాగా కలిపి తీసుకుంటే అజీర్ణం, కడుపు ఉబ్బరం, వికారం, వాంతులు తగ్గుతాయి.పుదీనా ఆకులను బాగా నలిపి ముద్దగా చేసి దాన్ని నుదుటిపై ఉంచుకుట్టే తలనొప్పి తగ్గే ఆవకాశముంటుంది. పుదీనా ఆకులతో కాచిన కషాయంలో ఉప్పు కలిపి పుక్కిలిస్తే గొంతు నొప్పి సమస్య తొలగిపోతుంది.కొన్ని పుదీనా ఆకులను తీసుకుని మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. దాంట్లో కోడిగుడ్డు తెల్ల సొన కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుంటే మచ్చలు, మొటిమలు పోతాయి.
పుదీనా ఆకులతో తయారు చేసిన నూనె మనకు మార్కెట్లో లభ్యమవుతుంది. దీన్ని రాసుకుంటే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. వెంట్రుకలు దృఢంగా మారుతాయి
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి