ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

తెలంగాణ – మహారాష్ట్ర ప్రభుత్వాలు కుదుర్చుకున్న ఒప్పందం

నీటి పారుదల ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ – మహారాష్ట్ర ప్రభుత్వాలు కుదుర్చుకున్న ఒప్పందం చారిత్రాత్మకమైందని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు అన్నారు. అత్యంత సామరస్యపూర్వకంగా సమస్యలు పరిష్కరించుకుని రైతులకు ఉపయోగపడే విధంగా ప్రాజెక్టుల నిర్మాణానికి మార్గం సుగమం కావడం సువర్ణాక్షరాలతో లిఖించాల్సిన సందర్భమని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. నీటి కోసం రాష్ట్రాల మధ్య యుద్ధాలు జరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ – మహారాష్ట్ర ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో అంతరాష్ట్ర ప్రాజెక్టుల నిర్మాణాలు చేపట్టడం దేశానికే ఆదర్శమని కేసిఆర్ అన్నారు. ముంబాయి లోని సహ్యాద్రి గేస్ట్ హౌస్ లో ఒప్పందం కుదిరిన తరువాత రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రెండు రాష్ట్రాల ప్రజలనుద్దేశించి మాట్లాడారు. దేశంలో ఒక మంచి ఒరవడికి ఇది నాంది పలుకుతుందని సిఎం కేసిఆర్ అన్నారు.
తెలంగాణ ప్రాజెక్టులు నిర్మాణం విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వం స్నేహ హస్తం అందించడం పట్ల ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజల తరపున, తెలంగాణ ప్రభుత్వం తరుపున, వ్యక్తిగతంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. గత ఏడాదిన్నర కాలంపాటు తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ఎప్పటికప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి విశేష కృషి చేశాడని ప్రశంసించారు. రెండు రాష్ట్రాల నీటి పారుదల శాఖ మంత్రులు, అధికారులు పరస్పరం సహకరించుకొని, సందేహాలను నివృత్తి చేసుకుని ఇవాల ఒప్పందం కుదుర్చుకునేందుకు దోహదపడడం పట్ల ముఖ్యమంత్రి ఆభినందించారు. ప్రతి సంవత్సరం సముద్రం పాలయ్యే గోదావరి నీటిని రెండు రాష్ట్రాల రైతులకు అందించడమే లక్ష్యంగా ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. ఈ ఏడాది కూడా ఇప్పటికే 1400 టిఎంసిలు సముద్రం పాలయ్యాయని, ప్రాజెక్టులు కట్టి వుంటే ఈ నీటితో రైతులు బాగుపడేవారన్నారు. ఒ పక్క గోదావరి నీళ్లు సముద్రం పాలవుతుంటే, మరో పక్క రైతుల పొలాలు నీళ్లు లేక ఎండిపోతున్నాయన్నారు. ఈ పరిస్థితిని నివారించడానికే ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టినట్లు సిఎం వెల్లడించారు.
“సమైక్య ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ ప్రాజెక్టులు ముందుకు పడకుండా చేశారు. సమస్యను పరిష్కరించుకునే బదులు మరింత జటిలం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఇరుగు పొరుగు రాష్ట్రాలతో స్నేహ సంబంధాలు కొనసాగిస్తున్నాము. నేను మొదటి సారి ముంబాయి వచ్చినప్పుడు స్పష్టంగా చెప్పాను. మాకు కావలసింది నీళ్లు తప్ప వివాదాలు కాదు. రైతు ఎక్కడివాడైనా రైతే. సమైక్య ఆంధ్రప్రదేశ్ లో నీటి పారుదల రంగంలో తీవ్రంగా నష్టపోయాము. తెలంగాణ ఉద్యమం ట్యాగ్ లైన్ నీళ్లు, నిధులు, నియామకాలు. అందుకే సాగునీటి రంగానికి మేము అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నాము. ముంపు సమస్య లేకుండా ప్రాజెక్టుల రీడిజైనింగ్ చేశాము. తమ్మిడి హట్టి వద్ద 152 మీటర్ల ఎత్తులో ప్రాజెక్టు కడతామని అప్పటి సమైక్యాంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించింది. దానికి మహారాష్ట్ర ఒప్పుకోలేదు. సమస్య పరిష్కారం కాలేదు. 152 మీటర్ల ఎత్తులో కట్టడానికి ఏలాంటి ఒప్పందం జరుగలేదు. ఈ పరిస్థితిని నివారించడానికే మేము తమ్మిడిహట్టికి ప్రత్యామ్నాయంగా మేడిగడ్డ బ్యారేజిని డిజైన్ చేశాము. 101 మీటర్ల ఎత్తుతో బ్యారేజ్ నిర్మించడానికి అనువుగా బేస్ మెంట్ నిర్మిస్తాము. 100 మీటర్ల ఎత్తులో బ్యారేజ్ కడతాము. తమ్మిడి హట్టి వద్ద 148 మీటర్ల ఎత్తులొ బ్యారేజ్ నిర్మించి ఆదిలాబాద్ జిల్లాకు నీళ్లందిస్తాం. పెన్ గంగ పై చనాఖా – కొరాటా తో పాటు ఇతర బ్యారేజీల నిర్మాణానికి కూడా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పర అంగీకారానికి రావడం శుభసూచకం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా వున్నప్పుడు అప్పటి ప్రభుత్వాలు జగడాలు పెట్టుకుని ప్రాజెక్టులను కట్టలేదు. మేము ప్రేమ భావనతో ముందుకు పోతున్నాం. గతంలో ఆంధ్రప్రదేశ్ లో, కేంద్రంలో కాంగ్రేస్ ప్రభుత్వమే ఉన్నప్పటికి ఒప్పందానికి రాలేకపోయారు. కానీ ఇప్పుడు మూడు ప్రాంతాల్లో మూడు వేర్వేరు ప్రభుత్వాలు ఉన్నా ఒక్క మాట మీదికి రాగలిగారు. ఇలాంటి వైఖరి వల్ల ప్రజలకు, ముఖ్యంగా రైతులకు న్యాయం జరుగుతుంది. ఇది దేశానికే ఆదర్శంగా నిలుస్తుంది. కృష్ణా నీటి పంపిణీ విషయంలో కూడా తెలంగాణ రాష్ట్రం ఇరుగు పొరుగు రాష్ట్రాలతో ఇలాంటి స్నేహ పూరిత వైఖరినే కొనసాగిస్తుంది. కేవలం సాగునీటి ప్రాజెక్టుల విషయంలోనే కాకుండా అన్ని విషయాల్లో మహారాష్ట్ర – తెలంగాణ పరస్పరం సహకరించుకుంటూ ముందుకు పోతాయి” అని ముఖ్యమంత్రి అన్నారు.
కేసిఆర్ ది స్నేహపూర్వక వైఖరి – దేవేంద్ర ఫడ్నవీస్
--------------------------------------------------------
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉన్నప్పుడు నిత్యం ఘర్షణ పూరిత వైఖరి వుండేదని, తెలంగాణ ఏర్పడిన తరువాత సంబంధాలు మెరుగయ్యాయని, దీనికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ అనుసరిస్తున్న స్నేహపూర్వక వైఖరే కారణమని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. సామరస్య పూర్వకంగా ప్రాజెక్టుల నిర్మాణం కోసం ఒప్పందాలు చేసుకోవడం శుభపరిణామని ఫఢ్నవీస్ అన్నారు. తక్కువ ముంపుతో ఎక్కువ నీళ్లు ఉపయోగించుకునే విధంగా తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టుల రీడిజైన్ చేసిందని ఫడ్నవీస్ అభినందించారు. ఇవాల చేసుకున్న ఒప్పందం వల్ల గోదావరి, ప్రాణహిత, పెన్ గంగ నీళ్లను రెండు రాష్ట్రాల రైతులు ఉపయోగించుకొని బాగుపడతారన్నారు. ఇది మంచి సాంప్రదాయమని చెప్పారు. రాబోయే కాలంలో కూడా ఇదే సహకార స్పూర్తి కొనసాగుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు.
హరీష్ రావుకు ఇద్దరు సిఎంల అభినందన
----------------------------------------------
తెలంగాణ - మహరాష్ట్ర ల మధ్య సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి ఒప్పందం కుదరడానికి నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు విశేష కృషి చేశారని ఇద్దరు ముఖ్యమంత్రులు అభినందించారు. మహారాష్ట్ర ప్రభుత్వానికి, అధికారులకు ఎప్పటికిప్పడు సమాచారం అందిస్తూ వారి అనుమానాలను హరిష్ రావు నివృత్తి చేసుకుంటూ వచ్చారని సిఎం కేసిఆర్ అన్నారు. మహారాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి గిరీష్ మహజన్ తో, అధికారులతో ఎప్పటికప్పుడు సమావేశమై సమస్యను పరిష్కరించడానికి కృషి చేశాడాన్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంధ్ర పఢ్నవీస్ మాట్లాడుతూ ప్రాజెక్టుల విషయంలో హరీష్ రావు ఎంతో కష్టపడ్డాడని ప్రశంసించారు. ఎప్పటికప్పుడు మంత్రుల స్థాయిలో, అధికారుల స్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేసి సమన్వయంతో వ్యవహరించాడన్నారు. వెంటపడి మరీ తక్కువ సమయంలోనే ఒప్పందం కుదరడానికి కారణమయ్యాడన్నారు.
పరస్పరం సన్మానాలు
------------------------
ఒప్పందం కుదిరిన తరువాత తెలంగాణ, మహారాష్ట్ర ముఖ్యమంత్రులు పరస్పరం శాలువాలు కప్పి సత్కరించుకున్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రికి వెండి చార్మినార్ ప్రతిమను కేసిఆర్ బహుమానంగా ఇచ్చారు. కేసిఆర్ కు వెండి వినాయకుడి ప్రతిమను ఫడ్నవీస్ కానుకగా అందించారు. మహారాష్ట్ర మంత్రులకు తెలంగాణ నీటిపారుదల శాఖమంత్రి హరీష్ రావు, తెలంగాణ మంత్రులకు మహారాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి గిరీష్ మహజన్ జ్ఞాపికలు అందించారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

వ్యయమం ఎప్పుడు చేయాలి…..

మీరు వ్యయమం చేయటానికి నిశ్చయించుకున్నారా … మరీ ఎప్పుడు ఎక్సైజ్ చేయాలి .. ఏ సమయం అనుకులం అనే అంశాలను న్యూయార్క్ కు చేందిన ఓ రిసర్చ్ సంస్థ కొన్ని సూచనలు చేసింది . ఉదయం టిఫిన్‌ చేయక ముందు వ్యయమానికి పూనుకొనటం తో దినమంతా   శరీరంలో ఉన్న ఫ్యాట్‌ను కరిగించటానికి ఉపయోగపడుతూ శక్తిని ఇస్తుంది . ఉదయం చేయటం వలస బరువు తగ్గటానికి   ముఖ్యంగా లావు కాకుండా ఉండటానికి దొహదపడుతుంది . శరీరానిక కావసిన శక్తిని సమకూరుస్తూ ,    మనం తీసకున్న ఆహారాన్ని జీర్ణించుకొవడమే కాకుండా దినమంతా కొవ్వును కరిగించటానికి ఉపయోగపడుతుంది . ఓ పరశీలన లో   ఎక్సైజ్‌ చేసిన వారు . ఎక్సైజ్ చేయని వారు ఇరువురిని   వారం పాటు ఒకే రకమైన ఆహారం తీసుకున్న తర్వాత పరిశీలిస్తే , ఉదయం ఎక్సైజ్ చేసివారు , చేయని వారి మధ్య వ్యత్తాసం కనిపించింది . చేయని వారు కొంత   శరీర బరువు పెరగడం జరిగింది . ఉదయం వ్యయమం చేయటం మంచిదని చెబుతున్నారు .

తెలంగాణకు హరితహారం

తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని ఈ నెల 8న నల్గొండ జిల్లాలో ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ప్రారంభించనున్నారు. అదే రోజు అన్ని జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపిలు, ఎమ్మెల్సీలు, అధికారులు తమ తమ జిల్లాల్లో, తమ శాఖల పరిధిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లే జాతీయ రహదారిపై తెలంగాణ సరిహద్దుల వరకు 165 కిలోమీటర్ల మేర రోడ్డుకిరువైపులా అందమైన రకరకాల పూల చెట్లు, నీడనిచ్చే చెట్లు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కా ర్యక్రమాన్ని నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్ద కాపర్తి వద్ద ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. అదే సమయంలో 165 కిలోమీటర్ల రోడ్డుపై ఒకేసారి 85 వేల మంది మొక్కలు నాటుతారు. హైదరాబాద్ శివార్లలోని రామోజీ ఫిల్మ్ సిటీ దగ్గరున్న అబ్దుల్లామెట్ నుంచి నల్గొండ జిల్లా కోదాడ మండలం నల్లబండగూడెం వరకు మొక్కలు నాటుతారు. ఈ మొత్తం రహదారిని 14 సెంగ్మెంట్లుగా విభజించారు. ఒక్కో సెంగ్మెంటుకు ఒక్కో అధికారిని ఇన్‌చార్జ్‌గా నియమించారు. ఈ కార్యక్రమాన్ని హరితహారం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్ పర్యవేక్షిస్తున్నారు. స్వయం సహాయక బృందాల సభ...

సీఎంపై వైసీపీ నేత రోజా తీవ్ర వ్యాఖ్యలు

ముఖ్యమంత్రిగా కిరణ్ మూడేళ్ల పాలనంతా అస్తవ్యస్తమేనని... వేసీపీ నేత రోజా విమర్శించారు. ఆయనకు మూడేళ్లూ కుర్చీ కాపాడుకోవటానికి సరిపోయిందన్న రోజా... వైఎస్ పథకాలను పేర్లు మార్చి మళ్లీ ప్రవేశపెడుతున్నారని ఆరోపించింది. కిరణ్ ముఖ్యమంత్రి అవుతారని తెలిసుంటే... 2009లోనే ప్రజలు కాంగ్రెస్ ను గెలిపించి ఉండేవారు కాదని వ్యాఖ్యానించింది