ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

కేసిఆర్, జగన్ ల మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ ఉందా?

ఇటీవల కాలంలోని పరిణామాలు చూస్తుంటే...కేసిఆర్, జగన్ ల మధ్య ఉన్న సంబంధాలపై అనేక అనుమానాలకు తావిస్తున్నాయి. తెలంగాణకు వ్యతిరేకమైన సమైక్యాంధ్ర నినాదాన్ని చంద్రబాబు కంటే జగన్ గట్టిగా వినిపిస్తున్నా...కేసిఆర్ మాత్రం జగన్ కాకుండా చంద్రబాబును ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. అదే సమయంలో సమైక్యంగా ఉండాల్సిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ రోజు ముక్కలు కావడానికి చంద్రబాబు కంటే కేసిఆర్ ఎక్కువ కారణమైతే...సమైక్యాంధ్ర కోరుకునే జగన్ కేసిఆర్ ను వదిలి బాబుపై మండిపడుతున్నారు. తమ సిద్దాంతాలకు విరుద్దమైన వ్యక్తులను ఒకరినొకరు విమర్శించుకోకుండా మధ్యలోని వ్యక్తులపై ఈ ఇద్దరు నాయకులు మాట్లాడడంపై వీరిమధ్య ఏమైనా అవగాహన ఒప్పందా ఉందా అనుమానాలను బలపరుస్తోంది.తెలంగాణ నడిబొడ్డున ఉన్న హైదరాబాద్ లో సభ పెట్టడానికి ఏపీఎన్జీవోలు సంసిద్దమైతే టిఆర్ఎస్, టీజేఏసీ తీవ్రంగా విరుచుకుపడ్డాయి. సభ పెట్టడానికి వీలు లేదని, అనుమతులిస్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించాయి. చివరకు సభకు అనుమతి లభించడంతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమైక్య సభకు చైర్మన్ గా వ్యవహరిస్తున్నారంటూ, ఆయన తీరుకు నిరసన పేరుతో తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చి, నిరసన వ్యక్తం చేశారు. సభలో తెలంగాణ వాదులపై జరిగిన దాడిపై దుమారం లేపారు. అయితే ఈ సభ వివాదం పూర్తి కాకముందే జైలు నుంచి వచ్చిన జగన్ హైదరాబాద్ లో సమైక్య శంఖారావం పూరిస్తానన్నప్పుడు టిఆర్ఎస్, టీజేఏసీలు తీవ్రంగా వ్యతిరేకించాయి.టిఆర్ఎస్, వైఎస్సార్సీపి ఎవరి కారణాలు వారు చెప్పుకుంటున్నా...రాజకీయాల్లో  శత్రుపక్షంలో బలంగా ఉన్న వాళ్లను విమర్శించకపోవడంపై అనుమానాలు రావడం సహజం. అయితే ఈ అనుమానాల్లో వాస్తవం ఎంతవరకు ఉందనేది ఎన్నికల్లో తేలుతుంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు