వైసీపీ నిర్వహించిన సమైక్య శంఖారావం సభ ప్రశాంతంగా ముగియడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.. అక్కడక్కడ చదురుముదురు ఘటనలు మినహా సభ ప్రశాంతంగా జరిగింది. సభ జరిగే సమయంలో నిజాం హాస్టల్ విద్యార్ధులు ఆందోళనకు దిగడంతో.. కట్టుదిట్టమైన భద్రతతో నిరసనకారుల్ని బయటకిరాకుండా కట్టడి చేశారు.సమైక్య శంఖారావం సభ సాఫీగా సాగడంతో.. పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. పోలీస్ నిఘా నీడలో సభ సజావుగా ముగిసింది.. సభ జరిగే సమయంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.. సభకు 3300 మంది పోలీసులు పహారా కాశారు.. ఇందులో 34 ప్లాట్లూన్ల ఏపీఎస్పీ, 16 కంపెనీల కేంద్ర సాయుధ బలగాలు, 1800 మంది సివిల్ పోలీసులు ఉన్నారు. ఎల్బీ స్టేడియం పరిసర ప్రాంతాలను ఆధీనంలోకి తీసుకుని అనుమానాస్పద వ్యక్తుల పైన నిఘా పెట్టారు.సిసి కెమెరాల ద్వారా ఉన్నతాధికారులు సభలోకి వెళ్ళే వారిని పర్యవేక్షించారు. తెలంగాణ వాదులను గుర్తించి వారి అదుపులోకి తీసుకున్నారు.. సభలో కొంత మంది తెలంగాణ వాదులు జై తెలంగాణ నినాదాలు చేయడంతో పోలీసులు అప్రమత్తమై వారిని అరెస్ట్ చేశారు... సభ జరిగే సమయంలో నిజాం హాస్టల్ విద్యార్ధులు ఆందోళన చేశారు.. వారిని బయటకి రానీయకుండా పోలీసులు అడ్డుకున్నారు..
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి