ఢిల్లీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరాంలో ఎన్నికల సందడి మళ్లీ మొదలైంది. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల నగారా మోగింది. ఆయా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఈ ఎన్నికల్లోనే తిరస్కార ఓటు హక్కు కూడా అమలులోకి రానుంది.
ఐదు రాష్ట్రాల ఎన్నికలు నవంబర్ 11 నుంచి ప్రారంభమై డిసెంబర్ 4న ముగియనున్నాయి. ఛత్తీస్‌గఢ్ నక్సల్స్ ప్రభావిత ప్రాంతం కావటంతో రెండు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తారు. ఛత్తీస్‌గఢ్‌లో మొదటి దశ ఎన్నికలు నవంబర్ 11న, రెండవ దశ ఎన్నికలు నవంబర్ 19న జరుగనున్నాయి. మధ్యప్రదేశ్‌లో నవంబర్ 25న, రాజస్థాన్‌లో డిసెంబర్ 1న, ఢిల్లీ మిజోరాంలో డిసెంబర్ 4న ఎన్నికలు జరుగనున్నాయి. ఐదు రాష్ట్రాల్లో డిసెంబర్ 8న ఎన్నికల కౌంటింగ్ జరుగుతుంది.ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాల్లో మొత్తం 11 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. మధ్యప్రదేశ్‌లో 230 అసెంబ్లీ స్థానాలు, రాజస్థాన్‌లో 200, ఛత్తీస్‌గఢ్‌లో 90, ఢిల్లీలో 70, మిజోరాంలో 40 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి.సుప్రీంకోర్టు ఇటీవల వెలువరించిన తీర్పునకు అనుగుణంగా నచ్చని అభ్యర్థులను తిరస్కరించే హక్కును మొట్టమొదటిసారిగా ఈ ఎన్నికల్లో ఓటరుకు కల్పించనున్నారు. ఈవీఎం మిషన్లలో ‘పైవారు ఎవరూ కాదు’ అన్న మీటను ఏర్పాటు చేయనున్నారు. ఈ ఐదు రాష్ట్రాల్లో 630కిపైగా నియోజకవర్గాల్లో సుమారు 11 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారని వీఎస్ సంపత్ వివరించారు.
ఈ ఎన్నికల్లోనే ఈవీఎంలలో తిరస్కార ఓటు బటన్‌ను ఏర్పాటు చేస్తారు.
పదేళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ప్రజ్లలో పీకల్లోతు ప్రజావ్యతిరేకత ఉంది. దేశ చరిత్రలోనే ఎన్నడూ చూడని కుంభకోణాలు కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వ హయాంలో వెలుగు చూశాయి. టూజీ, కామన్ వెల్త్, అగస్టా, రైల్ గేట్, కోల్ గేట్.ఆహార భద్రత లాంటి పథకాలు, ఎన్నో ఏళ్లుగా అసలు ముట్టుకోవడానికే ఇష్టపడని తెలంగాణా విభజన వంటివి తెరమీదకు తెచ్చి ప్రజల్లో ఏదో విధంగా మైలేజీ సంపాదించేందుకు అష్టకష్టాలు పడుతోంది. అయితే ఎన్ని చేసినా మళ్లీ అధికారం దక్కేది యూపీఏకు అసాధ్యంగానే కనిపిస్తోందని సర్వేలన్నీ స్పష్టం చేస్తున్నాయి. పైకి ఎన్ని చెబుతున్నా.. మళ్లీ అధికారంలోకి వచ్చేది కష్టమే అని కాంగ్రెస్ పార్టీ నేతలే అనుకుంటున్న మాట. ఇన్ని సమస్యల మధ్య లోక్ సభ ఎన్నికల విజయం మాట దేవుడెరుగు మరో నెలన్నరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం అవుతున్న కాంగ్రెస్ పార్టీకి పెద్ద పరీక్షనే ఎదుర్కోబోతోంది.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి