రాష్ర్ట విభజనకు బ్రేక్ పడటానికి రెండు అవకాశాలు ఉన్నాయని సీమాంధ్ర ప్రజలు ఇంకా ఆశతో ఉన్నారు. ఒకటి సర్వోన్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టు.. మరోకటి సర్వసైనాధ్యక్షుడైన రాష్ర్టపతి. వీరిద్దరు తలచుకుంటే విభజనలో మరింత జాప్యం జరిగే అవకాశం ఉంది. రాజ్యాంగ పరమైన తప్పిదాలు ఉంటే కోర్టులు కేంద్రాన్ని ప్రశించవచ్చు. అలాగే రాష్టప్రతి కూడా తిప్పిదాలు, న్యాయపరమైన చిక్కులు ఉన్నప్పుడు పునఃపరిశీలన చేయాలని కేంద్రాన్ని కోరవచ్చు. రాష్ట్ర విభజనలో తప్పిదాలను ఎంచుతూ సర్వోన్నత న్యాయస్థానాన్ని కొన్ని రాజకీయ పార్టీలు, వ్యక్తులు కూడా ఆశ్రయించాయి. ఈ సందర్భంలో కోర్టులు ప్రక్రియను పరిశీలించి కౌంటరు దాఖలు చేయాలని కోరవచ్చు. అయితే ప్రక్రియ కేంద్రం చేతులో ఉండగానే కోర్టులు జోక్యం చేసుకోవాలి. పార్లమెంటు వరకు వెళ్లితే ఇక ప్రశ్నించే అధికారం కోర్టులు కూడా కోల్పోతాయి.విభజనలో చాలా లోపాలు ఉన్నాయనేది ప్రతిపక్షపార్టీలు, పాలకపక్షానికి చెందిన నేతలు, న్యాయనిపుణులు, వివిధ రంగాలకు చెందిన వ్యక్తులు కూడా తప్పుపడుతున్నారు. ఆర్టికల్ 3 ప్రకారం కేంద్రం ఒక రాష్ట్రాన్ని విభజిస్తూ నిర్ణయం తీసుకోవచ్చు. పార్లమెంటులో బిల్లును తీసుకువచ్చి సాధారణ మోజార్టీతో ఆమోదింప చేయించుకోవ చ్చు. ఇది చాలా సులభతరమైన ప్రక్రియ. అయితే ప్రక్రియకు ముందు కేంద్రం చేయాల్సిన పనిచాలా ఉంటుంది. ఇది సక్రమంగా నిర్వర్తిస్తే తప్ప ముందుకు వెళ్ళటం సాధ్యం కాదు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వేగంగా బిల్లును రూపొందించి తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను తొందరగా ముగించేసేందుకు కేంద్రం ఎన్నో అడ్డదారులు తొక్కుతున్నది. 2014 ఎన్నికల్లో లోగా ఆంధ్రప్రదేశ్‌ని రెండు ముక్కలు చేయటం ద్వారా లబ్ది పొందాలనుకునే పాలక కాంగ్రెస్‌కు గట్టి ఎదురు దెబ్బ తగిలే అవకాశాలు దండిగా ఉన్నాయి.డిసెంబరు 5వతేదీ తర్వాత పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలకు ముందుగానే జివోఎం తన నివేదికను కేంద్రానికి సమర్పించేందుకు తీవ్ర కసరత్తు చేస్తున్నది. జివోఎం నివేదిక తర్వాత కేంద్ర క్యాబినెట్ అన్ని పరిశీలించి డ్రాఫ్ట్ బిల్లును తయారు చేస్తుంది. అలా త యారయ్యే డ్రాఫ్ట్ బిల్లు కేంద్రం ద్వారా రాష్టప్రతికి అక్కడి నుంచి రాష్ర్ట అసెంబ్లీకి ఆతర్వాత మళ్లీ రాష్టప్రతికి అక్కడి నుంచి కేంద్ర క్యాబినెట్ ద్వారా పార్లమెంటులోని ఉభయ సభలకు వెళ్తుంది. ఉభయ సభల్లో ఆమోదం తర్వాత బిల్లు రూపంలో రాష్టప్రతి ఆమోద ముద్రకు వెళ్తుంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి