రాష్ట్ర విభజన నేపథ్యంలో రాష్ట్రంలో శాంతి భద్రతలపై ఐదుగురు సభ్యులతో కూడిన టాస్క్‌ఫోర్స్ బృందాన్ని కేంద్రం నియమించింది. ఈ బృందానికి తమిళనాడుకు చెందిన ఐపీఎస్ అధికారి కె. విజయ్ కుమార్ నేతృత్వం వహిస్తున్నారు. కాగా ఈ కమిటీలో రాష్ట్రానికి చెందిన ఇద్దరు అధికారులు ఉన్నారు. సభ్యులుగా రిటైర్డ్ డీజీపీ ఏకే మహంతి, ఐపీఎస్ జేవీ రాముడు, కేంద్ర తరపున ఐఏఎస్ రాజీవ్‌శర్మ, ఐపీఎస్ వాసన్‌లు ఉన్నారు. వీరు ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీ మంగళవారం హైదరాబాద్ చేరుకుంటుంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి