కుండపోతతో కుదేలవుతున్న రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ మరో హెచ్చరిక జారీ చేసింది. వరుణుడి ప్రతాపం మరో 48 గంటలు ఉంటుందని ప్రకటించింది. గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఇప్పటికే అన్నదాతల ఆశలు ఆవిరైపోయాయి. సామాన్యుల జీవనం ఛిన్నాభిన్నమైంది. వాతావరణ శాఖ తాజా హెచ్చరికతో కోస్తావాసుల గుండె చెరువవుతోంది. రానున్న 48 గంటల్లో కోస్తా ఆంధ్రలో అధికప్రాంతాల్లో 25 సెంటీమీటర్ల కన్నా ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది. తెలంగాణ, రాయలసీమల్లోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశముందని హెచ్చరించింది.
పంటను దక్కించుకోడానికి వాన కోసం ఆకాశం వైపు చూసే రైతన్నపై.. ఆ వానే పిడుగులా పడింది. ఈ ఖరీఫ్ సీజన్‌లో పంటల పరిస్థితి బాగుందనుకుంటున్న దశలో అశనిపాతంలా రైతును వర్షం ముంచేసింది. వ్యవసాయ శాఖ సేకరించిన ప్రాథమిక సమాచారం ప్రకారం గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు 15 జిల్లాల్లోని 287 మండలాల్లో 10,72,110 ఎకరాల మేరకు వివిధ పంటలు నీట మునిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో పంట ముంపు విస్తీర్ణం ఇంకా పెరుగుతోంది. భారీ వర్షాలకు ముఖ్యంగా గుంటూరు, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల్లో పంట ముంపు తీవ్రంగా ఉంది. రాష్ట్రంలో ప్రధాన పంటలైన వరి, పత్తి పంటలకు తీవ్రంగా నష్టం వాటిల్లింది.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి