కేంద్రమంత్రి చిరంజీవి. రాష్ట్ర విభజన ప్రకటన తర్వాత ప్రజలకు, మీడియాకు వీలైనంత దూరాన్ని మెయింటెయిన్ చేస్తున్న లీడర్. అంతా మనకు నచ్చినట్లుగా జరగదు కదా ! విధి ఆయన్ని వీధుల్లోకి వచ్చేలా చేసింది. ఇటీవల భారీ వర్షాలు రాష్ట్రాన్ని ముంచేయడంతో తీర రైతులు, ముఖ్యంగా తీర ప్రాంత ప్రజలు బాగా నష్టపోయారు. బాధితులని పరామర్శించాలనుకున్నారో లేకపోతో ఇప్పుడు కూడా వెళ్లకపోతే మళ్లీ మొహం చూపించలేమనుకున్నారో కాని అంతే....చిరు సారు వారు సీమాంధ్రలో వాలిపోయారు. ఓదార్పకు బయల్దేరారు
తూర్పుగోదావరి జిల్లాలో జరిగింది చిన్నపాటి ప్రమాదం కాబట్టి మెగాస్టార్ పెద్దగా ట్టించుకోలేదు. శ్రీకాకుళం జిల్లాలో మాత్రం ప్రమాదాన్ని మించిన ఘోర పరాభవం అంతకు మించిన అవమానం ఎదురయ్యాయి. ఒకప్పుడు పూలవర్షం కురిపించిన ఆ ప్రాంతప్రజలు ఈ సారి రాళ్ల జల్లు కురిపించారు. పొంగుకొస్తున్న ఆవేశాన్ని బయటపెట్టలేక... చిరునవ్వు చిందిస్తూ అక్కడి నుంచి ఏం చక్కా చెక్కేశారు మెగాస్టార్. ఇక్కడా చిరుకు ఎదురు పరామర్శలే ఎదురవడంతో కన్నీళ్లు తుడుద్దామని వచ్చిన తననే.... పరిస్థితులు కన్నీళ్లు పెట్టిస్తున్నాయని ఫీలయ్ ఉంటారు పాపం

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి