ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

రాష్ట్ర విభజన - దూకుడు

రాష్ట్ర విభజన విషయంలో కేంద్ర ప్రభుత్వం రోజురోజుకూ దూకుడు పెంచుతోంది. విభజన వద్దంటూ సీమాంధ్ర ప్రజలు ఎంతగా గగ్గోలు పెడుతున్నా... ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నా... ఎక్కడా తగ్గడం లేదు. ఎవరేమనుకుంటే లేక్కేమిటి అన్నట్టుగా.... తాను అనుకున్నది తాను చేసుకుపోతోంది. కోస్తా జిల్లాలు భారీ వర్షాలు, వరదలతో తల్లడిల్లుతోంటే... నష్టం అంచనాకి కేంద్ర బృందాన్ని పంపించాల్సింది పోయి... విభజన కోసం టాస్క్ ఫోర్స్ ని పంపించింది. ఏదెలా ఉన్నా తనకు విభజనే ముఖ్యమన్నట్టుగా వ్యవహరిస్తోంది. ఇలా జీవోఎం... తనపని తాను చేసుకుపోతోంటే... కేంద్ర హోం శాఖ టాస్క్ ఫోర్స్ కమిటీ హైదరాబాద్ వచ్చింది.  విభజన అనంతరం రక్షణ, శాంతి, భద్రతలు తదితర అంశాలపై క్షేత్ర స్థాయిలో అధ్యయనం చేపట్టింది. తొలిరోజు సమావేశంలో ఉన్నతాధికారులు, మాజీ డీజీపీలు హాజరయ్యారు. రాష్ట్ర విభజన తర్వాత ఎదురయ్యే శాంతి భద్రతల సమస్యలపై ఈ బృందం చర్చలు జరిపింది. పోలీసు సిబ్బందిని ఎక్కడెక్కడ ఎంతమందిని ఉంచాలి.... ఆస్తుల పంపిణీ ఎలా అనే సమాచారాన్ని కూడా హోం శాఖ టాస్క్‌ఫోర్స్‌ కమిటీ సేకరిస్తోంది. ఈ బృందం గురువారం మధ్యాహ్నం మరోసారి భేటీ అవుతుంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు