ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

నరేంద్ర మోడీకి వరస బాంబు పేలుళ్లు స్వాగతం

బీహార్లో తొలిసారి అడుగుపెట్టిన నరేంద్ర మోడీకి వరస బాంబు పేలుళ్లు స్వాగతం పలికాయ్. యూపీలో జరిగిన మత ఘర్షణలకు వ్యతిరేకంగానే పేలుళ్లు జరిపామని పట్టుబడ్డ వారు చెబుతున్నప్పటికీ.. హుంకార్ సభలో పాల్గొందామని వచ్చిన మోడీనే తీవ్రవాద సంస్థలు టార్గెట్ గా చేసుకొన్నాయని.. విధ్వంసం వెనక ఇండియన్ ముజాహిద్దీన్ హస్తమున్నట్లు నిఘా వర్గాలు చెబుతున్నాయ్. మోడీ సభను భగ్నం చేయడానికి.. విధ్వంసం సృష్టించడానికి కుట్ర పన్నిన తీవ్రవాదులు తమ లక్ష్యాన్ని చాలా పక్కగా అమలు చేశారు.

ఉదయం పదిన్నరకు గాంధీ మైదానానికి రెండు కిలోమీటర్ల దూరంలోని రైల్వే స్టేషన్లో తొలి బాంబు పేలుడు. ఆ తర్వాత కొద్దిసేపటికి.. గాంధీ మైదాన్‌కు కూతవేటు దూరంలోని ఎలిఫిస్టన్ థియేటర్ వద్ద పేలుడు. ఆ తర్వాత కొద్దిసేపటికి గాంధీ మైదాన్ వద్దే. నరేంద్ర మోడీ గాంధీ మైదాన్‌కు వచ్చేసరికి మొత్తం ఆరు పేలుళ్లు. అన్నీ గాంధీ మైదాన్ సమీపంలోనే. దీంతో టార్గెట్ మోడీ అని చాలా క్లియర్ గా తేలిపోయింది. బాంబుల తీవ్రత తక్కువే
మోడీ సభ రోజే పేలుళ్లు ఎలా జరిగాయబ్బా అని దిగ్విజయ్ సింగ్ లాంటి వారు వెటకారాలు చేసినా.. పేలుళ్ల వెనక ఎవరో హస్తముందని బీహార్ ప్రభుత్వ పెద్దలు అనుమానాలు వ్యక్తం చేస్తోన్న తీవ్రవాదుల లక్ష్యం మాత్రం మోడీనే అంటున్నాయ్ బీజేపీ శ్రేణులు. నరేంద్ర మోడీ లక్ష్యంగా పేలుళ్లు జరగడం.. హత్యాయత్నాలు జరగడం ఇదే మొదటిసారి కాదని చెబుతున్నాయ్. బీజేపీలో ఒక్కొ మెట్టు ఎక్కుతూ పాపులర్ అవుతున్న కొద్ది మోడీ శత్రుశేషం కూడా అలాగే పెరుగుతూ వస్తోంది.

ముఖ్యంగా గుజరాత్ సీఎంగా పగ్గాలు చేపట్టిన తర్వాత.. 2002 గోద్రా అల్లర్ల నుంచి నరేంద్ర మోడీ తీవ్రవాదులకు లక్ష్యంగా మారారు. ఆ తర్వాత సోహ్రాబుద్దీన్.. ఇష్రాత్ జహాన్ లాంటి వారు మోడీ మీద హత్యాయత్నానికి ప్రయత్నించడం.. పోలీస్ ల ఎన్ కౌంటర్లో వారిద్దరూ మరణించడం.. మైనార్టీలనే వారిని చంపారనే ఆరోపణలు రావడం మోడీ శత్రువుల సంఖ్యను మరింత పెంచాయ్. అప్పట్నుంచి మోడీని మట్టుబెట్టడానికి దేశీయ.. అంతర్జాతీయ తీవ్రవాద సంస్థలు ప్రయత్నిస్తూనే ఉన్నాయ్. తీవ్రవాదుల దాడుల నుంచి కొన్నిసార్లు మోడీ తృటిలో తప్పించుకొన్న సందర్భాలు కూడా ఉన్నాయ్.

ఇక బీజేపీ తరపున ప్రధాని అభ్యర్థిగా బరిలోకి దిగిన దగ్గర్నుంచి మోడీని హతమార్చాలనే ప్రయత్నాలు తీవ్రతరమైనట్లు కనిపిస్తున్నాయ్. మొన్నటికి మొన్న తమిళనాడు సభకు ముందు కూడా మోడీని హతమార్చడానికి ఉగ్రవాదులు ప్రయత్నించారు. పుత్తూరులో పట్టుబడ్డ ఆల్ ఉమా కార్యకర్తలు తిరుపతితో పాటు మోడీ సభను కూడా టార్గెట్ చేసుకొన్నారని వినిపించింది.

నిజానికి బీజేపీ అగ్రనేతలు తీవ్రవాదులకి ఎప్పుడు టార్గెటే. అద్వానీ, మోడీ లాంటి వారిని హతమార్చడానికి ఉగ్రవాదులు ఎప్పుడూ రెక్కీలు జరుపుతూనే ఉంటారు. గతంలోనూ ఈ విషయం అనేక సందర్భాల్లో రుజువైంది కూడా. 1998 ఫిబ్రవరి 14.. తమిళనాడులోని కోయంబత్తూరులో ఏర్పాటు చేసిన బీజేపీ ఎన్నికల ప్రచార సభలో పార్టీ అగ్రనేత అద్వానీ ప్రసంగించడానికి కొద్ది సేపటి ముందు సభా ప్రాంగణానికి వంద మీటర్ల దూరంలో బాంబు పేలుడు సంభవించింది. తర్వాత 40 నిమిషాల వ్యవధిలో రైల్వే స్టేషన్, బస్టాండ్ సహా నగరంలోని 11 ప్రాంతాల్లో 13 పేలుళ్లు చోటుచేసుకున్నాయ్.

ఈ దాడుల్లో 58 మంది చనిపోగా.. 200 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. కార్లు, బైకులు, సైకిళ్లపై బాంబులు అమర్చి ఉగ్రవాదులు ఈ పేలుళ్లకు పాల్పడ్డారు. అద్వానీ సభలో బాంబు పేలుళ్లతో అప్పటి అధికార డీఎంకే ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వచ్చాయ్. తర్వాత ఈ దాడులకు పాల్పడిన అల్ ఉమా అనే ఉగ్రవాద సంస్థను ప్రభుత్వం నిషేధించింది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలంగాణా సర్కార్ లో కొత్త గా 6 మంత్రులు ప్రమాణ స్వీకారం

చానెల్‌ ల రెటింగ్ పద్ధతలో మార్పు అవసరం- నియంత్రన తప్పని సరి

  గత వారం, ముంబై పోలీసులు మూడు న్యూస్ ఛానెళ్లతో కూడిన టిఆర్పి (టార్గెట్ రేటింగ్ పాయింట్స్) రాకెట్టును ఛేదించినట్లు చెప్పారు. అప్పటి నుండి, టిఆర్పిలను పర్యవేక్షించే బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) న్యూస్ ఛానల్స్ రేటింగ్లను మూడు నెలలు నిలిపివేసింది. ఈ కుంభకోణం మరోసారి నియంత్రణ అవసరాన్ని ఎత్తి చూపింది. టెలివిజన్ ఛానెల్‌లు టిఆర్‌పిలచే నడపబడతాయి. వీక్షకుల సంఖ్య వారి వ్యాపారాన్ని నడిపిస్తుంది. భారతదేశంలో వారానికి 760 మిలియన్ -800 మిలియన్ల వ్యక్తులు టీవీని చూస్తున్నారు. గ్రామీణ భారతదేశంలో టీవీ ప్రసారాలు   52% కాగా , పట్టణ భారతదేశంలో ఇది 87%. ఈ డిటిహెచ్ ( డైరెక్ట్ టు హోమ్ ) ద్వారా సుమారు 70 -80 మిలియన్ల గృహాలు , కేబుల్ తో 60 మిలియన్లు టీవీ ప్రసారాలను వీక్షిస్తున్నారు. డెంట్సు   అంచనా (2020)   ప్రకారం భారతదేశం లో మొత్తం ప్రకటనల మార్కెట్ 10 -12 బిలియన్లు . వీటిలో డిజిటల్ వాటా సుమారు 2 బిలియన్లు. ప్రతిరోజూ 550 మిలియన్ల మంది వ్యక్తులు, సుమారు 3.45 గంటలు టీవీ టీవీలో వీక్షిస్తున్నారు.   భారత దేశంతో ఈ 800 కి పైగా ...

ఇస్రో సక్సెస్ లో మహిళ మూర్తులు

మౌమీతా దత్త-.విద్యార్థి దశలో ఇస్రొ వైపు ఆకర్షితురాలై.. మార్స్ మిషన్‌ ప్రాజెక్టు మెనెజర్‌గా పని చేస్తుంది ఎన్‌ వలమతి -మెదటి భారత రాడార్‌ ఇమెజింగ్‌ శాలిలైట్‌ రీసాట్‌1 తయారీ లో వాలమతి కీలక పాత్రం పోషించారు రీతు కలిథాల్‌ ఇద్దురు బిడ్డలకు తల్తి ఇంజనీర్‌ తో జరిగే అంతర్మాథనం వారాంతరంలో పాల్గోంటారు. థేసీ థామస్‌-మీసైల్ విమెన్‌ గా పేరు సంపాదించిన మహిళ,అగ్ని నాలుగు,అగ్ని ఐదు మిషన్‌ ను లీడ్‌ చేశారు. అనురాధ టికె-జియోశాట్‌ పొగ్రాం డైరక్టర్‌ గా ఇస్రొ సీనియర్‌ మహిళ అధికారిగా ఉన్నారు. మినాల్‌ సంపత్‌-మార్స్ అర్బిటల్‌ మిషన్‌ కు 18 గంటలు శ్రమంచారు. నందిని హరినాథ్-ఆమె మెట్టమెదటి ఉద్యోగం ఇస్రొలోనే... అలా కొనసాగుతూనే ఉంది.వెనుకకు తిరిగి చూడవలసిన అవసరం రాలేదు. కీర్తి పజుంథార్‌-కంప్యూటర్‌ సైన్టిస్ట్ ,మాస్టర్‌ కంట్రోల్‌ రూంలో శాటిలైట్‌లు సరైన కక్ష్యలో ఉంచే బాధ్యత..