భారీ వర్షాలు, వరదలతో కోస్తా జిల్లాలు అల్లాడుతోంటే... పరామర్శల పేరుతో రాజకీయ లబ్ధి కోసం ప్రధాన పార్టీలు ప్రయత్నిస్తున్నారు. బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న పార్టీల నేతలు... బాధితులకు మేమున్నామనే ధైర్యం కల్పించాల్సింది పోయి.... అక్కడ కూడా వైరి పక్షాలపై విమర్శల బాణాలు ఎక్కుపెడుతున్నాయి.
ఫైలిన్ తుపాను సృష్టించిన బీభత్సం ఓ వైపు... ఆ వెంటనే ముంచుకొచ్చిన భారీ వర్షాలు మరోవైపు.... సీమాంధ్రలో తీరని నష్టాన్ని మిగిల్చాయి. చేతికందాల్సిన పంట నీళ్ళపాలవడంతో దిక్కుతోచని స్థితిలో రైతన్నలు అల్లాడుతోంటే... సర్వం కోల్పోయి పునరావాస శిబిరాల్లో తలదాచుకుంటున్న అభాగ్యులు... ఆపన్న హస్తం కోసం ఆశగా చూస్తున్నారు. తమ ప్రాంతానికి చెందిన ప్రజా ప్రతినిధులు, తామిచ్చిన ఓట్ల బలంతో అధికార పీఠాన్ని అధిష్టించి....... రాజ్యమేలుతున్న అధికార పార్టీ ఈ కష్టకాలంలో తమని ఆదుకుంటుందని ఆశిస్తున్నవారికి.. అణువంత భరోసా కూడా లభించడం లేదు. ఆపత్కాలంలో మేమున్నామంటూ మందుకు వచ్చి.... వీలైనంతగా ఆదుకోవాల్సిన రాజకీయ పార్టీలు, ఆ పార్టీల నేతలు దీనికి భిన్నమైన రీతిలో వ్యవహరిస్తున్నారు. పరామర్శల పేరుతో జనంలోకి వెళుతున్న నేతలు... బురద రాజకీయాలకు పాల్పడుతున్నారు. ప్రజల కష్ట, నష్టాలను తెలుసుకోవాల్సిన నేతలు.... ఈ పరిస్థితిని ఎలా క్యాష్ చేసుకోవాలి అని ఆలోచిస్తున్నారు. మూడు పార్టీలకు చెందిన ప్రధాన నేతలు మూడు వేర్వారు ప్రాంతాలను ఎన్నుకుని పర్యటిస్తున్నారు

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి