రాష్ట్ర కేబినెట్ సమావేశం సోమవారం సచివాలయంలో జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన ప్రభుత్వం రూపొందించిన ముసాయిదాపై మెజారిటీ ప్రజలు సంతోషంగా ఉన్నారని అన్నారు. ఆన్ లైన్లో, ప్రత్యక్షంగా ప్రజల నుంచి పలు సూచనలు, అభ్యంతరాలు, సలహాలు కూడా వస్తున్నాయని, వాటన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించి ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు. దసరా నుంచే కొత్త జిల్లాలతో పాటు, కొత్త డివిజన్లు, కొత్త మండలాలు కూడా ప్రారంభం కావాలని ప్రభుత్వం నిర్ణయించిందని, దీనికి సంబంధించిన పాలనా విభాగాల కూర్పు వేగవంతం కావాలని సిఎం ఆదేశించారు. ప్రస్తుతం ప్రభుత్వ శాఖల్లో ఏ విభాగానికి ఎక్కువ పని ఉంది, క్షేత్ర స్థాయిలో ఎక్కువ మంది ఉద్యోగుల అవసరం ఎక్కడ ఉంది అనే విషయాలను పరిగణలోకి తీసుకుని కొత్త ఉద్యోగులను నియమించుకోవాలని సూచించారు. జిల్లా స్థాయిలో ప్రస్తుతమున్న పరిపాలనా విభాగాలను యధావిధిగా కొనసాగించాలా? ఏమైనా మార్పులు చేర్పులు చేసుకోవాలా? అనే విషయంపై కూడా అధికారులు సూచనలు చేయాలని చెప్పారు. మంత్రులు, శాఖల కార్యదర్శులు, శాఖాధిపతులు సమావేశమై రెండు రోజుల్లో నివేదిక ఇవ...