కొత్త పెద్దాసుపత్రుల
నిర్మాణం, హైదరాబాద్ నగరంతో పాటు కరీంనగర్, ఖమ్మం పట్టణాల్లో నిర్మించతలపెట్టి, రెండేళ్లలో పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని,
ఆసుపత్రుల డిజైన్లు రూపొందించి, వెంటనే టెండర్లు పిలవాలని ,గాంధి, ఉస్మానియా తరహాలో హైదరాబాద్ నగరంలో మొదటి దశలో మూడు పెద్దాసుపత్రులు నిర్మించాలని, ఒక్కో ఆసుపత్రిలో 750 పడకలు ఏర్పాటు, వీటిలో 500 బెడ్స్ మల్టి స్పెషాలిటీ కోసం, 250 బెడ్స్ ను పిల్లలు, మహిళల కోసం, ఉస్మానియా ఆసుపత్రి టవర్స్ ను కూడా వెయ్యి పడకల సామర్థ్యంతో నిర్మించాలని చెప్పారు. కరీంనగర్, ఖమ్మంలో ఒక్కోటి 500 పడకల సామర్థ్యంతో ...కొత్త ఆసుపత్రుల్లో 4,250 పడకల సామర్థ్యం, ఈ ఆసుపత్రుల నిర్మాణం త్వరితగతిన పూర్తి కావాలని చెప్పారు.
ఆర్థిక సహకారానికి ముందుకొచ్చిన రాబో బ్యాంకు
-----------------------------------------------------------
నెదర్లాండ్స్ కు చెందిన రాబో బ్యాంకు ,తెలంగాణలో నిర్మించే కొత్త ఆసుపత్రుల నిర్మాణంలో భాగస్వాములు అయ్యేందుకు ముందుకు వచ్చింది. పెద్దాసుపత్రులు నిర్మించిన అనుభవం ఉన్న రాబో బ్యాంకు ..శ్రీలంకతో పాటు పలు ప్రాంతాల్లో... తెలంగాణ ఆసుపత్రుల నిర్మాణ వ్యయంలో, నిర్మాణంలో భాగం పంచుకుంటుందని సంస్థ ప్రతినిధులు చెప్పారు. రాబో బ్యాంకు వైస్ ప్రసిడెంట్ హాన్ బార్టెల్డ్స్ (Han Bartelds) నాయకత్వంలోని ప్రతినిధుల బృందం ముఖ్యమంత్రి ని కలిసి తమ సంసిద్ధత వ్యక్తం చేశారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి