రాష్ట్రప్రభుత్వం పేదల ఆరోగ్య పరిరక్ష నకు ఏపీని సంపూర్ణ ఆరోగ్యాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దే లక్ష్యంతో బుధవారం నాడు నాలుగు ఉచిత వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చింది.
పిరామల్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో, రాష్ట్రంలోని 13వేల గ్రామాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించేందుకు చంద్రన్న సంచార చికిత్స పేరిట 275 మొబైల్ మెడికల్ యూనిట్ల(ఎంఎంయూ) వాహనాలను ఏర్పాటు చేశారు. వీటిలో పనిచేసేందుకు మెడికల్ ఆఫీసర్, ఫార్మాసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్లు, 300మంది వైద్యులు, 900మంది పారామెడికల్ సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. గర్భిణులకు, చిన్నారులకు, సాధారణ వ్యాధులకు, తీవ్రమైన అంటువ్యాధులకు, దంత, కంటి, ఈఎన్టీ సహా పలు వైద్య పరీక్షలను నిర్వహించి చికిత్స అందిస్తారు. వ్యాధి నిరోధక టీకాలనూ వేస్తారు.
సీటీ స్కాన్:రాష్ట్రంలోని టెక్కలి, చీరాల, ప్రొద్దుటూరు, గూడూరుల్లో ప్రయోగాత్మక ప్రాజెక్టులుగా సోమవారం నుంచి సీటీ స్కాన్ సేవలు ప్రారంభమయ్యాయి. ఎన్టీఆర్ వైద్య పరీక్షలలో భాగంగా సీటీ స్కాన్ యూనిట్లను ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రారంభించారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి