నిధులు, భూసేకరణ సమస్యలు లేనందున నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణం శరవేగంగా పూర్తి చేసి రైతుల పొలాల్లోకి సాగునీరు పంపాలని ,ముఖ్యంగా కరువు పీడిత, వలస బాధిత పాలమూరు జిల్లా రైతులకు సాగునీరు అందించడం మొదటి లక్ష్యంగా, పాలమూరు ఎత్తిపోతల పథకం టెండర్లు పూర్తయిన నేపథ్యంలో త్వరితగతిన పనులు పూర్తి చేసేందుకు అవసరమైన కార్యాచరణను రూపొందించడానికి ముఖ్యమంత్రి కేసిఆర్ క్యాంపు కార్యాలయంలో ఆదివారం సమీక్షా సమావేశం నిర్వహించారు.నీటి పారుదల ప్రాజెక్టుల బిల్లులు ఎప్పటికప్పుడు చెల్లించేందుకు ప్రతి నెలా 2,000 కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నందున నిధుల విషయంలో ఎలాంటి సమస్య లేదని సిఎం అన్నారు.పాలమూరు ఎత్తిపోతల కి సంబంధించిన ఇంటేక్ వెల్స్, పంప్ హౌజ్ లు, రిజర్వాయర్లు, కాలువలు, టన్నెళ్ళ నిర్మాణం సమాంతరంగా, వీటికి సంబంధించిన డిజైన్లను కూడా త్వరగా పూర్తి చేయాలన్నారు. రిజర్వాయర్ల సామార్థ్యాన్ని కూడా నిర్మాణాలకు అనుగుణంగా క్రమంగా పెంచుకుంటూ పోవాలన్నారు.
గత వారం, ముంబై పోలీసులు మూడు న్యూస్ ఛానెళ్లతో కూడిన టిఆర్పి (టార్గెట్ రేటింగ్ పాయింట్స్) రాకెట్టును ఛేదించినట్లు చెప్పారు. అప్పటి నుండి, టిఆర్పిలను పర్యవేక్షించే బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) న్యూస్ ఛానల్స్ రేటింగ్లను మూడు నెలలు నిలిపివేసింది. ఈ కుంభకోణం మరోసారి నియంత్రణ అవసరాన్ని ఎత్తి చూపింది. టెలివిజన్ ఛానెల్‌లు టిఆర్‌పిలచే నడపబడతాయి. వీక్షకుల సంఖ్య వారి వ్యాపారాన్ని నడిపిస్తుంది. భారతదేశంలో వారానికి 760 మిలియన్ -800 మిలియన్ల వ్యక్తులు టీవీని చూస్తున్నారు. గ్రామీణ భారతదేశంలో టీవీ ప్రసారాలు 52% కాగా , పట్టణ భారతదేశంలో ఇది 87%. ఈ డిటిహెచ్ ( డైరెక్ట్ టు హోమ్ ) ద్వారా సుమారు 70 -80 మిలియన్ల గృహాలు , కేబుల్ తో 60 మిలియన్లు టీవీ ప్రసారాలను వీక్షిస్తున్నారు. డెంట్సు అంచనా (2020) ప్రకారం భారతదేశం లో మొత్తం ప్రకటనల మార్కెట్ 10 -12 బిలియన్లు . వీటిలో డిజిటల్ వాటా సుమారు 2 బిలియన్లు. ప్రతిరోజూ 550 మిలియన్ల మంది వ్యక్తులు, సుమారు 3.45 గంటలు టీవీ టీవీలో వీక్షిస్తున్నారు. భారత దేశంతో ఈ 800 కి పైగా ...

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి