2008-09లో గత పాలకులు, పోస్టులు మంజూరీ చేయకుండానే 73
ప్రభుత్వ జూనియర్ కళాశాలలను మంజూరు , పనిచేస్తున్న
632 మందిని ఈ కళాశాలల్లోని అన్ సాంక్షన్డ్ పోస్టుల్లోకి బదిలీచేసి తమకు అన్యాయం చేశారని,16 జీవో ప్రకారం రెగ్యులర్ కావడానికి అనర్హులుగా మారే ప్రమాదం తలెత్తిందని తెలంగాణ ప్రభుత్వ కళాశాలల కాంట్రాక్ట్ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు సిహెచ్ ముఖ్యమంత్రికి వివరించారు.గత పాలకులు తీసుకున్న తప్పుడు నిర్ణయాలు తెలంగాణ ప్రభుత్వానికి తలనొప్పిగా మారడమేకాకుండా కాంట్రాక్టు లెక్చరర్లను రెగ్యులర్ చేయడానికి అర్హతలున్న వారందరినీ గుర్తించి తగున్యాయం చేయాల్సిన అవసరమున్నదని, న్యాయపరమైన చిక్కులు తెచ్చిపెట్టే పరిస్థితి తలెత్తిందని ముఖ్యమంత్రి అన్నారు. సత్వర న్యాయం జరిగే దిశగా కార్యాచరణ చేపట్టాలని విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరిని సిఎం ఆదేశించారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి