ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ధర్మరాజుకు యమ ధర్మరాజు72 ప్రశ్నలు

ధర్మరాజును పరీక్షించించుటకు యమ ధర్మరాజు అడిగిన 72 యక్ష ప్రశ్నలు వాటికి ధర్మరాజు ఇచ్చిన జవాబులు.

1. సూర్యుణ్ణి ఉదయింప చేయువారు ఎవరు?(బ్రహ్మం)

2. సూర్యుని చుట్టూ తిరుగువారెవరు? (దేవతలు)

3. సూర్యుని అస్తమింపచేయునదిఏది?(ధర్మం)

4. సూర్యుడు దేని ఆధారంగా నిలచియున్నాడు?(సత్యం)

5. మానవుడు దేనివలన శ్రోత్రియుడగును?(వేదం)

6. దేనివలన మహత్తును పొందును?(తపస్సు)

7. మానవునికి సహయపడునది ఏది?(ధైర్యం)

8. మానవుడు దేనివలన బుద్ధిమంతుడగును?(పెద్దలను సేవించుటవలన)

9. మానవుడు మానవత్వముని ఎట్లు పొందును?(అధ్యయనము వలన)

10. మానవునికి సాధుత్వాలు ఎట్లు సంభవిస్తాయి?

(తపస్సు వలన సాధుభావము, శిష్టాచార భ్రష్టతవం వల్లఅసాధుభావము సంభవించును.)

11. మానవుడు మనుష్యుడెట్లు అవుతాడు?( మౄత్యు భయమువలన)

12. జీవన్మౄతుడెవరు?(దేవతలకూ,అతిధులకూ పితౄసేవకాదులకు పెట్టకుండా తినువాడు)

13. భూమి కంటె భారమైనది ఏది? (జనని)

14. ఆకాశంకంటే పొడవైనది ఏది? (తండ్రి)

15. గాలికంటె వేగమైనది ఏది?(మనస్సు)

16. మానవునికి సజ్జనత్వం ఎలావస్తుంది?

( ఇతరులు తనపట్ల ఏపని చేస్తే , ఏ మాట మాట్లాడితే తన మనస్సుకు బాధ కలుగుతుందోతాను ఇతరుల పట్ల కూడా ఆ మాటలు మాట్లాడకుండా ఎవడు ఉంటాడోఅట్టి వానికి సజ్జనత్వం వస్తుంది)

17. తౄణం కంటె దట్టమైనది ఏది (చింత)

18. నిద్రలో కూడా కన్ను మూయనిది ఏది?(చేప)

19. రాజ్యమేలేవాడు దైవత్వం ఎలా పొందుతాడు?( అస్త్రవిద్యచే)

20. రాజ్యధినేతకు సజ్జనత్వం ఎలా కలుగుతుంది?( యజ్ణ్జం చేయుటవలన)

21. జన్మించియు ప్రాణంలేనిది(గుడ్డు)

22. రూపం ఉన్నా హౄదయం లేనిదేది?(రాయి)

23. మానవుడికి దుర్జనత్వం ఎలా వస్తుంది?(శరణుజొచ్చిన వారిని రక్షించక పోవడం వలన )

24. ఎల్లప్పుడూ వేగం గలదేది?(నది)

25. రైతుకు ఏది ముఖ్యం?(వాన)

26. బాటసారికి, రోగికి, గౄహస్ధునకూ, చనిపోయిన వారికిబంధువులెవ్వరు?

(సార్ధం, వైద్యుడు, శీలవతి అనుకూలవతిఅయిన భార్య, సుకర్మ వరుసగా బంధువులు)

27. ధర్మానికి ఆధారమేది?(దయ దాక్షిణ్యం)

28. కీర్తికి ఆశ్రయమేది?(దానం)

29. దేవలోకానికి దారి ఏది?(సత్యం)

30. సుఖానికి ఆధారం ఏది?(శీలం)

31. మనిషికి దైవిక బంధువులెవరు?(భార్య/భర్త)

32. మనిషికి ఆత్మ ఎవరు?( కూమారుడు)

33. మానవునకు జీవనాధారమేది?(మేఘం)

34. మనిషికి దేనివల్ల సంతసించును?(దానం)

35. లాభాల్లో గొప్పది ఏది?(ఆరోగ్యం)

36. సుఖాల్లో గొప్పది ఏది?(సంతోషం)

37. ధర్మాల్లో ఉత్తమమైనది ఏది?(అహింస)

38. దేనిని నిగ్రహిస్తే సంతోషం కలుగుతుంది?(మనస్సు)

39. ఎవరితో సంధి శిధిలమవదు? (సజ్జనులతో)

40. ఎల్లప్పుడూ తౄప్తిగా పడియుండునదేది?(యాగకర్మ)

41. లోకానికి దిక్కు ఎవరు?(సత్పురుషులు)

42. అన్నోదకాలు వేనియందు ఉద్భవిస్తాయి?(భూమి,ఆకాశములందు)

43. లోకాన్ని కప్పివున్నది ఏది?(అజ్ణ్జానం)

44. శ్రాద్ధవిధికి సమయమేది?(బ్రాహ్మణుడు వచ్చినప్పుడు)

45. మనిషి దేనిని విడచి స్ర్వజనాదరణీయుడు, శోకరహితుడు,ధనవంతుడు, సుఖవంతుడు అగును?

( వరుసగా గర్వం,క్రోధం, లోభం, తౄష్ణ వడచినచో)

46. తపస్సు అంటే ఏమిటి?( తన వౄత్బికుల ధర్మం ఆచరించడం)

47. క్షమ అంటే ఏమిటి?( ద్వంద్వాలు సహించడం)

48. సిగ్గు అంటే ఏమిటి?(చేయరాని పనులంటే జడవడం)

49. సర్వధనియనదగు వాడెవడౌ?( ప్రియాప్రియాలనుసుఖదు:ఖాలను సమంగా ఎంచువాడు)

50. జ్ణ్జానం అంటే ఏమిటి?(మంచి చెడ్డల్ని గుర్తించ గలగడం)

51. దయ అంటే ఏమిటి?( ప్రాణులన్నింటి సుఖము కోరడం)

52. అర్జవం అంటే ఏమిటి?( సదా సమభావం కలిగి వుండడం)

53. సోమరితనం అంటే ఏమిటి?(ధర్మకార్యములు చేయకుండుట)

54. దు:ఖం అంటే ఏమిటి?( అజ్ణ్జానం కలిగి ఉండటం)

55. ధైర్యం అంటే ఏమిటి?( ఇంద్రియ నిగ్రహం)

56. స్నానం అంటే ఏమిటి?(మనస్సులో మాలిన్యం లేకుండాచేసుకోవడం)

57. దానం అంటే ఏమిటి?( సమస్తప్రాణుల్నిరక్షించడం)

58. పండితుడెవరు?( ధర్మం తెలిసినవాడు)

59. మూర్ఖుడెవడు?(ధర్మం తెలియక అడ్డంగావాదించేవాడు)

60. ఏది కాయం?( సంసారానికి కారణమైంది)

61. అహంకారం అంటే ఏమిటి?( అజ్ణ్జానం)

62. డంభం అంటే ఏమిటి?(తన గొప్పతానే చెప్పుకోవటం)

63. ధర్మం, అర్ధం, కామం ఎక్కడ కలియును?(తన భార్యలో, తనభర్తలో)

64. నరకం అనుభవించే వారెవరు?(ఆశపెట్టి దానం ఇవ్వనివాడు;వేదాల్నీ, ధర్మ శాస్త్రాల్నీ, దేవతల్నీ, పితౄదేవతల్నీ, ద్వేషించేవాడూ,దానం చెయ్యనివాడు)

65. బ్రాహ్మణత్వం ఇచ్చేది ఏది?(ప్రవర్తన మాత్రమే)

66. మంచిగా మాట్లాడేవాడికి ఏమి దొరుకుతుంది?(మైత్రి)

67. ఆలోచించి పనిచేసేవాడు ఏమవుతాడు?(అందరి ప్రశంసలు పొంది గొప్పవాడవుతాడు)

68. ఎక్కువ మంది మిత్రులు వున్నవాడు ఏమవుతాడు?(సుఖపడతాడు)

69. ఎవడు సంతోషంగా ఉంటాడు?(అప్పులేనివాడు,తనకున్న దానిలోతిని తృప్తి చెందేవాడు)

70. ఏది ఆశ్చర్యం?

ప్రాణులు ప్రతిరోజూ మరణిస్తూ ఉండడం చూస్తూ మనిషి తానే శాశ్వతంగా ఈ భూమి మీద ఉండి పోతాననుకోవడం.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు