డిసెంబర్ 6న హోంగార్డుల ఆవిర్బావ దినోత్సవాన్ని పురస్కరించుకొని... ప్రతి నిత్యం విధుల్లో అంకితభావంతో పనిచేస్తున్న హోంగార్డుల పట్ల ప్రభుత్వం అత్యంత ఉదారంగా వ్యవహరిస్తుందని... రాష్ట్రంలో పనిచేస్తున్న 16 వేల మంది హోంగార్డుల వేతనాన్ని 9 వేల నుండి 12 వేలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. ఈ ఏడాది బడ్జెట్ ఇప్పటికే పూర్తయినందున వచ్చే ఏడాది బడ్జెట్‌లో పొందుపరిచి 2015 ఏప్రిల్ మాసం నుండి పెంచిన జీతాలు అందించాలని అధికారులను ఆదేశించారు. హోంగార్డులకు మెడికల్ ఇన్సూరెన్సు, ఏడాదికి రెండు డ్రస్సులు, హైదరాబాద్, సైబరాబాద్ కమీషనరేట్ పరిధిలో బస్ పాసులు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం నెలకు రెండు సార్లు పరేడ్ అలవెన్సు పేరిట ఇస్తున్న రూ. 28/- ని 100/- రూపాయలకు పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి