చారిత్రక ఆనవాళ్లు చెరిగిపోకుండానే హైదరాబాద్‌ను అంతర్జాతీయ స్థాయి ఆధునిక నగరంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. సచివాలయంలో గురువారం ప్రముఖ ఆర్కిటెక్ట్ హఫీజ్ బృందంతో హైదరాబాద్‌లో చేపట్టాల్సిన పలు నిర్మాణాలపై చర్చించారు. మ్యాప్‌లు పరిశీలించారు. గూగుల్ ఎర్త్ ద్వారా వివిధ ప్రాంతాలను కొత్త కట్టడాల కోసం గుర్తించారు. హఫీజ్ బృందం నగరంలోని మూసి నది చుట్టు ప్రక్కల ప్రాంతాల్లో చేపట్టాల్సిన నిర్మాణాల ప్రతిపాదనలను కూడా పరిశీలించారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి కొత్త నిర్మాణాలకు సంబంధించి పలు సూచనలు చేశారు. ముందుగా ఇందిరా పార్క్ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో తెలంగాణ కళా భారతి పేరుతో అంతర్జాతీయ స్థాయి కన్వెన్షన్ సెంటర్ నిర్మించాలని సూచించారు. ఇందుకు సంబంధించి డిజైన్ తయారు చేయాలన్నారు. నాలుగు ఆడిటోరియాలు, విశాలమైన పార్కింగ్ ఏరియా వచ్చే విధంగా నమునా తయారు చేయాలని సూచించారు. ఒక ఆడిటోరియంలో 2500-3000 మంది పట్టే విధంగా, మరో దాంట్లో 1500 మంది, మూడో దాంట్లో 1000 మంది, నాలుగు దాంట్లో 600 మంది పట్టే విధంగా ఆడిటోరియాలు డిజైన్ చేయాలన్నారు. ప్రస్తుతం రవీంద్రభారతి ఉన్న ప్రాంతంలో హైదరాబాద్ చారిత్రక, సాంస్కృతిక ప్రత్యేకతలను చాటే విధంగా ఓ ప్రత్యేక కట్టడం రావాలని ముఖ్యమంత్రి చెప్పారు. మోజంజాహి మార్కెట్, చార్మినార్ ప్రాంతం, హుస్సెన్‌సాగర్ చుట్టు ప్రక్కల ప్రాంతం, సాలార్‌జంగ్ మ్యూజియం ప్రాంతాల్లో ఇప్పటికే ఉన్న నిర్మాణాలకు మరింత వన్నె తెచ్చే విధంగా ఆవరణలు తయారు చేయాలని, వాటి ప్రాముఖ్యత ఏ మాత్రం దెబ్బతినకుండా, వాటికి అనుబంధంగా మరిన్ని నిర్మాణాలు రావాలని సూచించారు. ఇందుకు అవసరమైన ప్రణాళికలు తయారు చేయాలన్నారు. మూసికి రెండు వైపుల కూడా అద్బుతమైన పార్కులు, పార్కింగ్ ప్లేసులు రావాలని చెప్పారు. మూసా, ఈసా నదుల ప్రాంతాన్ని చాదర్‌ఘాట్ నుండి బాపు ఘాట్ దాకా సర్వే చేసి అందులో ప్రభుత్వ భూమి ఎంత ఉందో నిర్ణయించాలన్నారు. ఆ తరువాత మూసి నది ప్రక్షాళన, సుందరీకరణ పనుల కోసం ప్రణాళికలు తయారు చేయాలన్నారు. సాలార్‌జంగ్ మ్యూజియాన్ని అంతర్జాతీయ స్థాయి మ్యూజియంగా తీర్చిదిద్దాలని చెప్పారు.
హైదరాబాద్ అద్బుతమైన నిర్మాణ నైప్యుణంతో కట్టబడిన నగరమని ముఖ్యమంత్రి అన్నారు. నిజాం రాజులు చార్మినార్, గోల్కోండ, ఫలక్‌నామా, చౌమల్లా ప్యాలేస్, మక్కామసీద్, సాలార్‌జంగ్ మ్యూజియం, అసెంబ్లీ, హైకోర్టు లాంటి అద్బుతమైన భవనాలు నిర్మించి నగరానికి ప్రపంచ ఖ్యాతిని తెచ్చిపెట్టారన్నారు. తరువాత వచ్చిన పాలకులు ఆ వారసత్వాన్ని కొనసాగించడంలో విఫలమయ్యారని ముఖ్యమంత్రి చెప్పారు. నిజాం రాజులు అధ్బుతమైన కట్టడాలు అందిస్తే వాటికి అనుబంధంగా మరిన్ని కట్టడాలు తేవాల్సిందని, కాని పాలకులకు ఏ మాత్రం చిత్తశుద్ది లేకపోవడం వల్ల ఈ నగరాన్ని ఓ రియల్ ఎస్టేట్ వ్యాపార కేంద్రంగా చూశారని అన్నారు. ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగిన భూమి పుత్రులుగా హైదరాబాద్ నగరంలోని ప్రతి అంగుళం విలువ తమకు తెలుసని, గత వైభవం పునరుద్దరింపబడేలా కొత్త నిర్మాణాలు రావాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. హైదరాబాద్ నగరాన్ని యూనిక్ సిటిగా తయారు చేయాలని చెప్పారు. చార్మినార్ లాంటి కట్టడాలను మరిపించి, హైటెక్ సిటి పేరుతో నిర్మించిన ఓ సాధారణ సిమెంట్ కట్టడాన్ని హైదరాబాద్ సింబల్‌గా గత పాలకులు చూపించే ప్రయత్నం చేశారన్నారు. గతంలో జరిగిన పొరపాట్లను సవరించాల్సిన బాధ్యత తమపై ఉన్నదని అద్బుత కట్టడాలతో నగర కీర్తిని పెంచుతామని, ఇందుకోసం ఎంత ఖర్చయినా వెనకాడేది లేదన్నారు. ఏ ప్రాంతంలో ఏలాంటి కట్టడం రావాలి, ఎంత విస్తీర్ణంలో నిర్మించాలి, వాటిని ఎందుకోసం ఉపయోగించాలి అనే అంశాలపై సమగ్ర అధ్యయనం తయారు చేసి ప్రణాళికలు రూపొందించాలని అధికారులను, హఫీజ్ బృందాన్ని ముఖ్యమంత్రి కోరారు. హైదరాబాద్ నగరమంతా ఒకే రకంగా లేదని, వాటి చారిత్రక నేపథ్యం, సామాజిక పరిస్థితుల ఆధారంగా కొత్త నిర్మాణాలు రావాలన్నారు. ఇందుకోసం డిజైన్‌లలో కూడా వ్యత్యాసం ఉండాలని చెప్పారు. మూసి నదికి దక్షిణ భాగంలో ఉన్న ఒల్డ్ సిటి, ఉత్తర భాగంలో ఉన్న న్యూ కమ్ ఓల్డ్ సిటి, బంజారా హిల్స్, జూబ్లి హిల్స్, మాధాపూర్ లాంటి ప్రాంతాలతో కూడుకున్న న్యూ సిటి, పారిశ్రామిక వాడలు ఉన్న ప్రాంతాలు, ఐటి పరిశ్రమ అభివృద్ది చెందుతున్న ప్రాంతాలు, HMDA పరిధిలోని శివారు కాలనీలు, మురికి వాడలు వేరు వేరుగా ఉన్నాయని వాటి కనుగుణంగానే ప్రణాళికలు ఉండాలని చెప్పారు. ప్రస్తుతం ఉన్న ఫ్లై ఓవర్లు కూడా నగర ట్రాఫిక్ అవసరాలను తీర్చే విధంగా లేవని చెప్పారు. ట్రాఫిక్‌కు అనుగుణంగా మల్టి లేయర్ ఫ్లై ఓవర్లు రావాలని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ నగర సమీపంలోని యాదగిరిగుట్ట, జహంగీర్ దర్గాలను కూడా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు.
భౌగోళికంగా, వాతావరణ పరంగా, సామాజికంగా హైదరాబాద్ నగరం ఎంతో ప్రత్యేకమైనదని, ఈ ప్రత్యేకతలను ఓ అవకాశంగా మార్చుకోవాలని చెప్పారు. కొత్త నిర్మాణాలు చేపట్టడానికి, విస్తరించుకోవడానికి అవకాశం ఉందన్నారు. నగరంలో కొత్తగా వచ్చే టవర్లు, బహుళ అంతస్తుల భవనాలు రాష్ట్ర ఆర్థిక ప్రగతికి కూడా ఉపయోగపడాలని చెప్పారు. ఆ భవనాలను చూస్తే హైదరాబాద్ చారిత్రక, వారసత్వ, సాంస్కృతిక లక్షణాలు ఉట్టి పడాలని, అదే సమయంలో ప్రజల వినోద, వ్యాపార, కార్యాలయాల, ఆర్థిక అవసరాలు తీర్చాలని ముఖ్యమంత్రి చెప్పారు. చరిత్ర ఆనవాళ్లు చెరగకుండా ఆధునికంగా తయారయిన ఇస్తాంబుల్ నగరం స్పూర్తిగా హైదరాబాద్ అంతర్జాతీయ నగరంగా మారాలని ఆకాంక్షించారు. ప్రపంచంలోని ప్రతి పౌరుడు తప్పకుండా సందర్శించాలనుకునే నగరాల జాబితాలో హైదరాబాద్ శాశ్వతంగా ఉండాలని ముఖ్యమంత్రి అన్నారు. ఉప ముఖ్యమంత్రి డా.టి.రాజయ్య, నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు, ప్రభుత్వ సలహాదారులు రమణాచారి, బివి.పాపారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, ముఖ్య కార్యదర్శులు నర్సింగ్‌రావు, ఎస్‌కె.జోషి, రేమాండ్ పీటర్, బిపి.అచార్య, జిహెచ్‌ఎంసి కమీషనర్ సోమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి