రాజకీయాలు వేరు, మితృత్వం వేరు... మెదక్ జిల్లాకు చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి చెరుకు ముత్యం రెడ్డి గురువారం సచివాలయానికి వచ్చారు. నీరసంగా కనిపించిన చెరుకు ముత్యంరెడ్డిని ముఖ్యమంత్రి గమనింఛి .. . కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుసుకున్నారు . ఆమెరికాకు వెళ్లి మంచి వైద్యం చేయించుకోవాలని సూచించారు. . డబ్బు విషయం నాకు వదిలిపెట్టు ముందు ఆరోగ్యం కాపాడుకోండి అని ముఖ్యమంత్రి చెప్పారు. వెంటనే సిఎంఓ అధికారులను పిలిపించి .. . ప్రపంచంలోనే మెరుగైన వైద్యం అందే ఆమెరికాలోని స్లోన్ కెట్టెరింగ్ ఆసుపత్రికి ముత్యం రెడ్డి పంపాలని ఆదేశించారు. ఆమెరికా వెళ్లి వైద్యం చేయించుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. పాస్‌పోర్టు, వీసాలతో పాటు అక్కడ వైద్యుల అపాయింట్‌మెంట్ తదితర వ్యవహారాలను కూడా ముఖ్యమంత్రి కార్యాలయం నుండే పర్యవేక్షించాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి కేసిఆర్ స్పందన చూసిన తరువాత చెరుకు ముత్యంరెడ్డి చమర్చిన కళ్లతో కృతజ్ఞతలు తెలిపారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి