తెలంగాణలో అంతర్జాతీయ స్థాయి సినిమాసిటి, స్పోర్ట్స్ సిటిలను నిర్మించనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు చెప్పారు. అందుకు రంగారెడ్డి, నల్గొండ జిల్లాల సరిహద్దులోని రాచకొండ ప్రాంతం అనువైనదని ముఖ్యమంత్రి వెల్లడించారు. విద్యా శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి, రవాణా శాఖ మంత్రి పి.మహేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మలతో కలిసి రాచకొండ ప్రాంతంలో ముఖ్యమంత్రి సోమవారం ఏరియల్ సర్వే నిర్వహించారు. రాచకొండ ప్రాంతంలో కాలినడకన కూడా తిరిగి ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. దాదా...పు 31 వేల ఎకరాలకు పైగా భూమి ఈ ప్రాంతంలో ఉందని, ఇది తెలంగాణలో పలు పరిశ్రమలు, సంస్థలు, విద్యాలయాలు స్థాపించడానికి అనువైనదని చెప్పారు. కాలుష్యం వెదజల్లని సంస్థలన్నింటిని ఇక్కడే నెలకొల్పాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. సినిమా సిటి,స్పోర్ట్స్ సిటి, విశ్వవిద్యాలయాలు, ఇతర సంస్థలను ఇక్కడ ఏర్పాటు చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. రాచకొండ ప్రాంతంలో చదును ఉన్న భూమి ఎక్కువగా ఉంది, కొద్దిపాటి కొండ ప్రాంతాలు కూడా ఉన్నాయి. వీటిన్నింటిని ఉపయోగించుకొని తెలంగాణకు తలమానికంగా నిలిచే సంస్థలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు
ఈ కార్యక్రమంలో రంగారెడ్డి, నల్గొండ జిల్లాల కలెక్టర్లు శ్రీధర్, చిరంజీవులు పాల్గోన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి