అమ్మాయిలను వ్యభిచార కూపాలకు పంపే దురాచారానికి వ్యతిరేకంగా,సామాజిక దుస్థితిని కళ్లకు కట్టినట్లు చూపించిన నా బంగారు తల్లి సినిమాను ప్రభుత్వ పరంగా ప్రొత్సహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. సినిమాకు వంద శాతం వినోదపు పన్ను మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించారు. అమ్మాయిల అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమా ఎక్కువ భాగం హైదరాబాద్‌లోనే నిర్మించారని, ఇందులో నటీ నటులు కూడా తెలంగాణ వారే ఎక్కువగా ఉన్నారని ముఖ్యమంత్రి అన్నారు. సమాజానికి మంచి సందేశం అందించే ఇతివృత్తంతో ఈ సినిమా తీశారని ముఖ్యమంత్రి చెప్పారు. ఇలాంటి సినిమాలను ప్రొత్సహించడం ఓ విధానంగా తెలంగాణ ప్రభుత్వం పెట్టుకున్నదని అన్నారు. సినిమాకు రూపకల్పన చేసిన స్వచ్చంద కార్యకర్త ప్రజ్వలను ముఖ్యమంత్రి అభినందించారు. ఇప్పటికే మూడు జాతీయ అవార్డులు కూడా గెలుచుకున్న ఈ చిత్రం మరిన్ని సామాజిక చిత్రాలు రావడానికి ప్రేరణ కావాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు
గత వారం, ముంబై పోలీసులు మూడు న్యూస్ ఛానెళ్లతో కూడిన టిఆర్పి (టార్గెట్ రేటింగ్ పాయింట్స్) రాకెట్టును ఛేదించినట్లు చెప్పారు. అప్పటి నుండి, టిఆర్పిలను పర్యవేక్షించే బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) న్యూస్ ఛానల్స్ రేటింగ్లను మూడు నెలలు నిలిపివేసింది. ఈ కుంభకోణం మరోసారి నియంత్రణ అవసరాన్ని ఎత్తి చూపింది. టెలివిజన్ ఛానెల్‌లు టిఆర్‌పిలచే నడపబడతాయి. వీక్షకుల సంఖ్య వారి వ్యాపారాన్ని నడిపిస్తుంది. భారతదేశంలో వారానికి 760 మిలియన్ -800 మిలియన్ల వ్యక్తులు టీవీని చూస్తున్నారు. గ్రామీణ భారతదేశంలో టీవీ ప్రసారాలు 52% కాగా , పట్టణ భారతదేశంలో ఇది 87%. ఈ డిటిహెచ్ ( డైరెక్ట్ టు హోమ్ ) ద్వారా సుమారు 70 -80 మిలియన్ల గృహాలు , కేబుల్ తో 60 మిలియన్లు టీవీ ప్రసారాలను వీక్షిస్తున్నారు. డెంట్సు అంచనా (2020) ప్రకారం భారతదేశం లో మొత్తం ప్రకటనల మార్కెట్ 10 -12 బిలియన్లు . వీటిలో డిజిటల్ వాటా సుమారు 2 బిలియన్లు. ప్రతిరోజూ 550 మిలియన్ల మంది వ్యక్తులు, సుమారు 3.45 గంటలు టీవీ టీవీలో వీక్షిస్తున్నారు. భారత దేశంతో ఈ 800 కి పైగా ...
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి