ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

మెదక్‌ జిల్లా సాగునీటి అవసరాలు

మంజీరా నీటిని మెదక్‌ జిల్లా సాగునీటి అవసరాల కోసం పూర్తి స్థాయిలో వినియోగించుకొనే విధంగా తమ ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేసిందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు అన్నారు. మంజీరా నీరు హైదరాబాద్‌ ప్రజల మంచినీటి అవసరాల కోసం వినియోగిస్తున్నందువల్ల ప్రస్తుతం మెదక్‌ జిల్లాకు సాగునీటి కొరత ఏర్పడుతున్నదన్నారు. కృష్ణా నది నీటిని హైదరాబాద్‌  తరలించి మంజీరా నీటిని మెదక్‌ జిల్లాలో వినియోగించాలన్నది తమ లక్ష్యమని సిఎం ప్రకటించారు. మంజీరా నీటిని సింగూర్‌ ప్రాజెక్టులో నిలువ చేసి ఘనపూర్‌ ఆనికట్‌ ద్వారా మెదక్‌ జిల్లాలో 25 వేల ఎకరాలకు నీరందించే విధంగా పనులు చేయాలని ముఖ్యమంత్రి అన్నారు. మెదక్‌ జిల్లా పుల్చారం మండలంలో మంజీరా నదిపై నిర్మించిన ఘనపుర్‌ ఆనికట్‌ను ముఖ్యమంత్రి సందర్శించారు. నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీష్‌రావు, డిప్యూటి స్పీకర్‌ పద్మాదేవేందర్‌ రెడ్డి, నీటి పారుదల శాఖ అధికారులతో కలిసి ఘనపూర్‌ ఆనికట్‌ పైన, మంజీరా నది పొడవునా ముఖ్యమంత్రి ఏరియల్‌ సర్వే నిర్వహించారు. ఈ సందర్బంగా ఘనపూర్‌ ఆనికట్‌పై సమీక్ష చేశారు. మంజీరా నది ద్వారా 4.06 టి.ఎం.సి. ల నీటి కేటాయింపు ఘనపూర్‌ ఆనికట్‌కు ఉందన్నారు. దీని ద్వారా ధర్మంగా 25 వేల ఎకరాలకు సాగునీరు అందాలని, కాని ప్రస్తుతం 12 వేల ఎకరాలకు మాత్రమే నీరందుతున్నదని ముఖ్యమంత్రి అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో 25 వేల ఎకరాలకు నీరందించాలని, వీలయితే మరో 5 వేల ఎకరాలకు ఎక్కువగానే నీరివ్వాలని ముఖ్యమంత్రి చెప్పారు. ఆనికట్‌ కాలువల్లో బాగా పూడిక పేరుకుపోయిందని, దాన్ని తొలగించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. కాలవలన్ని మట్టితోనే ఉన్నందున అవి పూడుకుపోయాయని, కాలువలకు లైనింగ్‌ వేయడం ద్వారా చివరి ఆయకట్టు వరకు నీటిని పంపాలని చెప్పారు. ఆనికట్‌లో పూర్తి స్థాయి నీటి మట్టం ఉంటే పరిసర ప్రాంతాల్లోని పంట పొలాలు మునిగే అవకాశం ఉందని, ఈ ప్రమాదాన్ని నివారించడానికి కరకట్టలు నిర్మించాలని సిఎం ఆదేశించారు. పూర్తి స్థాయి నీటి నిలువ సామార్థ్యాన్ని కాపాడటానికి తీసుకోవలసిన చర్యలపై అధ్యయనం జరిపి నివేదిక సమర్పించాలని ముఖ్వమంత్రి ఆదేశించారు. ఘనపూర్‌ ఆనికట్‌ పరిధిలో తాను గతంలో పాద యాత్రలు చేశానని, మంజీరా నదిలో ఇక్కడే పుష్కర స్నానం చేశానని సిఎం గుర్తు చేసుకున్నారు. సమైక్య పాలనలో ఘనపూర్‌ ఆనికట్‌ నిర్వహణను విస్మరించారని,కాలువలకు లైనింగ్‌ వేయకపోవడం వల్ల అవి శిథిలమై పోయాయని ముఖ్యమంత్రి అన్నారు. ఇప్పుడు ఈ ఆనికట్‌పై పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించాలని నిర్ణయించామన్నారు. 1905లో నిర్మించిన ఈ ఆనికట్‌ ద్వారా కొత్తగా పంట పొలాలను ముంచకుండానే ఎక్కువ నీటిని నిలువ చేసుకునే మార్గాలు అన్వేషించాలన్నారు. ఒకటిన్నర నుండి రెండు టి.ఎం.సి.ల నీరు నిలువ ఉండేలా చర్యలు తీసుకోవాలని, నీరు పంట పొలాలకు తరలిస్తున్న కొద్ది ఏర్పడే ఖాళిని సింగూర్‌ ప్రాజెక్టు ద్వారా భర్తీ చేసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు