ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు -అఖిలపక్ష సమావేశం

హైదరాబాద్‌ నగరానికి సంబంధించిన పలు అంశాలు చర్చించడానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు అధ్యక్షతన మంగళవారం అఖిలపక్ష సమావేశం జరిగింది. హుస్సెన్‌సాగర్‌ ప్రక్షాళన, నగరంలో భూ కబ్జాలు, పేదలకు ఇండ్ల స్థలాల పంపిణీ, మెట్రో రైలు అలైన్‌మెంట్‌ మార్పు తదితర అంశాలపై ఈ సమావేశంలో కూలంకషంగా చర్చ జరిగింది. డిప్యూటి సిఎం మహమూద్‌ అలీ, మంత్రులు నాయిని నర్సింహరెడ్డి, ఈటెల రాజేందర్‌, పద్మారావు, ప్రభుత్వ సలహాదారుడు పాపారావు, కాంగ్రేస్‌ ప్రతినిధులు కేఆర్‌.సురేష్‌రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, ...నిరంజన్‌, టిడిపి ప్రతినిధులు ఎల్వి.రమణ, ఎర్రబెల్లి దయాకర్‌రావు, నర్సిరెడ్డి, ఎంఐఎం ప్రతినిధులు అక్బరుద్దిన్‌ ఓవైసీ, జాఫ్రీ, బిజేపి ప్రతినిధులు జి.కిషన్‌రెడ్డి, కె.లక్ష్మణ్‌, వైఎస్‌ఆర్‌ కాంగ్రేస్‌ ప్రతినిధి తాటి వెంకటేశ్వర్లు, సిపిఎం ప్రతినిధులు సున్నం రాజయ్య, తమ్మినేని వీరభద్రం, సిపిఐ ప్రతినిధులు రవీంద్రకుమార్‌, చాడ వెంకట్‌రెడ్డి, టిఆర్‌ఎస్‌ ప్రతినిధులు వేణుగోపాలాచారి, పి.రాజేశ్వర్‌రెడ్డి, ఇంధ్రకరణ్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, సీనియర్‌ అధికారులు నర్సింగరావు, ప్రదీప్‌చంద్ర, రేమాండ్‌పీటర్‌, నాగిరెడ్డి, ఎస్‌కె.జోషి, మీనా, జిహెచ్‌ఎంసి కమీషనర్‌ సోమేష్‌కుమార్‌, హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు మీనా, శ్రీధర్‌, మెట్రో రైల్‌ ప్రాజెక్టు ఎండి. ఎంవిఎస్‌.రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 
. ప్రపంచంలో మరే నగరానికి లేనటువంటి గొప్ప అవకాశం హుస్సెన్‌సాగర్‌, . అందుకే ప్రభుత్వం హుస్సెన్‌సాగర్‌ ప్రక్షాళన చేపట్టాలని నిర్ణయించుకున్నదని వివరించారు. తెలంగాణ అభివృద్దికి, ఆర్థిక స్థితికి సంకేతంగా హుస్సెన్‌సాగర్‌ చుట్టూ ఆకాశహర్మ్యాలు నిర్మించాలనే ప్రతిపాదనను కూడా ముఖ్యమంత్రి సమావేశంలో ప్రస్తావించారు. వివిధ నాలాల నుంచి వచ్చే మురికి నీరు హుస్సెన్‌సాగర్‌లోకి చేరడం వల్ల ఎక్కువ కాలుష్యం అవుతున్నదని చెప్పారు. గణేష్‌ నిమజ్జనం, దేవి నవరాత్రుల సందర్బంగా అమ్మవారి విగ్రహాల నిమజ్జనం వల్ల కూడా జల కాలుష్యం జరుగుతుందని చెప్పారు. దీనికి ప్రత్యామ్నాయంగా వినాయకసాగర్‌ నిర్మించే ఆలోచనను కూడా ముఖ్యమంత్రి వివరించారు. హుస్సెన్‌సాగర్‌ను పూర్తి స్థాయిలో శుద్ది చేయాలని, అందుకు అవసరమైన చర్యలు తీసుకునే విషయంలో ప్రభుత్వానికి అండగా వుంటామని వివిధ పక్షాల నాయకులు హామినిచ్చారు. హుస్సెన్‌సాగర్‌ చుట్టూ ఆకాశహర్మ్యాలు నిర్మించాలని అన్ని పార్టీల నాయకులు చెప్పారు.
హైదరాబాద్‌ను సింగపూర్‌లా మార్చాలని కొంతమంది సభ్యులు చెప్పగా ముఖ్యమంత్రి భిన్నంగా స్పందించారు. హైదరాబాద్‌కు ప్రపంచ వ్యాప్తంగా ఓ ప్రత్యేక గుర్తింపు ఉందని, మరో సిటితో పోల్చాల్సిన అవసరం హైదరాబాద్‌కు లేదని ముఖ్యమంత్రి అన్నారు. హైదరాబాద్‌ను హైదరాబాద్‌లాగానే అభివృద్ది చేస్తామని అన్నారు.
హైదరాబాద్‌లో చాలా మంది పేదలు పొట్ట చేతబట్టుకుని వివిధ జిల్లాల నుండి వచ్చి నివసిస్తున్నారని, వారు మురికి వాడల్లో అత్యంత దయనీయ స్థితిలో ఉన్నారని ముఖ్యమంత్రి అన్నారు. వారు నివాసం ఉంటున్న ప్రాంతాల్లో తాము గుడిసెలు వేసుకున్న స్థలాన్ని ప్రభుత్వమే వారికి ఉచితంగా ఇవ్వాలని భావిస్తున్నదని ముఖ్యమంత్రి చెప్పారు. పేదల కోసం ప్రభుత్వమే బహుళ అంతస్తుల భవనాలు నిర్మిస్తుందన్నారు. ఇతర మౌలిక సదుపాయాలు కూడా కల్పిస్తామని చెప్పారు. ఈ నిర్ణయం పట్ల అన్ని రాజకీయ పక్షాలు హర్షం వ్యక్తం చేశాయి. పేదలు నివాసం ఉంటున్న 80 నుండి 125 గజాల వరకు వారి పేరిటనే పట్టాలు ఇవ్వాలని ఉచితంగా క్రమబద్దీకరించాలని సమావేశంలో నిర్ణయించారు.
హైదరాబాద్‌ నగర పరిధిలో వేలాది ఎకరాలు కబ్జాకు గురయ్యాయని వాటి విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించదలుచుకున్నదని ముఖ్యమంత్రి చెప్పారు. ప్రభుత్వ భూమిలో ఇప్పటికే నిర్మాణాలు చేపట్టిన వారికి రెగ్యులరైజ్‌ చేసుకునే అవకాశం ఇచ్చే ప్రతిపాదనను ముఖ్యమంత్రి పార్టిల ప్రతినిధులకు వివరించారు. కబ్జాకు గురయినప్పటికి ఖాలీగా ఉన్న భూముల విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. భవిష్యత్తులో మళ్లి కబ్జాలు జరుగకుండా ఒక పటిష్ట చట్టం తీసుకురావాలనే ప్రతిపాదన కూడా ప్రభుత్వం వద్ద ఉందన్నారు. హైదరాబాద్‌ నగర భూముల కబ్జాలకు సంబంధించిన పూర్తి వివరాలను గురువారం లోగా అన్ని పార్టీలకు అందిస్తామని, వాటిని పరిశీలించి ఈ నెల 16న నిర్వహించే అఖిలపక్ష సమావేశంలో అభిప్రాయాలు చెప్పాలని ముఖ్యమంత్రి కోరారు.
నగరంలోని చారిత్రక ప్రాంతాలు, వారసత్వ ఆస్తులు, ప్రార్థనా మందిరాలు, ప్రజల మనోభావాలతో ముడిపడిన చిహ్నాలు చెదిరిపోకుండా మెట్రో రైలు ప్రాజెక్టును ముందుకు తీసుకుపోవాలని ప్రభుత్వం భావిస్తున్నదని ముఖ్యమంత్రి చెప్పారు. హైదరాబాద్‌లో మెట్రో రైలు ప్రాజెక్టు ముందుకు పోకుండా కొంతమంది కుట్రలు చేస్తున్నారని, తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని, అలాంటి వారి అంచనాలను తొక్కుకుంటూ మెట్రో ప్రాజెక్టు శరవేగంగా ముందుకు పోతున్నదన్నారు. కొన్ని ప్రాంతాల్లో అభ్యంతరాలు వచ్చాయని, అందుకే మూడు చోట్ల అలైన్‌మెంట్‌ మార్చాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. అసెంబ్లీ ముందునుండి కాకుండా అసెంబ్లి వెనుకవైపు వెళ్లే విధంగా మార్గాన్ని మార్చడానికి, సుల్తాన్‌బజార్‌కు ఇబ్బంది రాకుండా ఉమెన్స్‌ కాలేజి వెనుకవైపు నుండి వెళ్లే విధంగా మార్చే మార్గాన్ని ముఖ్యమంత్రి సమావేశంలో వివరించారు. దీనికి సభ్యులు అంగీకారం తెలిపారు. ఓల్డ్‌ సిటిలో నిర్మించతలపెట్టిన మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే రూపొందించిన రూట్‌ విషయంలో వచ్చిన అభ్యంతరాలను సమావేశంలో చర్చించారు. ప్రస్తుత రూట్‌ వల్ల జరిగే విధ్వంసాన్ని ముఖ్యమంత్రితో పాటు మెట్రోరైలు ప్రాజెక్టు అధికారులు వివరించారు. ఈ రూట్‌కు సంబంధించిన వివరాలను సభ్యులకు మ్యాప్‌లతో సహా అందించారు. ఈ విషయంలో కూడా రాజకీయ పక్షాలు తమ అభిప్రాయాలను 16న జరిగే సమావేశంలో వెల్లడించాలని ముఖ్యమంత్రి కోరారు. హైదరాబాద్‌కు సంబంధించిన అంశాలను చర్చించడానికి అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయడం, అన్ని విషయాలపై చర్చించడం పట్ల అన్ని రాజకీయ పక్షాలు హర్షం వ్యక్తం చేశాయి. ప్రభుత్వం ఏలాంటి దాపరికం లేకుండా అన్ని వివరాలను డాక్యుమెంట్లతో సహా రాజకీయ పక్షాలకు అందించే కొత్త ఓరవడికి శ్రీకారం చుట్టడాన్ని కూడా నాయకులు అభినందించారు. తనకు మరో ఎజెండా లేదని, తెలంగాణ రాష్ట్ర అభివృద్దిలో అందరిని కలుపుకుని పోతానని అందు కోసమే అఖిలపక్ష సమావేశం నిర్వహించామని ముఖ్యమంత్రి చెప్పారు. భవిష్యత్తులో అఖిలపక్ష సమావేశాలు కొనసాగుతాయని కూడా వెల్లడించారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

వ్యయమం ఎప్పుడు చేయాలి…..

మీరు వ్యయమం చేయటానికి నిశ్చయించుకున్నారా … మరీ ఎప్పుడు ఎక్సైజ్ చేయాలి .. ఏ సమయం అనుకులం అనే అంశాలను న్యూయార్క్ కు చేందిన ఓ రిసర్చ్ సంస్థ కొన్ని సూచనలు చేసింది . ఉదయం టిఫిన్‌ చేయక ముందు వ్యయమానికి పూనుకొనటం తో దినమంతా   శరీరంలో ఉన్న ఫ్యాట్‌ను కరిగించటానికి ఉపయోగపడుతూ శక్తిని ఇస్తుంది . ఉదయం చేయటం వలస బరువు తగ్గటానికి   ముఖ్యంగా లావు కాకుండా ఉండటానికి దొహదపడుతుంది . శరీరానిక కావసిన శక్తిని సమకూరుస్తూ ,    మనం తీసకున్న ఆహారాన్ని జీర్ణించుకొవడమే కాకుండా దినమంతా కొవ్వును కరిగించటానికి ఉపయోగపడుతుంది . ఓ పరశీలన లో   ఎక్సైజ్‌ చేసిన వారు . ఎక్సైజ్ చేయని వారు ఇరువురిని   వారం పాటు ఒకే రకమైన ఆహారం తీసుకున్న తర్వాత పరిశీలిస్తే , ఉదయం ఎక్సైజ్ చేసివారు , చేయని వారి మధ్య వ్యత్తాసం కనిపించింది . చేయని వారు కొంత   శరీర బరువు పెరగడం జరిగింది . ఉదయం వ్యయమం చేయటం మంచిదని చెబుతున్నారు .

తెలంగాణకు హరితహారం

తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని ఈ నెల 8న నల్గొండ జిల్లాలో ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ప్రారంభించనున్నారు. అదే రోజు అన్ని జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపిలు, ఎమ్మెల్సీలు, అధికారులు తమ తమ జిల్లాల్లో, తమ శాఖల పరిధిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లే జాతీయ రహదారిపై తెలంగాణ సరిహద్దుల వరకు 165 కిలోమీటర్ల మేర రోడ్డుకిరువైపులా అందమైన రకరకాల పూల చెట్లు, నీడనిచ్చే చెట్లు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కా ర్యక్రమాన్ని నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్ద కాపర్తి వద్ద ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. అదే సమయంలో 165 కిలోమీటర్ల రోడ్డుపై ఒకేసారి 85 వేల మంది మొక్కలు నాటుతారు. హైదరాబాద్ శివార్లలోని రామోజీ ఫిల్మ్ సిటీ దగ్గరున్న అబ్దుల్లామెట్ నుంచి నల్గొండ జిల్లా కోదాడ మండలం నల్లబండగూడెం వరకు మొక్కలు నాటుతారు. ఈ మొత్తం రహదారిని 14 సెంగ్మెంట్లుగా విభజించారు. ఒక్కో సెంగ్మెంటుకు ఒక్కో అధికారిని ఇన్‌చార్జ్‌గా నియమించారు. ఈ కార్యక్రమాన్ని హరితహారం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్ పర్యవేక్షిస్తున్నారు. స్వయం సహాయక బృందాల సభ...

సీఎంపై వైసీపీ నేత రోజా తీవ్ర వ్యాఖ్యలు

ముఖ్యమంత్రిగా కిరణ్ మూడేళ్ల పాలనంతా అస్తవ్యస్తమేనని... వేసీపీ నేత రోజా విమర్శించారు. ఆయనకు మూడేళ్లూ కుర్చీ కాపాడుకోవటానికి సరిపోయిందన్న రోజా... వైఎస్ పథకాలను పేర్లు మార్చి మళ్లీ ప్రవేశపెడుతున్నారని ఆరోపించింది. కిరణ్ ముఖ్యమంత్రి అవుతారని తెలిసుంటే... 2009లోనే ప్రజలు కాంగ్రెస్ ను గెలిపించి ఉండేవారు కాదని వ్యాఖ్యానించింది