ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

డిసెంబర్, 2014లోని పోస్ట్‌లను చూపుతోంది

తునీసియా తరహాలో హైదరాబాద్‌ అభివృద్ది

తునీసియాలో నిర్మిస్తున్న కొత్త నగరం తరహాలో హైదరాబాద్‌ను అభివృద్ది చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు అన్నారు. సౌది అరేబియా రాయల్‌ ఫామిలీ ప్రతినిధి డాక్టర్‌ ఫయిజ్‌ అల్‌ అబెడీన్‌ మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రిని కలుసుకున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినందుకు, కొత్త ప్రభుత్వాని ఏర్పాటు చేసి అభివృద్ది పథంలో నడుస్తున్నందుకు సౌది అరేబియా రాజు పంపిన అభినందన వర్తమానాన్ని ముఖ్యమంత్రికి అందజేశారు. ఈ సందర్బంగా ఫయిజ్‌ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఓ ఆదర్శవంతమైన లౌకిక రాష్ట్రంగా  ముందుకు పోతున్నదన్నారు. ముస్లింలకు అత్యంత ఆదరణ లభిస్తున్నదని చెప్పారు. పునర్‌నిర్మాణ దశలో ఉన్న తెలంగాణకు సహకారం అందించాలని తాము నిర్ణయించుకున్నామని చెప్పారు. విద్యుత్‌ ప్రాజెక్టులు నెలకొల్పడం, నాణ్యమైన బొగ్గును సరఫరా చేయడం, అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడం, వైద్య రంగంలో సహకరించడం లాంటి లక్ష్యాలు తమకు ఉన్నాయన్నారు. కొత్తగా నిర్మిస్తున్న తునీసియా నగర నమూనాను ముఖ్యమంత్రికి చూపించారు. ఎంటర్‌టైన్‌మెంట్‌ సిటి, స్పోర్ట్స్‌ సిటి లాంటి 16 వేరు వేరు సిటీలతో నిర్మాణంలో ఉన్న తునీసియా కొత్త నగర అనిమేషన్‌ దృశ్యా...

తెలంగాణ రాష్ట్రంలో థర్మల్, హైడల్ విద్యుత్ పాటు పవన, సౌర విద్యుత్ ఉత్పత్తి

తెలంగాణ రాష్ట్రంలో థర్మల్, హైడల్ విద్యుత్ పాటు పవన, సౌర విద్యుత్ ఉత్పత్తికి గల అవకాశాలను కూడా పరిశీలించాలని, దీనిపై అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అన్నారు. విద్యుత్ ఉత్పత్తి రంగంలో అనుభవం ఉన్న గ్రీన్ కో ప్రతినిధులు సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిసి పలు ప్రతిపాదనలు అందించారు. తెలంగాణ రాష్ట్రంలో 2018 వరకు 800 మెగావాట్లకు పైగా సోలార్, విండ్ పవర్ ఉత్పత్తి చేస్తామని, ఆరు వేల కోట్ల పెట్టుబడులు పెడతామని ప్రతిపాదించారు. అవసరమైన స్థలం కేటాయించాలని కోరారు. ఈ సందర్భంగా ముఖ ్యమంత్రి తెలంగాణ రాష్ట్రంలో థర్మల్, హైడల్ తో పాటు పవన్ విద్యుత్, సౌర విద్యుత్ ఉత్పత్తి అవకాశాలను పరిశీలించాలని అధికారులకు సూచించారు. ఇప్పటికే ఒక దఫా సౌర విద్యుత్ కోసం టెండర్లు పిలిచామని, అవసరమైతే మరోసారి టెండర్లు పిలవాలని ముఖ్యమంత్రి చెప్పారు. రాష్ట్రంలో దాదాపు 2 వేల మెగావాట్ల వరకు వ్యవసాయ విద్యుత్ డిమాండ్ ఉన్నదని, పగటి పూట విద్యుత్ అందించే సోలార్ వ్యవస్థను వ్యవసాయ పంపుసెట్లకు అనుసంధానం చేస్తే ఉభయ తారకంగా ఉంటుందని ముఖ్యమంత్రి అన్నారు. అటు పగటి పూట కరెంటు అందివ్వవచ్చని, సోలార్ విద్యుత్ ను పూర్తి స్థాయిలో వినియ...

మెదక్‌ జిల్లా సాగునీటి అవసరాలు

మంజీరా నీటిని మెదక్‌ జిల్లా సాగునీటి అవసరాల కోసం పూర్తి స్థాయిలో వినియోగించుకొనే విధంగా తమ ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేసిందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు అన్నారు. మంజీరా నీరు హైదరాబాద్‌ ప్రజల మంచినీటి అవసరాల కోసం వినియోగిస్తున్నందువల్ల ప్రస్తుతం మెదక్‌ జిల్లాకు సాగునీటి కొరత ఏర్పడుతున్నదన్నారు. కృష్ణా నది నీటిని హైదరాబాద్‌  తరలించి మంజీరా నీటిని మెదక్‌ జిల్లాలో వినియోగించాలన్నది తమ లక్ష్యమని సిఎం ప్రకటించారు. మంజీరా నీటిని సింగూర్‌ ప్రాజెక్టులో నిలువ చేసి ఘనపూర్‌ ఆనిక ట్‌ ద్వారా మెదక్‌ జిల్లాలో 25 వేల ఎకరాలకు నీరందించే విధంగా పనులు చేయాలని ముఖ్యమంత్రి అన్నారు. మెదక్‌ జిల్లా పుల్చారం మండలంలో మంజీరా నదిపై నిర్మించిన ఘనపుర్‌ ఆనికట్‌ను ముఖ్యమంత్రి సందర్శించారు. నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీష్‌రావు, డిప్యూటి స్పీకర్‌ పద్మాదేవేందర్‌ రెడ్డి, నీటి పారుదల శాఖ అధికారులతో కలిసి ఘనపూర్‌ ఆనికట్‌ పైన, మంజీరా నది పొడవునా ముఖ్యమంత్రి ఏరియల్‌ సర్వే నిర్వహించారు. ఈ సందర్బంగా ఘనపూర్‌ ఆనికట్‌పై సమీక్ష చేశారు. మంజీరా నది ద్వారా 4.06 టి.ఎం.సి. ల నీటి కేటాయింపు ఘనపూర్‌ ఆనికట్‌కు ఉందన్నారు. దీని ద్...

తెలంగాణా కొత్త మినిస్టర్స్ శాఖలు

1.  సి . లక్ష్మా రెడ్డి -ఎనర్జీ  2.  అజ్మీరా చందూలాల్ -ఎస్ టి డెవలప్మెంట్ ,టూరిజం   3.  జూపల్లి కృష్ణ రావు -ఇండస్ట్రీస్ ,హన్డ్లూం  టెక్స్టైల్స్ షుగర్  4.  తుమ్మాల నాగేశ్వర్ రావు - రోడ్స్ అండ్ బిల్డింగ్స్ ,విమెన్ చైల్డ్ డెవలప్మెంట్  5.  ఇంద్రకరణ్ రెడ్డి -హౌసింగ్ ,లా అండ్ ఎండోమెంట్  6. తలసాని శ్రీనివాస్ యాదవ్ -కమర్షియల్ టాక్స్,సినిమాటోగ్రఫీ   అదనపు బాద్యతలు  1.  పద్మా రావు -మినిస్టర్  ఫర్  ఎక్సైజ్  అండ్ ప్రొహిబిషన్ , స్పోర్ట్స్ అండ్ యూత్ సర్వీసెస్  2.  జోగు రామన్న -మినిస్టర్ ఫర్ ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ , బ్యాక్ వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ 

తెలంగాణా పబ్లిక్ సర్వీస్ కమిషన్

తెలంగాణా ప్రబుత్వం తెలంగాణా పబ్లిక్   సర్వీస్ కమిషన్ ను ,గంట చక్రపాణి చైర్మన్ గా ,విట్టాల్  అండ్ చంద్రావతి మెంబెర్స్ గా నియమించడం జరిగింది 

తెలంగాణా సర్కార్ లో కొత్త గా 6 మంత్రులు ప్రమాణ స్వీకారం

అంతర్జాతీయ స్థాయి సినిమాసిటి, స్పోర్ట్స్‌ సిటిలు :కె.చంద్రశేఖర్‌ రావు

తెలంగాణలో అంతర్జాతీయ స్థాయి సినిమాసిటి, స్పోర్ట్స్‌ సిటిలను నిర్మించనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు చెప్పారు. అందుకు రంగారెడ్డి, నల్గొండ జిల్లాల సరిహద్దులోని రాచకొండ ప్రాంతం అనువైనదని ముఖ్యమంత్రి వెల్లడించారు. విద్యా శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి, రవాణా శాఖ మంత్రి పి.మహేందర్‌ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మలతో కలిసి రాచకొండ ప్రాంతంలో ముఖ్యమంత్రి సోమవారం ఏరియల్‌ సర్వే నిర్వహించారు. రాచకొండ ప్రాంతంలో కాలినడకన కూడా తిరిగి ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. దాదా ... పు 31 వేల ఎకరాలకు పైగా భూమి ఈ ప్రాంతంలో ఉందని, ఇది తెలంగాణలో పలు పరిశ్రమలు, సంస్థలు, విద్యాలయాలు స్థాపించడానికి అనువైనదని చెప్పారు. కాలుష్యం వెదజల్లని సంస్థలన్నింటిని ఇక్కడే నెలకొల్పాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. సినిమా సిటి,స్పోర్ట్స్‌ సిటి, విశ్వవిద్యాలయాలు, ఇతర సంస్థలను ఇక్కడ ఏర్పాటు చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. రాచకొండ ప్రాంతంలో చదును ఉన్న భూమి ఎక్కువగా ఉంది, కొద్దిపాటి కొండ ప్రాంతాలు కూడా ఉన్నాయి. వీటిన్నింటిని ఉపయోగించుకొని తెలంగాణకు తలమానికంగా నిలిచే సంస్థలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి నిర...

హైదరాబాద్‌ అంతర్జాతీయ స్థాయి ఆధునిక నగరం

చారిత్రక ఆనవాళ్లు చెరిగిపోకుండానే హైదరాబాద్‌ను అంతర్జాతీయ స్థాయి ఆధునిక నగరంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు అన్నారు. సచివాలయంలో గురువారం ప్రముఖ ఆర్కిటెక్ట్‌ హఫీజ్‌ బృందంతో హైదరాబాద్‌లో చేపట్టాల్సిన పలు నిర్మాణాలపై చర్చించారు. మ్యాప్‌లు పరిశీలించారు. గూగుల్‌ ఎర్త్‌ ద్వారా వివిధ ప్రాంతాలను కొత్త కట్టడాల కోసం గుర్తించారు. హఫీజ్‌ బృందం నగరంలోని మూసి నది చుట్టు ప్రక్కల ప్రాంతాల్లో చేపట్టాల్సిన నిర్మాణాల ప్రతిపాదనలను కూడా పరిశీలించారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి కొత్త నిర్మాణాలకు సంబంధించి పలు సూచనలు చేశారు. ముందుగా ఇందిరా పార్క్‌ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో తెలంగాణ కళా భారతి పేరుతో అంతర్జాతీయ స్థాయి కన్వెన్షన్‌ సెంటర్‌ నిర్మించాలని సూచించారు. ఇందుకు సంబంధించి డిజైన్‌ తయారు చేయాలన్నారు. నాలుగు ఆడిటోరియాలు, విశాలమైన పార్కింగ్‌ ఏరియా వచ్చే విధంగా నమునా తయారు చేయాలని సూచించారు. ఒక ఆడిటోరియంలో 2500-3000 మంది పట్టే విధంగా, మరో దాంట్లో 1500 మంది, మూడో దాంట్లో 1000 మంది, నాలుగు దాంట్లో 600 మంది పట్టే విధంగా ఆడిటోరియాలు డిజైన్‌ చేయాలన్నారు. ప్రస్తుతం రవీంద్రభారతి ఉన్న ప్రాంతంలో హైద...

సంక్రాంతి నుంచి స్మార్ట్ ఆంధ్ర ప్రదేశ్ ప్రారంభం

  ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రతి పల్లె ను ప్రజా ప్రతినిధులు  ,ఎంపి లు ,మంత్రులు నుంచి MPTC ల వరకు  ,మిగిలిన వాటిని కార్పో రేషన్ లు ,NRI, సిని రాజకీయ ప్రముఖులు ,IAS,IPS లు ఏదో ఒక గ్రామం లేక ఒక వార్డును దత్తత తీసుకోని అబిరుద్ది చేయాలనీ పిలుపునిచ్చారు  . అబిరుద్ది చేసే కార్యక్రమం కు సంబందించిన పరిజ్ఞానం  UNICEF అందిస్తుందని చెబుతున్నారు 

ఆరు నెలలు-50 వేల కోట్ల పెట్టుబడులు

ఆరు నెలలు కస్టపడి ఆంధ్ర ప్రదేశ్ కు 50 వేల కోట్ల పెట్టుబడులు, అందులో 12 భారీ కార్పోరేషన్ లు ,13 భారీ,మధ్యతరహ  పరిశ్రమలు ,200 చిన్న తరహ సంస్థలు  చంద్ర బాబు నాయుడు తిరుకోచ్చారని పార్టీ నేతలు చెబుతున్నారు 

కోమటి చెరువు టూరిజం ప్రాజెక్టు శంఖుస్థాపన

- రూ. 4.8 కోట్ల వ్యయంతో నీటి పారుదల శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన సిద్దిపేట కోమటి చెరువును ఆధునీకరించే పనులను శంఖుస్థాపన చేసిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు. - రూ. 2 కోట్లతో టూరిజం శాఖ ఆధ్వర్యంలో చేపట్టే సిద్దిపేట కోమటి చెరువు కట్ట సుందరీకరణ పనులకు శంఖుస్థాపన చేసిన సిఎం కేసిఆర్‌.

నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ కన్‌స్ట్రక్షన్‌ (నాస్‌ డాక్‌) -ఆవిష్కరణ

నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌ (నాక్‌) పేరును నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ కన్‌స్ట్రక్షన్‌ (నాస్‌ డాక్‌) గా మార్చాలని గవర్నింగ్‌ బాడి సమావేశంలో నిర్ణయించారు. నాక్‌ గవర్నింగ్‌ బాడి సమావేశం మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్‌ రావు అధ్యక్షతన జరిగింది. నిర్మాణ రంగంలో కొత్త ఆవిష్కరణలను అందిపుచ్చుకునే విధంగా నాక్‌ తయారు కావాలని ముఖ్యమంత్రి కోరారు. నిర్మాణ రంగంలోని వివిధ విభాగాలకు చెందిన వారిలో వృత్తి నైపుణ్యం పెంచే విధంగా శిక్షణా కార్యక్రమా లు ఉండాలన్నారు. అందుకే నాక్‌ పేరును నాస్‌ డాక్‌ గా మార్చుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. నాక్‌ ఉద్యోగుల జీతాలను 20 శాతం పెంచాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ ఇంజనీరింగ్‌ గ్రాడ్యూయెట్లకు తగు శిక్షణ ఇవ్వాలని, క్లాస్‌ 1 కాంట్రాక్టర్ల వద్ద శిక్షణనిప్పించి వారిని నిలదొక్కుకునేలా తయారు చేయాలని సూచించారు. గ్రీన్‌ బిల్డింగ్‌ కాన్సెప్ట్‌ ప్రకారం నిర్మాణాలు జరిగే విధంగా నాక్‌ చొరవ చూపాలన్నారు. తక్కువ స్తలంలో ఎక్కువ మంది చాలా సౌకర్యవంతంగా విధులు నిర్వహించే విధంగా భవన నిర్మాణ డిజైన్‌లు ఉండాలన్నారు. సమావేశంలో ప్ర...

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు -అఖిలపక్ష సమావేశం

హైదరాబాద్‌ నగరానికి సంబంధించిన పలు అంశాలు చర్చించడానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు అధ్యక్షతన మంగళవారం అఖిలపక్ష సమావేశం జరిగింది. హుస్సెన్‌సాగర్‌ ప్రక్షాళన, నగరంలో భూ కబ్జాలు, పేదలకు ఇండ్ల స్థలాల పంపిణీ, మెట్రో రైలు అలైన్‌మెంట్‌ మార్పు తదితర అంశాలపై ఈ సమావేశంలో కూలంకషంగా చర్చ జరిగింది. డిప్యూటి సిఎం మహమూద్‌ అలీ, మంత్రులు నాయిని నర్సింహరెడ్డి, ఈటెల రాజేందర్‌, పద్మారావు, ప్రభుత్వ సలహాదారుడు పాపారావు, కాంగ్రేస్‌ ప్రతినిధులు కేఆర్‌.సురేష్‌రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, ... నిరంజన్‌, టిడిపి ప్రతినిధులు ఎల్వి.రమణ, ఎర్రబెల్లి దయాకర్‌రావు, నర్సిరెడ్డి, ఎంఐఎం ప్రతినిధులు అక్బరుద్దిన్‌ ఓవైసీ, జాఫ్రీ, బిజేపి ప్రతినిధులు జి.కిషన్‌రెడ్డి, కె.లక్ష్మణ్‌, వైఎస్‌ఆర్‌ కాంగ్రేస్‌ ప్రతినిధి తాటి వెంకటేశ్వర్లు, సిపిఎం ప్రతినిధులు సున్నం రాజయ్య, తమ్మినేని వీరభద్రం, సిపిఐ ప్రతినిధులు రవీంద్రకుమార్‌, చాడ వెంకట్‌రెడ్డి, టిఆర్‌ఎస్‌ ప్రతినిధులు వేణుగోపాలాచారి, పి.రాజేశ్వర్‌రెడ్డి, ఇంధ్రకరణ్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, సీనియర్‌ అధికారులు నర్సింగరావు, ప్రదీప్‌చంద్ర, రేమాండ్‌పీటర్‌...

టీం ఇండియా

తెలంగాణా ముఖ్యమంత్రి కే సీ ఆర్  ముఖ్యంగానాలుగు అంశాలను   చీఫ్ మినిస్టర్స్ మీటింగ్  లో ప్రస్తావించారు . "టీం ఇండియా "  అనే  కూటమి ,రాష్ట్రాల అంశాలను , వారి వాదనలను విన్నవిన్చుకోవడానికి ఒక వేదిక తోర్పడుతుందని ,అన్ని రాష్ట్రాల ప్రతినిధులతో జాతీయ స్థాయిలో సెక్రటేరియట్ నిర్మించి ప్రణాళికల వ్యూహాలను చర్చిన్చుకోవచ్చని  తెలిపారు . రాష్ట్రాలు అబిరుద్ది చెందినప్పుడే దేశం అబిరుద్ది చెందుతుందని చెప్పారు 

ముఖ్యమంత్రి కేసిఆర్‌ స్పందన

రాజకీయాలు వేరు, మితృత్వం వేరు...   మెదక్‌ జిల్లాకు చెందిన సీనియర్‌ రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి చెరుకు ముత్యం రెడ్డి గురువారం సచివాలయానికి వచ్చారు. నీరసంగా కనిపించిన చెరుకు ముత్యంరెడ్డిని ముఖ్యమంత్రి గమనింఛి .. . కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుసుకున్నారు .  ఆమెరికాకు వెళ్లి మంచి వైద్యం చేయించుకోవాలని సూచించారు. . డబ్బు విషయం నాకు వదిలిపెట్టు ముందు  ఆరోగ్యం కాపాడుకోండి అని ముఖ్యమంత్రి చెప్పారు. వెంటనే సిఎంఓ అధికారులను పిలిపించి .. . ప్రపంచంలోనే మెరుగైన వైద్యం అందే ఆమెరికాలోని స్లోన్‌ కెట్టెరింగ్‌ ఆసుపత్రికి ముత్యం రెడ్డి పంపాలని ఆదేశించారు. ఆమెరికా వెళ్లి వైద్యం చేయించుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. పాస్‌పోర్టు, వీసాలతో పాటు అక్కడ వైద్యుల అపాయింట్‌మెంట్‌ తదితర వ్యవహారాలను కూడా ముఖ్యమంత్రి కార్యాలయం నుండే పర్యవేక్షించాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి కేసిఆర్‌ స్పందన చూసిన తరువాత చెరుకు ముత్యంరెడ్డి చమర్చిన కళ్లతో కృతజ్ఞతలు తెలిపారు.

తెలంగాణా వాటర్ గ్రిడ్ పైలాన్ నమూనాలు

"బంగారు తల్లి" సినిమా- వినోదపు పన్ను మినహాయింపు

అమ్మాయిలను వ్యభిచార కూపాలకు పంపే దురాచారానికి వ్యతిరేకంగా,సామాజిక దుస్థితిని కళ్లకు కట్టినట్లు చూపించిన నా బంగారు తల్లి సినిమాను ప్రభుత్వ పరంగా ప్రొత్సహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. సినిమాకు వంద శాతం వినోదపు పన్ను మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించారు. అమ్మాయిల అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమా ఎక్కువ భాగం హైదరాబాద్‌లోనే నిర్మించారని, ఇందులో నటీ నటులు కూడా తెలంగాణ వారే ఎక్కువగా ఉన్నారని ముఖ్యమంత్రి అన్నారు. సమాజానికి మంచి సందేశం అందించే ఇతివృత్తంతో ఈ సినిమా తీశారని ముఖ్యమంత్రి చెప్పారు. ఇలాంటి సినిమాలను ప్రొత్సహించడం ఓ విధానంగా తెలంగాణ ప్రభుత్వం పెట్టుకున్నదని అన్నారు. సినిమాకు రూపకల్పన చేసిన స్వచ్చంద కార్యకర్త ప్రజ్వలను ముఖ్యమంత్రి అభినందించారు. ఇప్పటికే మూడు జాతీయ అవార్డులు కూడా గెలుచుకున్న ఈ చిత్రం మరిన్ని సామాజిక చిత్రాలు రావడానికి ప్రేరణ కావాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు

హోంగార్డుల పెంచిన జీతాలు

డిసెంబర్‌ 6న హోంగార్డుల ఆవిర్బావ దినోత్సవాన్ని పురస్కరించుకొని... ప్రతి నిత్యం విధుల్లో అంకితభావంతో పనిచేస్తున్న హోంగార్డుల పట్ల ప్రభుత్వం అత్యంత ఉదారంగా వ్యవహరిస్తుందని...  రాష్ట్రంలో పనిచేస్తున్న  16 వేల మంది హోంగార్డుల వేతనాన్ని 9 వేల నుండి 12 వేలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. ఈ ఏడాది బడ్జెట్‌ ఇప్పటికే పూర్తయినందున వచ్చే ఏడాది బడ్జెట్‌లో పొందుపరిచి 2015 ఏప్రిల్‌ మాసం నుండి పెంచిన జీతాలు అందించాలని అధికారులను ఆదేశించారు. హోంగార్డులకు మెడికల్‌ ఇన్సూరెన్సు, ఏడాదికి రెండు డ్రస్సులు, హైదరాబాద్‌, సైబరాబాద్‌ కమీషనరేట్‌ పరిధిలో బస్‌ పాసులు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం నెలకు రెండు సార్లు పరేడ్‌ అలవెన్సు పేరిట ఇస్తున్న రూ. 28/- ని 100/- రూపాయలకు పెంచుతున్నట్లు  ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు  ప్రకటించారు.