ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

చారిత్రాత్మక ఉస్మానియా విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలు

చారిత్రాత్మక ఉస్మానియా విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు అన్నారు. శతాబ్ది ఉత్సవాలలో భాగంగా ఉస్మానియా యూనివర్సిటీ పూర్వవైభవాన్ని నూతన తెలంగాణ రాష్ట్రంలో తిరిగి నెలకొల్పాలని సిఎం తెలిపారు. ఏప్రిల్ నెలలో నిర్వహించనున్న శతాబ్ది ఉత్సవాలకు సంబంధించి రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లతో సోమవారం ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం ముఖ్యమంత్రి నిర్వహించారు. 


 ఒకప్పుడు ప్రపంచంలోని గొప్ప యూనివర్సిటీల్లో ఒకటిగా వెలగొందిన ఉస్మానియా యూనివర్సిటీ తన వైభవాన్ని రాను రాను కోల్పోవడం దురదృష్టకరమన్నారు. అయితే పట్టుదలతో చారిత్రక ఘనతను తిరిగి నెలకొల్పేందుకు ప్రభుత్వం ఎంత ఖర్చుకయినా వెనకాడబోదని స్పష్టం చేశారు. వీటితో పాటు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని యూనివర్సిటీల్లో నాణ్యమైన విద్యనందించేందుకు ప్రభుత్వం కట్టుబడి వున్నదన్నారు. విశ్వ విద్యాలయాలను సమూలంగా ప్రక్షాళన చేసే దిశగా వైస్ చాన్సలర్లు నడుం బిగించాలన్నారు. మెస్ చార్జీలతో సహా హాస్టల్ వసతులు తదితర అన్ని మౌలిక సౌకర్యాలను పునరుద్దరించాలని సిఎం ఆదేశించారు. వలస పాలకుల ఏలుబడిలో కునారిల్లిన తెలంగాణలోని యూనివర్సిటీ విద్యను తిరిగి బలోపేతం చేయాల్సిన బాధ్యత వీసీలదేనని సిఎం స్పష్ఠం చేశారు.

సంబురాలు అంబరాన్నంటాలె:

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం జరుపుకోనున్న ఉస్మానియా శతాబ్ది ఉత్సవాలను బ్రహ్మాండంగా నిర్వహించుకోవాల్సిన అవసరమున్నదని సిఎం స్పష్టం చేశారు. ఏప్రిల్ లో నిర్వహించనున్న ఉత్సవాలలో తెలంగాణ వ్యాప్తంగా పండుగ వాతావరణం కనిపించాలని వివరించారు. ఆర్ట్స్ కాలేజీ క్యాంపస్ ప్రాంగణంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉస్మానియాకు అనుబంధంగా వున్న వివిధ కళాశాలలతో పాటు హైద్రాబాద్ లో ఉన్న నిజాం, కోటి ఉమెన్స్ తదితర కాలేజీల్లో కూడా నిర్వహణకు సంబంధించి పండుగ వాతావరణం కనిపించాలన్నారు. కాకతీయ తదితర యూనివర్సిటీలోని విద్యార్థులు కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొనేటట్లు ఏర్పాట్లు చేయాలన్నారు. యూనివర్సిటీలో విద్యనభ్యసించి దేశంలోనేకాక, ప్రపంచ వ్యాప్తంగా ఉన్నత స్థానాల్లో స్థిరపడ్డ వివిధ రంగాలకు చెందిన వారందరినీ ఆహ్వానించి గౌరవించుకోవాలన్నారు. అన్ని యూనివర్సిటీల వీసీలతో కమిటీలు ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. ఇందుకు సంబంధించి మరింత కసరత్తు చేయాలని కె. కేశవరావు ఆధ్వర్యంలోని కమిటీకి సిఎం ఆదేశించారు. కాగా సోమవారం జరిగిన సమీక్షా సమావేశంలో పలు అంశాలు చర్చించారు. ఉత్సవాల నిర్వహణ విధి విధానాలెట్లుండాలె? ఎన్ని రోజులు నిర్వహించాలె? రాష్ట్రపతి లేదా ప్రధానిని ఆహ్వానించడంతో సహా ఘనంగా నిర్వహించే దిశగా కార్యాచరణ ఎట్లుండాలె? దేశంలో గతంలో జరిగిన వివిధ యూనివర్సిటీలు శతాబ్ది ఉత్సవాలు జరిపితే వాటిని పరిశీలించాలని ఇందుకు సంబంధించి ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు. వాటి ఆధారంగా విధివిధానాలను ఖరారు చేసుకుని తనకో నివేదిక అందజేయాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఎంపీ కె. కేశవరావులను సిఎం ఆదేశించారు. త్వరలో మరోసారి సమావేశమై ఖచ్చితమైన తేదీలతో సహా ఉస్మానియా యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలకు సంబంధించిన తుది నిర్ణయం ఖరారు కానున్నది.

సమీక్షా సమావేశంలో ఎంపీ కె. కేశవరావు, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రి జగదీశ్ రెడ్డి, ఎంపీ బాల్క సుమన్, ప్రభుత్వ సలహాదారు పాపారావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డిలతో పాటు, ఉస్మానియా యూనివర్సిటీ వైస్ చాన్సలర్ రామచంద్రరావు, కాకతీయ యూనివర్సిటీ వీసీ ప్రొ.ఆర్.సాయన్న, డా.బీ.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీ. ప్రొ.కె. సీతారామారావు, జెఎన్టీయు వీసీ. ప్రొ.ఎ. వేణుగోపాల్ రెడ్డి, మహాత్మా గాంధీ యూనివర్సిటీ వీసీ. ప్రొ. అల్తాప్ హుస్సేన్, తెలుగు విశ్వ విద్యాలయం వీసీ ఎస్వీ సత్యనారాయణ, నల్సార్ యునివర్సిటీ వీసీ ప్రొ. ఫైజాన్ ముస్తఫా, ఉన్నత విద్యామండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి, తెలంగాణ యునివర్శిటీ వీసీ పి. సాంబయ్య, జెఎన్టీయు ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ వీసీ ప్రొ. కవితా దర్యాని రావు, సిఎంవో అధికారులు తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలంగాణా సర్కార్ లో కొత్త గా 6 మంత్రులు ప్రమాణ స్వీకారం

ఇస్రో సక్సెస్ లో మహిళ మూర్తులు

మౌమీతా దత్త-.విద్యార్థి దశలో ఇస్రొ వైపు ఆకర్షితురాలై.. మార్స్ మిషన్‌ ప్రాజెక్టు మెనెజర్‌గా పని చేస్తుంది ఎన్‌ వలమతి -మెదటి భారత రాడార్‌ ఇమెజింగ్‌ శాలిలైట్‌ రీసాట్‌1 తయారీ లో వాలమతి కీలక పాత్రం పోషించారు రీతు కలిథాల్‌ ఇద్దురు బిడ్డలకు తల్తి ఇంజనీర్‌ తో జరిగే అంతర్మాథనం వారాంతరంలో పాల్గోంటారు. థేసీ థామస్‌-మీసైల్ విమెన్‌ గా పేరు సంపాదించిన మహిళ,అగ్ని నాలుగు,అగ్ని ఐదు మిషన్‌ ను లీడ్‌ చేశారు. అనురాధ టికె-జియోశాట్‌ పొగ్రాం డైరక్టర్‌ గా ఇస్రొ సీనియర్‌ మహిళ అధికారిగా ఉన్నారు. మినాల్‌ సంపత్‌-మార్స్ అర్బిటల్‌ మిషన్‌ కు 18 గంటలు శ్రమంచారు. నందిని హరినాథ్-ఆమె మెట్టమెదటి ఉద్యోగం ఇస్రొలోనే... అలా కొనసాగుతూనే ఉంది.వెనుకకు తిరిగి చూడవలసిన అవసరం రాలేదు. కీర్తి పజుంథార్‌-కంప్యూటర్‌ సైన్టిస్ట్ ,మాస్టర్‌ కంట్రోల్‌ రూంలో శాటిలైట్‌లు సరైన కక్ష్యలో ఉంచే బాధ్యత..

అమెరికా ఎన్నిక‌లు.. భారతీయ భాష‌ల్లో డిజిట‌ల్‌ ప్ర‌క‌ట‌న‌లు

    అమెరికాలో అధ్య‌క్ష ఎన్నిక‌ల ప్ర‌చారం జోరందుకున్న‌ది. అధికార రిప‌బ్లిక‌న్‌లు, ప్ర‌తిప‌క్ష డెమోక్రాట్‌లు పోటీప‌డి ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నారు. ముఖ్యంగా ప్ర‌తిప‌క్ష డిమోక్రాట్‌లు అమెరికాలో ఉన్న‌ భారతీయుల మ‌న‌సులు దోచుకోవడానికి కొత్త‌కొత్త పోక‌డ‌ను అవ‌లంభిస్తున్నారు. మొత్తం 14 భారతీయ భాషల్లో త‌మ‌ అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్‌ గురించి డిజిటల్ ప్ర‌చార ప్ర‌క‌ట‌న‌లు రూపొందించారు. ఆ ప్ర‌క‌ట‌న‌ల ద్వారా ఇండో-అమెరిక‌న్‌ల ఓట్లు అడుగుతున్నారు.  ఆ డిజిట‌ల్ ప్ర‌క‌ట‌న‌ల్లో హామీలు, అభ్య‌ర్థ‌న‌ల‌తోపాటు కొటేష‌న్‌లు, పాట‌లు కూడా ఉన్నాయి. బిడెన్‍ ప్రచార బృందంలో కీలక సభ్యుడైన అజయ్‍ జైన్‍ భుటోరియా భార‌తీయ భాష‌ల్లో రూపొందించిన‌ డిజిట‌ల్ ప్ర‌క‌ట‌న‌ల గురించి వెల్ల‌డించారు. ఇప్పటికే విడుదల చేసిన 'ఛలో ఛలో.. బిడెన్‍ కో ఓట్‍ దో' అనే పాట తారస్థాయిలో ప్రాచుర్యం పొందిందని చెప్పారు. ఇప్పుడు తాజాగా 'జాగో అమెరికా జాగో.. భూల్‍ న జానా బిడెన్‍-హారిస్‍ కో ఓట్‍ దేనా' పేరుతో మ‌రో పాట‌ను విడుదల చేసిన‌ట్లు తెలిపారు.