మన దేశంలో డిమానిటైజేషన్
తో నవంబర్ , డిసెంబర్ లో సామాన్య జనం చాలా ఇక్కట్లు పడ్డారు. క్యాషో ... దేవోడో అని....
ఏటీం ,బ్యాంకుల వద్ద క్యూ లో నిలిచారు. కొన్ని చోట్ల ఏటీఎం ను ద్వంసం చేశారు. క్యాష్
కు అలవాటు పడిన జనం ఒక్కసారి క్యాష్ లేక పోవటంతో అల్లాడి పొయారు. భారత దేశం లో చాలా
లావదేవీలు క్యాష్ రూపంలోనే జరుగుతాయి.ఇప్పడిప్పుడే డెబిట్ కార్డ్,క్రెడిట్ కార్డ్‌కు ప్రజలు అలవాటు
పడుతున్నారు. గ్రామాలో మాత్రం ఇంకా కార్డు వాడకం లేదు. నగదు రూపంలోనే లావదేవీలు జరుగుతున్నాయి. కానీ..అస్సాం రాష్ట్రం ...గోవాహాటీకి 32 కి.లో దూరంలో
ఉన్న 'టైవా' గిరిజన గ్రామం మాత్రం నగదు రహిత
లావదేవీలు ఇప్పటికి కొనసాగిస్తుంది.
ప్రతి సంవత్సరం
'టైవా' తేగ ప్రజలు ఇచ్చిపుచ్చుకొనే.. నగదు రహిత, బాటర్ పద్దతిని 500 సంవత్సరాలనుంచి అస్సాం,మేఘలయా
పర్వత ప్రాంతంలో జీవించే వీరు మూడు రోజుల పాటు మోరీగావ్ జిల్లాలో మేలా నిర్వహిస్తారు.
'జుబీలీ మేలా' పేరుతో పిలువబడే ఈ సంత లో అన్ని
రకాల వస్తువులను మార్పడి పద్దతిలో కొనడం, అమ్మడం జరుగుతుంది.
ఈ మేలా కు మూడు
రోజుల ముందే టైవా, కార్బీ,ఖాసీ, జైంతియా తేగ జాతి వారు పర్వత పరిసర ప్రాంతాల నుంచి
ఈ మేలా లో తమ వివిధ రకాలను వస్తువులను తీసుకొస్తారు.
సాధారణంగా ఈ మేలా జనవరి చివరి వారంలో అల్లం,బాంబు షూట్,పసుపు, గుమ్మడి కాయలు, వివిధ
రకాలైన ముందులను ఔషదాలను,ఎండు చేపలను ,పితాస్ పేరుతో వరి చెక్కల లావదేవీలను నిర్వహిస్తారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి