ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

కడప ఉక్కు సీమ హక్కు

 కడప ఉక్కు సీమ హక్కు అనే నినాదం తో ఉద్యమం వేడెక్కింది . ఉక్కు పరిశ్రమ వస్తే  సీమ ప్రాంతం లో నిరుద్యోగులకు ఉద్యోగాలు ,కడప,అనంతపురం,చిత్తూర్ జిల్లాలు అభిరుద్ది చెందుతాయని స్టీల్ ప్లాంట్ సాధన సమితి అధ్యక్షులు ప్రవీణ్ కుమార్ రెడ్డి చెబుతున్నారు    జమ్మలమడుగు మండలం వేమగుంటపల్లి, కొత్తగుంట్లపల్లి, పి.బొమ్మేపల్లి, తూగుట్లపల్లి గ్రామాల్లో 10,760 ఎకరాలను బ్రహ్మణి ఉక్కు పరిశ్రమ కోసం తొమ్మిదేళ్ల కిందట కేటాయించారు
 2007 మే 21న రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం జరిగింది. అదే ఏడాది జూన్‌ 10న నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి  చేతుల మీదుగా  అట్టహాసంగా శంకుస్థాపన చేశారు. ఈ పరిశ్రమ ఏర్పాటు ద్వారా ప్రత్యక్షంగా 10 వేల మందికి, పరోక్షంగా లక్ష మందికి ఉపాధి చూపాలన్నది లక్ష్యం. ఏటా రెండు మిలియన్‌ టన్నుల ఉక్కు ఉత్పత్తి చేయగా, 2015 నాటికి 10 మిలియన్‌ టన్నులను ఉత్పాదక సామర్థ్యం పెంచుతామని నాటి ఒప్పందం మాట. అందుకే ఎకరా భూమిని అతి తక్కువగా 18 వేలకు ప్రభుత్వం కేటాయించింది.   . రాష్ట్ర విభజన జరిగిన నాటి నుంచి అదిగో ఇదిగో అంటూ ఊరించే మాటలు  మినహా ఆచరణలో ఒరిగింది శూన్యం.  జిల్లాలో ఉన్న ఖనిజ వనరులతో పారిశ్రామీకరణకు ఊతమిస్తామని పాలకులు పదేపదే చెప్తున్నా నేటికీ ముందడుగు పడలేదు. గత ఆరు నెలల క్రితం జిల్లాలో జరిగిన ఉద్యమాల ప్రభావంతో ఉక్కు పరిశ్రమ స్థాపన సాధ్యాసాధ్యాలపై టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు  కేంద్ర మంత్రి ముప్పవరపు వెంకయ్యనాయుడు ప్రకటన చేశారు. ఇలాంటి ప్రకటనలు ఓ వైపు చేస్తున్నా మరో వైపు సెయిల్, టాస్కో ఫోర్స్,  కేంద్ర కమిటి నివేదికల పేరుతో వచ్చిన ప్రకటనలు మాత్రం జిల్లా వాసుల్లో భరోసాను నింపలేకపోయాయి. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా బృందం కడప జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించి ఖనిజ నిక్షేపాల లభ్యతను పరిశీలించింది. అయితే ఇది వరకు జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కావడం... చివరల్లో కేసుల కారణంగా సాధ్యపడకపోవడంతో విభజన చట్టంలో పొందుపరచిన మేరకైనా సెయిల్ ఆధ్వర్యంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు తద్యమన్న నమ్మకాన్ని జిల్లా వాసులు వ్యక్తం చేశారు.  ఇందులో భాగంగా జిల్లాలోని బ్రహ్మణి పరిశ్రమకిచ్చిన స్థలంతో పాటు కొప్పర్తి పారిశ్రామికవాడ, మైలవరం మండలంలోను స్థలాలను... సాధ్యసాధ్యాలను సెయిల్ అధికారులు పరిశీలించారు. అయితే చివరకు సెయిల్ జిల్లాలో ఉన్న ఖనిజాల ఆధారంగా ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కష్టమని నివేదిక ఇవ్వడంతో జిల్లా వాసుల్లో అనుమానాలకు తావిచ్చింది. రాయలసీమపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరును నిరసిస్తూ స్టీల్ ఫ్యాక్టరీ సాధన సమితి పురుడు పోసుకుంది. ఉక్కు పరిశ్రమతో జిల్లాకు జరిగే లాభాలను, నిరుద్యోగ సమస్యను ఎలా రూపుమాపచ్చో విద్యార్థులతో ఇష్టాగొష్టులు ఏర్పాటు చేస్తూ ముందుకు సాగుతూ వచ్చింది. ఉద్యమాల్లో విద్యార్థులను భాగస్వాములను చేస్తూ నిరసనలు, మానవహారాలు చేపడుతూ వచ్చింది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలంగాణా సర్కార్ లో కొత్త గా 6 మంత్రులు ప్రమాణ స్వీకారం

చానెల్‌ ల రెటింగ్ పద్ధతలో మార్పు అవసరం- నియంత్రన తప్పని సరి

  గత వారం, ముంబై పోలీసులు మూడు న్యూస్ ఛానెళ్లతో కూడిన టిఆర్పి (టార్గెట్ రేటింగ్ పాయింట్స్) రాకెట్టును ఛేదించినట్లు చెప్పారు. అప్పటి నుండి, టిఆర్పిలను పర్యవేక్షించే బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) న్యూస్ ఛానల్స్ రేటింగ్లను మూడు నెలలు నిలిపివేసింది. ఈ కుంభకోణం మరోసారి నియంత్రణ అవసరాన్ని ఎత్తి చూపింది. టెలివిజన్ ఛానెల్‌లు టిఆర్‌పిలచే నడపబడతాయి. వీక్షకుల సంఖ్య వారి వ్యాపారాన్ని నడిపిస్తుంది. భారతదేశంలో వారానికి 760 మిలియన్ -800 మిలియన్ల వ్యక్తులు టీవీని చూస్తున్నారు. గ్రామీణ భారతదేశంలో టీవీ ప్రసారాలు   52% కాగా , పట్టణ భారతదేశంలో ఇది 87%. ఈ డిటిహెచ్ ( డైరెక్ట్ టు హోమ్ ) ద్వారా సుమారు 70 -80 మిలియన్ల గృహాలు , కేబుల్ తో 60 మిలియన్లు టీవీ ప్రసారాలను వీక్షిస్తున్నారు. డెంట్సు   అంచనా (2020)   ప్రకారం భారతదేశం లో మొత్తం ప్రకటనల మార్కెట్ 10 -12 బిలియన్లు . వీటిలో డిజిటల్ వాటా సుమారు 2 బిలియన్లు. ప్రతిరోజూ 550 మిలియన్ల మంది వ్యక్తులు, సుమారు 3.45 గంటలు టీవీ టీవీలో వీక్షిస్తున్నారు.   భారత దేశంతో ఈ 800 కి పైగా ...

ఇస్రో సక్సెస్ లో మహిళ మూర్తులు

మౌమీతా దత్త-.విద్యార్థి దశలో ఇస్రొ వైపు ఆకర్షితురాలై.. మార్స్ మిషన్‌ ప్రాజెక్టు మెనెజర్‌గా పని చేస్తుంది ఎన్‌ వలమతి -మెదటి భారత రాడార్‌ ఇమెజింగ్‌ శాలిలైట్‌ రీసాట్‌1 తయారీ లో వాలమతి కీలక పాత్రం పోషించారు రీతు కలిథాల్‌ ఇద్దురు బిడ్డలకు తల్తి ఇంజనీర్‌ తో జరిగే అంతర్మాథనం వారాంతరంలో పాల్గోంటారు. థేసీ థామస్‌-మీసైల్ విమెన్‌ గా పేరు సంపాదించిన మహిళ,అగ్ని నాలుగు,అగ్ని ఐదు మిషన్‌ ను లీడ్‌ చేశారు. అనురాధ టికె-జియోశాట్‌ పొగ్రాం డైరక్టర్‌ గా ఇస్రొ సీనియర్‌ మహిళ అధికారిగా ఉన్నారు. మినాల్‌ సంపత్‌-మార్స్ అర్బిటల్‌ మిషన్‌ కు 18 గంటలు శ్రమంచారు. నందిని హరినాథ్-ఆమె మెట్టమెదటి ఉద్యోగం ఇస్రొలోనే... అలా కొనసాగుతూనే ఉంది.వెనుకకు తిరిగి చూడవలసిన అవసరం రాలేదు. కీర్తి పజుంథార్‌-కంప్యూటర్‌ సైన్టిస్ట్ ,మాస్టర్‌ కంట్రోల్‌ రూంలో శాటిలైట్‌లు సరైన కక్ష్యలో ఉంచే బాధ్యత..