కొత్తగా ఏర్పాటయ్యే ప్రతీ జిల్లా కేంద్రంలో మొదటి రోజు నుంచి కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలు పనిచేయాలని, అదే విధంగా కొత్తగా ఏర్పాటయ్యే మండలాల్లో కూడా పోలీస్ స్టేషన్లు, మండల రెవిన్యూ కార్యాలయాలు పనిచేయాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ఆదేశించారు. వీలైనంత వరకు ప్రతీ రెవిన్యూ డివిజన్లో ఆర్డిఓతో పాటు డిఎస్పీ స్థాయి అధికారి ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు. కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి చేపట్టాల్సిన అధికారిక కసరత్తుపై మంగళవారం క్యాంపు కార్యాలయంలో సిఎం సమీక్ష జరిపారు. మంత్రులు టి. హరీష్ రావు, కెటి.రామారావు, పోచారం శ్రీనివాసరెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, డిజిపి అనురాగ్ శర్మ సిఎంఒ ముఖ్య కార్యదర్శులు నర్సింగ్ రావు, శాంతకుమారి, స్మితా సభర్వాల్ నగర పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. 17 కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ముసాయిదాలో ప్రకటించామని, ఇవి కాకుండా జనగామ, సిరిసిల్ల, గద్వాల, ఆసిఫాబాద్ జిల్లాల ఏర్పాటు కూడా పరిశీలనలో వుందని, వీటికి తోడు కొత్త డివిజన్లు, మండలాలు ...