యూపీఏ ప్రభుత్వం
తలపెట్టిన నగదు బదిలీ పథకం ద్వారా కేంద్రం అందించే రాయితీని లబ్దిదారులకు నగదు రూపంలో చెల్లిస్తారు.తొలివిడత
రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో పథకాన్ని అమలు చేయనున్నట్టు కేంద్ర
ఆర్థిక మంత్రి చిదంబరం ప్రకటించారు.
సబ్సిడీ మొత్తాన్ని ఆన్ లైన్ ద్వారా నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో
జమ చేస్తారు . ఈ నగదు బదిలీ పథకం ద్వారా ఒక్కో కుటుంబానికి ఏడాదికి రూ.30 నుంచి
రూ.40 వేల రుపాయల్ని అందిస్తారు. నగదు బదిలీ పథకాన్ని జనవరి నుంచి ప్రారంభించాలని కేంద్రం
నిర్ణయించింది. మొదట విడతగా 51 జిల్లాల్లో దీన్ని అమలు చేసి, 2014 నాటికి
16 రాష్ట్రాలకు విస్తరిస్తారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే రాయితీ పథకాలు, ఉపకార వేతనాలు, గ్యాస్
సబ్సిడీ పథకాల రాయితీని నగదు రూపేణా చెల్లిస్తారు.
.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి