మన రాష్ట్రం నుంచి ఆఫ్రికా దక్షిణ
ప్రాంతంలోని అంగోలా దేశానికి పొట్టచేత పట్టుకుని దేశం కాని దేశం లో 300 మంది తెలుగువారు
తుపాకుల నీడన ప్రతి దినమొక గండంగా గడుపుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో? తెలియని ఆందోళనలో కొట్టిమ్ట్ట్డుతున్నారు.బిక్కుబిక్కుమంటూ రోజులు వెళ్లదీస్తున్నారు. అతి కష్టంపైన తన సొంతూరి వాళ్లకు
ఫోన్లు చేసి తమను నరకకూపం నుంచి కాపాడమని దీనంగా
వేడుకుంటున్నారు. ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ తరపున గత ఏడాది
ఆగస్టులో దేశవ్యాప్తంగా దాదాపు 1,500 సిమెంట్ ప్లాంట్‌లో పనిచేసేందుకు వెళ్లారు
అందులో 300 మందికి పైగా తెలుగువారు ఉన్నట్లు తెలుస్తుంది ఒప్పందం మేరకు కొద్దిరోజులు సవ్యంగానే జరిగింది. ఈ సంవత్సరం మార్చి నుంచి ఇబ్బందులు మొదలయ్యాయి. కంపని వేతనాలు సక్రమంగా చెల్లించడం మానివేసింది. యాజమాన్యం స్థానిక కరెన్సీ అయిన ‘క్వాంజా’లలో చెల్లింపులు చేసింది దాని వలన .కావాల్సిన వస్తువుల కొనుగోలుకు సరిపోతుంది.డాలర్లలోకి మార్చుకునే అవకశం లేకపోవడంతో కార్మికులు డాలర్లలోనే వేతనం చెల్లించాలని పట్టుబట్టారు.తమ నిరసనను తెలిపారు . అక్కడి పోలీసు బలగాలు ఉన్న పళంగా కార్మికుల క్యాంపులోకి చొచ్చుకు వచ్చి విచక్షణా రహితంగా లాఠీచార్జితో కాల్పులు జరిపారు .ఈ విషయం మన సి ఎం కు తెలియటంతో ఇండియన్ ఎంబసీ అధికారులకు లేఖ రాసారు. కాని ఎటువంటి పలితం రాలేదు .
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి