ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

వజ్ర బస్సులు ప్రారంభం


టీఎస్‌ ఆర్టీసీని నష్టాల నుంచి గట్టెక్కించేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తున్నానని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. కొత్తగా ప్రవేశపెట్టిన వజ్ర మినీ బస్సులను ప్రారంభించారు. . ప్రయాణికుల సౌకర్యార్థం వివిధ కాలనీ నుంచి వజ్ర బస్సులు నడుస్తాయని సీఎం చెప్పారు. హైదరాబాద్‌లోని పలు కాలనీ నుంచి వరంగల్‌, నిజామాబాద్‌కు వజ్ర సర్వీసులు నడుస్తాయని తెలిపారు. త్వరలోనే మరిన్ని నగరాలకు ఈ సర్వీసులను ఏర్పాటు చేయనున్నామని వెల్లడించారు. వజ్ర బస్సులు దేశంలోనే వినూత్నమైనవిగా నిలవాలని సీఎం కేసీఆర్‌ ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా ప్రగతి భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో కేసీఆర్‌ మాట్లాడుతూ గతంలో ఆర్టీసీని ప్రైవేటు పరం చేస్తారేమోనన్న భయం ప్రజల్లోనూఆర్టీసీ ఉద్యోగుల్లోనూ ఉండేదన్నారు. పట్టణ ప్రాంతాల్లో ఆర్టీసీకి నష్టాలు సర్వసాధారణం అయిపోయాయని అన్నారు. ఆర్టీసీని నష్టాల నుంచి గట్టెక్కించే చర్యల్లో భాగంగా హైదరాబాద్‌ పరిధిలోని ఆర్టీసీ నష్టాలను జీహెచ్‌ఎంసీ నిధులతో పూడ్చాలని చర్చించామనిఇక నుంచి ప్రతినెలా జీహెచ్‌ఎంసీ నుంచి ఆర్టీసీకి కొన్ని నిధులు వచ్చేలా చేస్తామన్నారు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు