రెండేళ్ల కాలం పూర్తి చేసుకొన్నా కిరణ్ కుమార్ ఈ కాలం లో ఎన్నో ఆటుపోట్లు,నిరసనలు,తెలంగాణ మంత్రుల రాజీనామాలు, సీబీఐ విచారణ,శాసనసభలో ప్రభుత్వంపై అవిశ్వాసం.సకల జనుల సమ్మె ,సొంత పార్టీ లోనే ప్రతిపక్షం,వైఎస్ జగన్మోహనరెడ్డి సొంత పార్టీ పెట్టుకోవడం, మరోవైపు కేంద్ర మంత్రులు జైపాల్ రెడ్డి, కిషోర్ చంద్రదేవ్ లు సీఎం కిరణ్ కుమార్ రెడ్డిపై కోపం,తెలంగాణ ఉద్యమం,తాజాగా ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ పార్టీ దోస్తీ వీడటం,ఇలాంటి సమస్యలను ఎదుర్కొని విజయం సాధించారు .అధిష్టానం బరోసా లభించింది నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి 2010 నవంబర్ 25న రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు రైతులకు, మహిళలకు పావలా వడ్డీకి రుణాలను వడ్డీలేని రుణాలుగా మార్చారు. యువతకు ఉపాధి కల్పిన కోసం రాజీవ్ యువకిరణాలు మహిళలకు రుణాల కోసం స్త్రీనిధి బ్యాంకు ఏర్పాటు,ఇందిరమ్మ బాట పేరుతో జిల్లాల పర్యటనలు చేసి ప్రజలకు చేరువయ్యారు .