తెలంగాణ రాష్ట్ర సమితి 16వ ప్లీనరీ హైదరాబాద్‌లోని కొంపల్లిలో ఘనంగా ప్రారంభమైంది. ముందుగా తెరాస అధ్యక్షుడు కేసీఆర్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఆనంతరం కేసీఆర్ ప్రారంభోపన్యాసంతో ప్లీనరీ ప్రారంభమైంది. తెరాస అధికారంలోకి వచ్చాక జరుగుతున్న మూడో ప్లీనరీ ఇది. రాష్ట్రంలో పలు రాజకీయ పరిణామాల నడుమ, ఎన్నికలకు మరో రెండేళ్ల గడువు మాత్రమే మిలిగి ఉన్న సమయంలో జరుగుతున్న ఈ ప్లీనరీకి పార్టీ ఎంతో ప్రాధాన్యమిస్తోంది. మూడేళ్ల పాలనను సమీక్షించడంతో పాటు వచ్చే రెండేళ్ల కార్యాచరణను పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్లీనరీ ప్రాంగణంలో ప్రకటించనున్నారు. మొదట్లో ప్లీనరీ, తెరాస ఆవిర్భావ దినోత్సవాలు ఒకేరోజు జరిగేవి. పార్టీ కార్యక్రమాల విస్తృతిలో భాగంగా ప్లీనరీ, సభను విడివిడిగా జరుపుతున్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి