ప్రభుత్వ వైద్యాన్ని బలోపేతం చేయడానికి ఎన్ని నిధులైనా విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి నిమ్స్ వరకు ఏ ఆసుపత్రికి ఏమి చేయాలనే విషయంలో సమగ్ర నివేదిక రూపొందించాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు చెప్పారు.
ప్రభుత్వ వైద్యశాలలు పరిశుభ్రమైన వాతావరణంలో ఉంచడానికి, ఆసుపత్రుల్లో పడకలు, విద్యుత్, టాయిలెట్లు, బెడ్ షీట్లు సరైన, బెడ్ షీట్లను ఎప్పటికప్పుడు మార్చాలని, వాటిని శుభ్రం చేయడానికి మెకనైజ్డ్ లాండ్రీ సిస్టమ్ ....హైదరాబాద్ లో ప్రస్తుతమున్న గాంధీ, ఉస్మానియాలకు తోడుగా మరో నాలుగు వెయ్యి పడకల ఆసుపత్రులను నిర్మించాలని, అందుకు అనువైన స్థలాలు ఎంపిక చేయాలని....ఉప్పల్ - ఎల్ బి నగర్ ప్రాంతాల్లో ఒకటి, మల్కాజిగిరి - కంటోన్మెంట్ ప్రాంతాల్లో ఒకటి, కుత్బుల్లాపూర్ - కూకట్ పల్లి ప్రాంతాల్లో ఒకటి, శేరిలింగంపల్లి - రాజేంద్రనగర్ ప్రాంతాల్లో ఒకటి చొప్పున మొత్తం నాలుగు పెద్ద ఆసుపత్రులు నిర్మించాలన్నారు.
ఆయుర్వేదం, హోమియో, యునాని వైద్యంలో కూడా మెరుగైన సేవలు అందించడానికి ఏమికావాలో అది చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ వైద్యశాలలకు ఏమి కావాలంటే అది ఇస్తామని, అంతిమంగా ప్రైవేటు ఆసుపత్రులకన్నా మెరుగ్గా అవి తయారు కావాలన్నారు.
108, 104 సేవలను మరింత బలోపేతం చేయడానికి అనువైన విధానం రూపొందించాలని, హైవేల మీద పెట్రోలింగ్ చేసే వాహనాలతో ఈ వాహనాలను కూడ అనుసంధానం చేయాలని చెప్పారు. ప్రమాదాలు సంభవించిన సమయంలో పోలీస్, ఆరోగ్య శాఖ సమన్వయంతో పనిచేయాలని డిజిపి అనురాగ్ శర్మకు చెప్పారు
బడ్జెట్ సమీక్షల్లో భాగంగా శనివారం ఉదయం వైద్య, ఆరోగ్య శాఖపై ముఖ్యమంత్రి సమీక్ష జరిపారు.. రోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి, ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజెందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి బిపి ఆచార్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి తివారి, ఆర్థిక శాఖ కార్యదర్శులు రామకృష్ణ రావు, శివశంకర్, సమాచార శాఖ కమిషనర్ నవీన్ మిట్టల్, సిఎంఓ ముఖ్య కార్యదర్శి నర్సింగ్ రావు, అదనపు ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి, సిఎం ప్రత్యేక కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి