హైదరాబాద్ నుంచి 170 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే కొల్లాపూర్ (మహబూబ్నగర్ జిల్లా) పట్టణం మరో 8 కిలోమీటర్లు ముందుకెళితే సోమశిల కృష్ణానది దర్శనమిస్తాయి. నదిలో తూర్పువైపునకు శ్రీశైలం రిజర్వాయరు వరకు ప్రయాణం.. జీవితంలో ఒక మధురానుభూతిని, ఈ నదిలో 8 నెలల పాటు జలవిహారం చేసేందుకు. ప్రస్తుతం నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం వరకు ప్రభుత్వ పర్యాటక సంస్థే మరబోటులో ప్రయాణం నిర్వహిస్తున్నది.
చుక్కల కొండ:కృష్ణానదీ ప్రవాహంలో మైమరపించే ప్రదేశం చుక్కల కొండ. నదిలో చెట్లు కమ్మేసి ఆకాశం కనిపించదు.. చీకటిగా ఉంటుంది.చుక్కల్లా కనిపిస్తాయి. దీంతో ఆ ప్రాంతానికి చుక్కల కొండ అని పేరు వచ్చింది.
అక్కమహాదేవి
గుహలు
శ్రీశైలం నుంచి 16 కిలోమీటర్ల దూరంలో నల్లమల గట్టుపై అక్కమహాదేవి గుహలు ఉన్నాయి. శ్రీశైలం వైపు ప్రాజెక్టు నీటిలో ఉన్న చివరి పర్యాటక కేంద్రం. అక్కడికి నేరుగా పాతాళ గంగ నుంచి కూడా వెళ్లే అవకాశం ఉన్నది.
శ్రీశైలం నుంచి 16 కిలోమీటర్ల దూరంలో నల్లమల గట్టుపై అక్కమహాదేవి గుహలు ఉన్నాయి. శ్రీశైలం వైపు ప్రాజెక్టు నీటిలో ఉన్న చివరి పర్యాటక కేంద్రం. అక్కడికి నేరుగా పాతాళ గంగ నుంచి కూడా వెళ్లే అవకాశం ఉన్నది.
ఆంకాళమ్మ కోట
చీమల తిప్పకు పక్కనే ఆంకాళమ్మ కోట ఉన్నది. ఇక్కడ కాళికాదేవి కొలువై ఉంది. కృష్ణానదిలో చేపల వేట కొనసాగిస్తున్న మత్స్యకారులకు, చెంచులకు ఆరాధ్య దైవంగా వెలుగొందుతోంది. 16వ శతాబ్దంలో నిర్మించిన ఈకోట ప్రస్తుతం శిథిలావస్థకు చేరింది

ప్రస్తుతం నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం వరకు ప్రభుత్వ పర్యాటక సంస్థే మరబోటు ప్రయాణం నిర్వహిస్తున్నది.కొండకోనల్లో కృష్ణానది వంపు సొంపులు. పచ్చటి కొండల మధ్య కనిపించే దట్టమైన అటవీ సౌందర్యాన్ని ఆస్వాదించవచ్చు.
పాపికొండలను తలదన్నేట్లుగా నల్లమల కొండల మధ్య కృష్ణానదిలో ప్రయాణానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తే పాలమూరులో వెనకబడిపోయిన కొల్లాపూర్ రూపురేఖలు మారిపోతాయి
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి